చెట్లు మతానికి వ్యతిరేకం.. అందుకే మొక్కలు పీకే కార్యక్రమం.. వీడియో వైరల్

మన దేశంలో మొక్కల నాటే కార్యక్రమం ఇంత జోరుగా జరుగుతుంటే.. పక్కదేశం పాకిస్తాన్‌లో మాత్రం కొందరు అతివాదులు మొక్కలు పీకే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

news18-telugu
Updated: August 12, 2020, 3:31 PM IST
చెట్లు మతానికి వ్యతిరేకం.. అందుకే మొక్కలు పీకే కార్యక్రమం.. వీడియో వైరల్
మొక్కలు పీకుతున్న అతివాదులు
  • Share this:
వర్షాకాలం వచ్చిదంటే అంతటా మొక్కలు నాటే కార్యక్రమం జోరుగా జరుగుతుంది. చిన్నా పెద్దా అందరూ తమకు నచ్చిన మొక్కలు నాటుతుంటారు. తెలంగాణ ప్రభుత్వం కూడా హరితహారం పేరిట ఏటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం గ్రీన్ చాలెంజ్ విసురుకుంటూ మొక్కలు నాటుతున్నారు. మన దేశంలో మొక్కల నాటే కార్యక్రమం ఇంత జోరుగా జరుగుతుంటే.. పక్కదేశం పాకిస్తాన్‌లో మాత్రం కొందరు అతివాదులు మొక్కలు పీకే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అసలేం జరిగిదంటే...

వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉన్న టాప్-10 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో పచ్చదనం పెంచాలన్న ఉద్దేశంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం దేశవ్యాప్తంగా ఒకేసారి 35 లక్షల మొక్కలను నాటారు. ప్రజలంతా పెద్ద ఎత్తున మొక్కలు పెంచాలని ఆ సందర్భంగా పిలుపునిచ్చారు. ఐతే మొక్కలు నాటిన కొన్ని గంటల్లో ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలోని మండికాస్ జిల్లాలో కొందరు అతివాదులు రెచ్చిపోయారు. మొక్కల పెంపకం తమ మతానికి వ్యతిరేకమంటూ చెలరేగిపోయారు. ఓ గ్రౌండ్‌లో నాటిన దాదాపు 6వేల మొక్కలను పీకేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



వీడియో చూసిన నెటిజన్లు పాకిస్తాన్ అతివాదులపై మండిపడుతున్నారు. పచ్చని చెట్లే లేకపోతే మన బతుకే లేదు..భూగోళానికి రక్షణగా ఉన్న అలాంటి మొక్కలను పీకేస్తారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు మత పెద్దలు సైతం వారి తీరును తప్పుబట్టారు. మతానికి, మొక్కలకు సంబంధం మేంటని ధ్వజమెత్తారు. ఆ వీడియో ఖైబర్ సీఎం మహమూద్ ఖాన్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. మొక్కలు పీకేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Published by: Shiva Kumar Addula
First published: August 12, 2020, 3:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading