HOME »NEWS »TRENDING »why that woman climbs mayan pyramid is this the signal to the end of the world nk

Mayan pyramid: మయన్ పిరమిడ్ ఎక్కిన మహిళ... ప్రపంచానికి విపత్తు రాబోతోందా?

Mayan pyramid: మయన్ పిరమిడ్ ఎక్కిన మహిళ... ప్రపంచానికి విపత్తు రాబోతోందా?
మయన్ పిరమిడ్ ఎక్కిన మహిళ... ప్రపంచానికి విపత్తు రాబోతోందా? (image courtesy - youtube)

Mayan pyramid: ఆమె ఎవరు? ఆ పిరమిడ్ ఎందుకు ఎక్కింది? అధికారులు ఎందుకు ముందే అడ్డుకోలేదు? ఈ పరిణామంతో ప్రపంచ దేశాలకు నష్టం జరగనుందా?

  • Share this:
    Mayan pyramid: మయన్ల నాగరికతకూ... యుగాంతానికీ సంబంధం ఉందని చాలా మంది చెబుతుంటారు. ఈ ప్రపంచం ఎప్పుడు అంతరిస్తుందో మయన్లు ముందే లెక్కలు వేశారని చాలా మంది చెబుతుంటారు. మధ్య అమెరికాలో ఈ మయన్ల నాగరికత విలసిల్లింది. అందుకు గుర్తుగా మయన్లు నిర్మించిన ఓ భారీ పిరమిడ్... మెక్సికోలోని యుకాటాన్‌లో ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు రోజూ వచ్చి... ఆ పిరమిడ్‌ను చూస్తూ ఉంటారు. ఫలితంగా అది ప్రాచీన ప్రపంచ వారసత్వ సంపద (ancient World Heritage site)గా గుర్తింపు పొందింది. అలాంటి పిరమిడ్‌ని వీడియో తీస్తూ ఓ మహిళ... గబగబా మెట్లు ఎక్కేసింది. ఆ సమయంలో అక్కడ వందల మంది టూరిస్టులు ఉన్నారు. వాళ్లంతా ఆశ్చర్యపోతూ చూడసాగారు.

    "వామ్మో ఆమె అలా వెళ్లిపోతోందేంటి.. ఎవరూ ఆపరే" అని పర్యాటకులు చూస్తూ ఉండిపోయారు. ఆమె పిరమిడ్ ఎక్కేశాక కళ్లు తెరిచిన అధికారులు... గట్టిగా అరుస్తూ ఆమెను వెనక్కి పిలిపించారు. జనవరి 3న ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.



    ఈ పిరమిడ్‌ని ఎల్ కాస్టిల్లో అని పిలుస్తారు. దీనికి కుకుల్కన్ ఆలయం అనే పేరుంది. మెట్లకు పై భాగంలో 79 అడుగుల ఎత్తైన ఆలయం ఉంది. దానితో కలిపి లెక్కిస్తే ఈ పిరమిడ్ ఎత్తు 98 అడుగులు. నిజానికి ఈ పిరమిడ్ ఎక్కడం అంత తేలిక కాదు. మెట్లు నిలువుగా ఉంటాయి. ఆ మహిళ కూడా ఓ దశలో ఎక్కలేక ఇబ్బంది పడింది. వీడియో చూడండి.

    ఎందుకిలా చేసింది?
    తన చనిపోయిన భర్త చితాభస్మాన్ని ఈ పిరమిడ్ దగ్గర ఉంచుతానని ఆ మహిళ మొక్కుకుంది. ఆ మొక్కు తీర్చేందుకు ఇక్కడకు వచ్చింది. ఐతే... అనుకోకుండా ఇలా ఎక్కేసింది. ఆ మహిళ వాదనను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ విభాగం జనవరి 4న తోసిపుచ్చింది. సెక్యూరిటీ సిబ్బంది, అధికారులూ ఆమెను జాగ్రత్తగా కిందకు దింపి... స్థానిక మున్సిపల్ పోలీసులకు అప్పగించారు. నిబంధనల ప్రకారం... ఎవరూ ఆ పిరమిడ్ ఎక్కకూడదు. దగ్గర నుంచి చూడొచ్చు. ఫొటోలు, వీడియోలూ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఆ మహిళ పోలీసుల కస్టడీలో ఉంది.

    ఇది కూడా చదవండి:Vastu Shastra: శనివారం ఈ వస్తువులు కొంటే అరిష్టమే...

    ప్రపంచానికి ప్రమాదమా?
    ఎప్పుడు యుగాంతం వస్తుందా అని ఎదురుచూసేవారికి ఇప్పుడు ఈ ఘటన ఓ ఆయుధంగా మారింది. ఆ మహిళ మద్యం తాగి మెట్లు ఎక్కిందనీ... పిరమిడ్ ఎక్కడం, అది కూడా మద్యం తాగి ఎక్కడం తీవ్రమైన తప్పిదాలని యుగాంతకారులు అంటున్నారు. యుగాంతం అతి త్వరలో రాబోతోంది అనేందుకు ఇదో సంకేతం అంటున్నారు. ఈ సంవత్సరం తీవ్రమైన పరిణామాలను ప్రపంచం చూస్తుందని హెచ్చరిస్తున్నారు. యాజ్ యూజువల్‌గా ఇలాంటి వాదనలను హేతువాదులు ఖండిస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:January 18, 2021, 14:08 IST