చైనా ఫోన్లు, వస్తువులపైనా నిషేధం విధిస్తారా? కేంద్రం వ్యూహమేంటి? నెక్ట్స్ ఏం జరుగుతుంది?

చైనా ఫోన్లు, వస్తువులపైనా నిషేధం విధిస్తారా? కేంద్రం వ్యూహమేంటి? నెక్ట్స్ ఏం జరుగుతుంది?

కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్స్‌పై నిషేధం విధిస్తే సరిపోతుందా? చైనాకి చెక్ పెట్టేందుకు ఇంకా ఏం చేయబోతోంది? నెక్ట్స్ ఎలాంటి షాక్ ఇవ్వబోతోంది?

 • Share this:
  ఎంతో సహనంగా ఉండే ఇండియాకి కోపం వస్తే... దాని తీవ్రత ఎలా ఉంటుందో చైనాకి తెలిసొస్తోంది. ఏకంగా 59 యాప్స్ వాటిలోనూ టిక్‌టాక్ లాంటి యాప్‌ని కేంద్రం నిషేధించడంతో... జిత్తుల మారి డ్రాగన్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. యుద్ధమంటే సరిహద్దుల్లో జరిగేదే కాదనీ... ఎన్నో రకాలుగా చేయవచ్చని డిజిటల్ స్ట్రైక్ ద్వారా కేంద్రం నిరూపించింది. ఊహించని ఈ ఎత్తుగడతో బీజింగ్ చిత్తైంది. చైనీస్ టెక్ ముక్త భారత్ నినాదం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. అది చూసి చైనా... ఇండియాపై ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ 59 యాప్స్ నిషేధం వల్ల ఇప్పుడు ఇండియన్స్‌కి డిజిటల్ సెక్యూరిటీ లభించినట్లైంది. పైగా... చైనా యాప్స్... రోజూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ... ఇండియన్ యాప్స్‌కి ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఆ విధంగానూ లాభం జరిగింది.

  సడెన్‌గా ఇలా ఎలా నిషేధించగలిగింది? ఇన్నాళ్లూ ఎందుకు నిషేధించలేదు అంటే... ఇన్నాళ్లూ పోనీలే అని సర్దుకుపోయిన భారత్... ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A అనే అస్త్రాన్ని ప్రయోగించింది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవడాన్ని నేరంగా ఈ సెక్షన్ చెబుతోంది. ఇది చాలు చైనా యాప్స్ ఇండియాలో చచ్చిపోవడానికి.

  ఈ బ్యాన్ ఎలా అమలవుతుందంటే... వీటిని అందిస్తున్న గూగుల్, యాపిల్ కంపెనీలు... తమ గూగుల్ ప్లే, ఐస్టోర్ నుంచి వీటిని ఇండియాలో తొలగిస్తాయి. ఇకపై ఈ యాప్స్ ఇండియాలో ఇంటర్నెట్ సర్వీసుల్లో కనిపించవు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వీటికి సర్వీసులు తొలగిస్తారు. ఫలితంగా ఈ యాప్స్ ఇండియాలో పనిచెయ్యవు. బ్యాన్ చేసిన కారణంగా... ఇక ఈ యాప్స్ ఇండియాలో మొబైళ్లు, ఇతర ఇంటర్నెట్ పరికరాల్లో పనిచెయ్యవు. ఈ యాప్స్‌తో లింకై ఉన్న వెబ్‌సైట్లు కూడా పనిచెయ్యవు. ఈ యాప్స్‌పై ఉన్న ఆరోపణలు, తప్పిదాలూ చాలా తీవ్రమైనవి. అందువల్ల వీటిపై నిషేధం ఇప్పట్లో తొలిగే అవకాశాలు లేవు.

  యాప్స్‌లో ఉన్న భారతీయుల డేటా సంగతేంటి?
  చాలా మంది నిషేధించిన యాప్స్‌లో తమ ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ వంటివి ఉంచుకున్నారు. అలాగే పర్సనల్ డేటాను దాచుకున్నారు. కానీ ఆ డేటాను ఇప్పుడు వెనక్కి తీసుకునేందుకు చాలా యాప్స్‌లో ఆప్షన్లు లేవు. ఆప్షన్ ఉంటే... ఆ డేటాను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిదే. ఐతే... మీ డేటాను మీరు తిరిగి తీసుకున్నా... సర్వర్లలో డేటా అలాగే ఉంటుంది. అందువల్ల డేటా చోరీ జరిగినట్లుగానే లెక్క.

  ఈ 59 యాప్స్ మాత్రమే కాదు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. వాటికీ త్వరలోనే టైమ్ దగ్గర పడే ఛాన్సుంది. మరిన్ని చైనా యాప్స్‌ని కూడా కేంద్రం త్వరలో నిషేధించే అవకాశాలు ఉన్నాయి.

  చైనా ఫోన్లు, పరికరాల సంగతేంటి:
  చైనా ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో కేంద్రం ఆలోచన ఏంటన్నది ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికి సరిహద్దు ఓడ రేవుల్లో... చైనాకి సంబంధించిన చాలా వస్తువుల్ని కేంద్రం అక్కడే ఉంచింది. కొన్ని రోజులుగా అవి అలాగే ఓడల్లోనే ఉన్నాయి. అదే సమయంలో... చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు చైనా కంపెనీలతో డీల్స్ రద్దు చేసుకుంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం. చైనా ఇండియాపై విషం కక్కుతోంది. కాబట్టి... చైనాను ఎన్ని రకాలుగా దూరం పెడితే... ఇండియాకి అంత మేలు.
  First published: