HOME »NEWS »TRENDING »why january 1st to celebrate the precise arrival of the new year su

New Year Eve: జనవరి 1నే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎందుకు..? అసలు ఎప్పటి నుంచి ఇలా జరుపుకుంటున్నారు..?

New Year Eve: జనవరి 1నే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎందుకు..? అసలు ఎప్పటి నుంచి ఇలా జరుపుకుంటున్నారు..?
న్యూ ఇయర్ 2021

ప్రతి ఏడాది డిసెంబర్ 31న గడిచిన ఏడాదికి గుడ్ బై చెబుతూ.. నూతన ఏడాదికి స్వాగతం పలుకుతుంటాం. జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా నూతన ఏడాది ఆరంభ సంబరాలు అంబరాన్ని అంటుతాయి.

 • Share this:
  ప్రతి ఏడాది డిసెంబర్ 31న గడిచిన ఏడాదికి గుడ్ బై చెబుతూ.. నూతన ఏడాదికి స్వాగతం పలుకుతుంటాం. జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా నూతన ఏడాది ఆరంభ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. చాలా మంది న్యూ ఇయర్‌లో తమకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నారు. గత ఏడాది ఏదైన చేదు అనుభవాలు ఎదురైతే అలాంటివి మళ్లీ జరగకూడదని అనుకుంటూ.. నూతన ఏడాదికి ఆహ్వానం పలుకుతుంటారు. చిన్న, పెద్ద తేడా లేకుండా సన్నిహితులతో కలిసి న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెబుతుంటారు. అయితే క్యాలెండర్‌లో 12 నెలలు, 365 రోజులు ఉండగా.. అసలు జనవరి 1నే నూతన సంవత్సరం ప్రారంభ తేదీగా ఎందుకు జరుపుకుంటారనేది చాలా మందికి తెలియదు. అయితే దీని వెనక పెద్ద కథే ఉంది.

  క్రీస్తుపూర్వం 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్.. జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. సూర్యుని చుట్టూ భూమి తిరిగే సమయాన్ని ఆధారంగా చేసుకుని ఈ క్యాలెండర్‌ను రూపొందించారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు, తన చుట్టూ తాను తిరగడానికి దాదాపు 24 గంటల సమయం పడుతుందని మనకు తెలుసు. అయితే ఈ క్యాలెండర్ రూపొందించాక.. సంవత్సరం మొదలుపెట్టాల్సి రోజును సీజర్ ఎంచుకోవాల్సి వచ్చింది. అప్పుడు సీజర్ రోమన్లకు ముఖ్యమైన దేవత జనస్ పేరు మీదుగా జనవరిని ఎంచుకున్నాడు. రోమన్లు జనస్‌ను గాడ్ ఆఫ్ బిగినింగ్స్‌గా భావిస్తారు. అందుకే కొత్త ఏడాది ప్రారంభానికి జనవరి నెలను ఎంచుకున్నారు.  ఆ తర్వాత రోమన్లు తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న కొద్ది ఆ క్యాలెండర్ కూడా మిగిలిన దేశాలకు పాకింది. 5వ శతాబ్దంతో రోమన్ల సామ్రాజ్యం అంతరించి.. క్రైస్తవ సామ్రాజ్యం నెలకొంది. అయితే జనవరి 1ని అన్యమత సంప్రదాయంగా క్రైస్తవులు భావించేవారు. క్రైస్తవ దేశాలన్ని మార్చి 25న కొత్త ఏడాదిగా జరపాలని నిర్ణయించాయి. ఎందుకంటే దేవదూత గాబ్రియల్ మేరికి కనిపించిన తేదీగా దీనికి గుర్తింపు ఉంది. ఏసుక్రీస్తు క్రిస్మస్ రోజున జన్మించినప్పటికీ.. నూతన అవతారానికి జన్మనివ్వబోతున్నట్టు సందేశం అందింది మాత్రం మార్చి 25గా వారు భావించారు.

  చాలా కాలం పాటు క్రైస్తవ దేవాలు మార్చి 25నే నూతన సంవత్సర ఆరంభంగా వేడుకలు జరుపుకున్నారు. అయితే 16వ శతాబ్దంలో పోప్ 13వ గ్రొగొరీ.. గ్రొగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. 1582లో గ్రొగోరియన్ క్యాలెండర్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం జనవరి 1 నే నూతన సంవత్సర ప్రారంభ తేదీగా పునరుద్దరించారు. కానీ ప్రొటెస్టెంట్ వర్గానికి చెందిన ఇంగ్లాడ్ దేశస్తులు.. 1752 వరకు మార్చి 25‌నే కొత్త ఏడాది ప్రారంభ తేదీగా జరుపుకున్నారు. 1752లో పార్లమెంట్ చట్టం ద్వారా జనవరి 1ని కొత్త ఏడాది ప్రారంభం తేదీగా మార్చుకున్నారు. ఇప్పుడు చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అనుసరిస్తున్నాయి. దాని ప్రకారమే జనవరి 1 ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published:December 31, 2020, 18:18 IST

  टॉप स्टोरीज