#GoBackModi ట్రెండింగ్ వెనుక బయటపడిన భారీ కుట్ర...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు తమిళనాడు వెళ్లినా.. ఆ సమయంలో #GoBackModi అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతూ ఉంటుంది.

news18-telugu
Updated: October 11, 2019, 5:03 PM IST
#GoBackModi ట్రెండింగ్ వెనుక బయటపడిన భారీ కుట్ర...
తమిళనాడులో మోదీకి స్వాగతం పలుకుతున్న గవర్నర్ భన్వరీలాల్, సీఎం పళనిస్వామి
  • Share this:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు తమిళనాడు వెళ్లినా.. ఆ సమయంలో #GoBackModi అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు.. మోదీ తమిళనాడు వెళ్లిన ప్రతిసారీ.. ఇలా జరుగుతోంది. ఈ #GoBackModi ట్రెండింగ్ కావడం వెనుక ఉన్న భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో కొందరు స్థానికులు మోదీకి కొందరు నిరసన తెలుపుతున్న మాట వాస్తవమే. అయితే, సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అయ్యేంత స్థాయిలో అయితే లేదు. మరి టాప్ ట్రెండింగ్ ఎలా అవుతుందో తెలుసా. దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది. పాకిస్తాన్‌కు చెందిన కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ఇలా #GoBackModi అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ ఎప్పుడు తమిళనాడు వెళ్లినా.. ఇలా పాకిస్తాన్‌కు చెందిన వారు వివిధ పేర్లతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్స్‌తో #GoBackModi ట్రెండ్ చేస్తున్నారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

పాకిస్తాన్‌కు చెందిన కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ చేస్తున్న ట్వీట్స్...









ఇవన్నీ అక్టోబర్ 11వ తేదీన చేసిన ట్వీట్స్. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలకు తమిళనాడులోని మహాబలిపురాన్ని వేదికగా ఎంచుకున్నారు. దీంతో మోదీ పర్యటనను తమిళనాడు వాసులు వ్యతిరేకిస్తున్నారనే దుష్ప్రచారం చేసేందుకు ఇలా పాకిస్తాన్‌కు చెందిన కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్‌లో #GoBackModi ట్రెండ్ చేస్తున్నారు. ఇదొక్కటే కాదు.

First published: October 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు