హోమ్ /వార్తలు /trending /

petrol price : మోదీకే మాస్టర్ స్ట్రోకా? పెట్రోల్ ధర రూ.25 తగ్గింపు ఉద్దేశమేంటి? 5రాష్ట్రాల ఎన్నికలు?

petrol price : మోదీకే మాస్టర్ స్ట్రోకా? పెట్రోల్ ధర రూ.25 తగ్గింపు ఉద్దేశమేంటి? 5రాష్ట్రాల ఎన్నికలు?

పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో బీజేపీ, నాన్-బీజేపీ పార్టీల మద్య పెద్ద యుద్ధమే కొనసాగుతోంది. ఆ రణరంగంలో ఒక రాజకీయ ఎత్తుగడే జార్ఖండ్ సర్కారు వారి పెట్రోల్ ధర(రూ.25) తగ్గింపు అనే వాదన వాదన తెరపైకొచ్చింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ(ఎన్డీఏ)ను ఇరుకున పెట్టాలనే వ్యూహంతోనే జేఎంఎం(యూపీఏ) పెట్రో బాణాన్ని సంధించినట్లు తెలుస్తోంది..

పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో బీజేపీ, నాన్-బీజేపీ పార్టీల మద్య పెద్ద యుద్ధమే కొనసాగుతోంది. ఆ రణరంగంలో ఒక రాజకీయ ఎత్తుగడే జార్ఖండ్ సర్కారు వారి పెట్రోల్ ధర(రూ.25) తగ్గింపు అనే వాదన వాదన తెరపైకొచ్చింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ(ఎన్డీఏ)ను ఇరుకున పెట్టాలనే వ్యూహంతోనే జేఎంఎం(యూపీఏ) పెట్రో బాణాన్ని సంధించినట్లు తెలుస్తోంది..

పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో బీజేపీ, నాన్-బీజేపీ పార్టీల మద్య పెద్ద యుద్ధమే కొనసాగుతోంది. ఆ రణరంగంలో ఒక రాజకీయ ఎత్తుగడే జార్ఖండ్ సర్కారు వారి పెట్రోల్ ధర(రూ.25) తగ్గింపు అనే వాదన వాదన తెరపైకొచ్చింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ(ఎన్డీఏ)ను ఇరుకున పెట్టాలనే వ్యూహంతోనే జేఎంఎం(యూపీఏ) పెట్రో బాణాన్ని సంధించినట్లు తెలుస్తోంది..

ఇంకా చదవండి ...

    ఉత్పాతాలు ఎప్పుడూ ఊహాతీతంగానే మొదలై విలయాన్ని సృష్టిస్తాయి. రాజకీయాల్లోనైతే ఎక్కడో స్విచ్చు నొక్కితే మరో చోట బల్బు వెలగడమో, ఇంకోచోట ఫలమెంట్ రాలిపోవడమో జరుగుతుంది. వ్యూహచరుతతకు, వ్యూహకర్తలకు గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యం దక్కుతోన్న దరిమిలా ఒక రాజకీయ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు.. మిగతా పార్టీలను, ప్రాంతాలను ప్రభావితం చేస్తోన్న సందర్బాలు చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు పెట్రోల్, డీజిల్ ధరలనే తీసుకుంటే, బీజేపీ, నాన్-బీజేపీ పార్టీల మద్య పెద్ద యుద్ధమే కొనసాగుతోంది. ఆ రణరంగంలో ఒక రాజకీయ ఎత్తుగడే జార్ఖండ్ సర్కారు వారి పెట్రోల్ ధర(రూ.25) తగ్గింపు అనే వాదన వాదన తెరపైకొచ్చింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ(ఎన్డీఏ)ను ఇరుకున పెట్టాలనే వ్యూహంతోనే జేఎంఎం(యూపీఏ) పెట్రో బాణాన్ని సంధించినట్లు తెలుస్తోంది. జార్ఖండ్‌లో ఎన్నికలు లేకున్నా, జేఎంఎం ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయకున్నా, కీలక తరుణంలో పెట్రోల్ బాంబును విసరడం ద్వారా దేశంలో మంటపెట్టడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది..

    లీటర్ పెట్రోల్‌పై రూ.25 తగ్గింపు

    జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్ఛా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి(యూపీఏ) ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు(డిసెంబర్ 29తో) పూర్తయిన సందర్భంగా సంచలన ప్రకటన వెలువడింది. జార్ఖండ్ లో పెట్రోల్ ధర లీటరుపై ఏకంగా రూ.25 తగ్గించారు. పెట్రో ధరల పెరుగుదల వల్ల పేదలు, మధ్యతరగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వారి కష్టాన్ని తీర్చాలనే ఉద్దేశంతోనే పెట్రోల్ ధర తగ్గించామని సీఎం సోరెన్ తెలిపారు. రేషన్ కార్డు కలిగిన ద్విచక్రవాహనదారులకు మాత్రమే రూ.25 తగ్గింపు వర్తిస్తుందని, పెట్రోల్ బంకుల్లో సాధారణ ధర చెల్లించి పెట్రోల్ పోయించుకున్న తర్వాత, ప్రభుత్వం ఆయా లబ్దిదారుల ఖాతాల్లోకి లీటరుకు రూ.25 చొప్పున జమ చేయనుంది. రేషన్ కార్డున్న వాహనదారులకు నెలకు 10లీటర్ల దాకా పెట్రోల్ సబ్సిడీపై అందించనున్నారు. అంటే రేషన్ కార్డున్న ద్విచక్రవాహనదారుల ఖాతాల్లోకి పెట్రోల్ కోసం నెలకు రూ.2500పైగా జమ కానున్నాయి. జనవరి 26 నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. స్థూలంగా ఇది జార్ఖండ్ పేదలు న్యాయం పొందే పథకమే అయినప్పటికీ, రాజకీయంగా మాత్రం దేశంలో అలజడి రేకెత్తించే అంశం కూడా..

