ఔరంగాబాద్(Aurangabad)లో ఓ వ్యక్తి పరాయి స్త్రీ(lady)తో ఉన్నప్పుడు అతడి భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్(viral) అవుతోంది.
ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. స్త్రీకి భూదేవి అంత సహనం ఉంటుందంటారు పెద్దలు. అయితే అదే ఇల్లాలికి కోపం వస్తే.. కాళికాదేవీ అవుతుంది. భర్త(husband) మరో మహిళతో సంబంధం కొనసాగించడం ఏ భార్య(wife)కు ఇష్టం ఉండదు. ఇది అనేక సార్లు రుజువైంది. దీనివల్ల కుటుంబ(family) కలహాలు మొదలై చివరకు భార్యభర్తలు విడిపోయిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అయినా కొంతమంది భర్తల బుద్ది మారదు. అంతే అలాంటి భర్తలను భార్యలు రెడ్హ్యండెడ్(red-handed)గా పట్టుకుని(caught) కాళికాదేవీలా చితకబాదుతారు. ఇటీవల ఔరంగాబాద్(Aurangabad)లో ఓ వ్యక్తి పరాయి స్త్రీ(lady)తో ఉన్నప్పుడు అతడి భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్(viral) అవుతోంది. వీడియో(video)ను చూసిన చాలామంది వివిధ రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. వీడియోలో ఓ హోటల్ ముందు కారు పార్కింగ్ చేసి ఉంది. ఇంతలో ఓ మహిళ ఆ కారు వద్దకు వేగంగా పరుగెత్తుకుంటూ వస్తుంది. వెంటనే కారులోపల ఉన్న మరో మహిళను బయటకు లాగి కొట్టడం ప్రారంభిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
యే కౌన్ హై..
వీడియోలో ఆ మహిళ ముసుగు ధరించి ఉంటుంది. ముసుగు తీయడానికి ఇల్లాలు ప్రయత్నిస్తుంది. కాగా, ఆమె భర్త అడ్డుగా వస్తాడు. భార్యను ఆపడానికి ప్రయత్నిస్తాడు. ప్రియురాలిని భార్య నుంచి కాపాడటానికి ఎదుట ఉన్న మరో వ్యక్తి సాయాన్ని కూడా కోరుతాడు. ముసుగు ధరించిన స్త్రీ ‘యే కౌన్ హై’ అంటూ అరుస్తుంటుంది. దీనిని వీడియోలో మనం స్పష్టంగా చూడవచ్చు. వీడియో చూస్తే గొడవ చేసిన మహిళ భర్త, కారులో కూర్చున్న స్త్రీ ఇద్దరు బహుశా హోటల్కి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతలో అతడిపై అనుమానం ఉన్న భార్య అతడిని ఫాలో చేసింది. దీంతో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఒక ఇన్స్టాగ్రాం యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ హై వోల్టేజ్ డ్రామా తెరకెక్కుతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవడానికి అక్కడ చాలామంది గుమిగూడారు. దీంతో వీడియో వైరల్ అయింది. గొడవ చేసిన మహిళ పట్ల చాలామంది సానుభూతి వ్యక్తం చేశారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.