    Petrol price సంచలనం: లీటర్ పెట్రోల్‌పై రూ.25 తగ్గింపు.. ఆ కార్డు ఉన్నోళ్లకు మాత్రమే..

    మోదీని ఇరుకున పెట్టాలనే?

    పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం, బీజేపీయేతర ముఖ్యమంత్రుల మధ్య తీవ్ర స్థాయి మాటల యుద్ధాలు జరుగుతుండటం తెలిసిందే. కరోనా కాలమనే కనికరం కూడా లేకుండా రెండేళ్లుగా పెట్రో ధరల్ని విపరీతంగా పెంచేసిన(పెంచుకునేందుకు అనుమతిచ్చిన) మోదీ సర్కారు.. మొన్న దీపావళి సందర్బంలో సడెన్ గా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించి, అన్ని రాష్ట్రాలూ అదే పని చేయాలని కోరడం, సదరు సూచనను నాన్-బీజేపీ సీఎంలు బాహాటంగా విమర్శించడం దుమారం రేపాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కారణంగానే బీజేపీ పెట్రోల్ ధరల్ని తగ్గించడం లేదా నియంత్రించడం చేసిందని విపక్ష నేతలు విమర్శించారు. అయితే, తగ్గింపును ప్రజలు ఎలాగూ స్వాగతిస్తారు కాబట్టి ప్రతిపక్షాల ప్రకటనలకు పెద్ద విలువలేకుండా పోయింది. మరి భగభగ పెట్రో ధరల విషయంలో మోదీని విపక్షాలు ఇరుకునపెట్టేదెలా? అనే ఆలోచనకే ఇవాళ్టి జార్ఖండ్ సర్కారు నిర్ణయం కార్యరూపమనే వాదన వినిపిస్తోంది..

    Lockdown : మరిన్ని నగరాల్లో కఠిన లాక్‌డౌన్.. సరుకులు దొరక్క జనం ఆకలి కేకలు.. ఇదీ తాజా సీన్

    టైమ్ చూసి పెట్రో బాంబు

    జార్ఖండ్ లో పెట్రోల్ ధరల పెంపు నిర్ణయం కచ్చితంగా ఇతర రాష్ట్రాలపై ఉంటుంది. మరీ ప్రత్యేకించి ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ లో పెట్రో ధరల అంశం కీలకం కానుంది. ఎన్నికల రాష్ట్రాల్లో పెట్రో చర్చను మరింత ఎగదోయడానికే యూపీఏ భాగస్వామి హేమంత్ సోరెన్ తగ్గింపు నిర్ణయాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు జనవరి మొదటి వారంలోనే షెడ్యూల్ విడుదల కానుండగా సరిగ్గా అదను చూసి బీజేపీపై ప్రత్యర్థులు పెట్రో బాంబు విసిరినట్లయింది. ఎలాగంటే..

    badminton player : అయ్యో.. ఆదిలక్ష్మి! బ్యాడ్మింటన్ యువ కెరటం చివరి మెసేజ్ కన్నీళ్లు ఆగవు

    బీజేపీ కూడా తగ్గిస్తుందా?

    ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ అధికారంలో ఉన్నది బీజేపీనే. ఒక్క పంజాబ్ లో మాత్రమే కాంగ్రెస్ సర్కారుంది. జార్ఖండ్ తగ్గింపు నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్తులు బీజేపీని ఇరుకున పెడతాయి. ఒక వేళ షెడ్యూల్ ప్రకటనకు ముందే బీజేపీ గనుక (ఆయా రాష్ట్రాల్లో) పెట్రో ధరల్ని తగ్గిస్తే కేవలం ఎన్నికల్లో ఫాయిదా కోసమే ఇలా చేసిందనే అపవాదును అంటగట్టొచ్చు. మొత్తంగా పెట్రోల్ ధరల విషయంలో బీజేపీని బ్లేమ్ చేయడానికి జార్ఖండ్ తగ్గింపు నిర్ణయం ఉపయోగపడే అవకాశాలే ఎక్కువ. ఈలోపు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా అంతో ఇంతో తగ్గింపును ప్రకటిస్తే బీజేపీని పూర్తిగా కార్నర్ చేసే వీలుంటుంది. అయితే, పక్క రాష్ట్రాల ఎన్నికల్లో.. అది కూడా మిత్రులకు లబ్ది చేకూర్చడానికి ఒక రాష్ట్రం తన రెవెన్యూను పణంగాపెట్టి ఇంత పెద్ద(రూ.25 తగ్గింపు) నిర్ణయం తీసుకుంటుందా? అనే వాదన కూడా లేకపోలేదు. కానీ మనం ముందే చెప్పుకున్నాం.. రాజకీయాల్లో ఎక్కడో ఏదో జరిగితే దాని ప్రభావం మరెక్కడో ఇకోలా ఉండొచ్చని!!

    First published:

    ఉత్తమ కథలు