హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Spider Webs: ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోన్న సాలీడు గూళ్ల దుప్పట్లు.. దీని వెనుక మర్మమేంటి?

Spider Webs: ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోన్న సాలీడు గూళ్ల దుప్పట్లు.. దీని వెనుక మర్మమేంటి?

Photo Credit : ANI / Reuters

Photo Credit : ANI / Reuters

Spider Webs: లక్షలాది సాలెపురుగులు .. చిన్న చిన్న మొక్కలపై గూళ్లు కట్టుకున్నాయ్. ఇందులో ఆశ్చర్యమేముంది అనుకుంటే పొరపాటే.. ఈ సాలీడు గుళ్లు కొన్ని కిలోమీటర్ల పొడువు ఉండటం విశేషం. సాలె పురుగులు ఇలా ఎందుకు చేశాయ్. దీని వెనుక అసలు కథ ఏంటి..?

ఇంకా చదవండి ...

ఆస్ట్రేలియాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఆ దేశంలో లక్షలాది సాలెపురుగులు ఒకేసారి చిన్న మొక్కలపై గూళ్లు కట్టుకున్నాయి. వీటిలో కొన్ని కిలోమీటరు పొడవు ఉండటం విశేషం. ఆగ్నేయ రాష్ట్రమైన విక్టోరియాలో ఇటీవల భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. ఆ తరువాత లక్షలాది సాలెపురుగులు చెట్లు, రోడ్డు సైన్‌లు, పొదలపై ఇలా గూళ్లు నిర్మించుకున్నాయి. దీంతో ఇవి మొక్కలపై పరిచిన దుప్పట్ల మాదిరిగా కనువిందు చేస్తున్నాయి. సాలెపురుగులు లక్షలాది గూళ్లను ఒకేసారి నిర్మించుకోవడానికి ఒక కారణం ఉంది. భూమిపై రంధ్రాలు చేసుకొని నివసించే వాగ్రాంట్ హంటర్ జాతి సాలీళ్లు, వరదల నుంచి తప్పించుకోవడానికి ఇలా చేస్తాయి. వాటి నోటి నుంచి విడుదలయ్యే సిల్స్ వంటి పదార్థాన్ని చెట్లపైకి విసురుతాయి. వీటి ద్వారా మొక్కలు, ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లి తమను తాము కాపాడుకుంటాయి. దీన్ని బెలూనింగ్ పద్ధతి అంటారని నిపుణులు చెబుతున్నారు. పెద్దమొత్తంలో సాలెగూళ్లు నిర్మించుకోవడాన్ని గోసమర్ ఎఫెక్ట్ అంటారు.

* ఎక్కడ కనిపించాయి?

విక్టోరియా రాష్ట్రంలో గత వారం భారీ వర్షాలు కురిశాయి. గిప్స్‌ల్యాండ్ ప్రాంతంలో తీవ్రమైన వర్షపాతం నమోదైంది. దీంతో బెలూనింగ్ టెక్నిక్ ద్వారా సాలీళ్లు మనుగడ వ్యూహాన్ని ఉపయోగించాయి. వీటి ద్వారా సాలెపురుగులు భూమి నుంచి ఎత్తయిన ప్రాంతానికి వెళ్లి, ప్రాణాలు కాపాడుకున్నాయి. గత వారం విక్టోరియా రాష్ట్రంలో బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా వచ్చిన వరదలు వచ్చాయి. దీంతో భూమి పై పొరల్లో రంధ్రాలు చేసుకుని నివసించే వాగ్రాంట్ హంటర్ జాతి సాలీళ్లు, ఇలా చెట్లపైకి సిల్క్ వంటి పదార్థాన్ని విసిరి, తమను తాము కాపాడుకున్నాయి. వరదలు వచ్చిన గిప్స్‌ల్యాండ్ ప్రాంతంలోని మైదానాల్లో లక్షల కొద్దీ సాలీళ్లు ఈ ఉపాయంతో ప్రాణాలు కాపాడుకున్నాయి. సమీపంలోని సేల్, లాంగ్‌ఫోర్డ్ పట్టణాల మధ్య చిత్తడి నేలలపై ఎక్కడ చూసినా ఈ గోసమర్ షీట్లే కనువిందు చేస్తున్నాయి. ఇవి సుమారు ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. గిప్స్‌ల్యాండ్‌లోని ఒక ప్రాంతంలో, ఒక సాలెగూడు కిలోమీటర్ కంటే ఎక్కువ విస్తరించి ఉండటం విశేషం.

సన్నగా, సున్నితంగా ఉండే సిల్క్ దారాలతో ఈ నిర్మాణాలు ఏర్పడ్డాయి. వీటిపై సాలెపురుగులు ఎంత దూరమైనా పరుగెత్తుకుంటూ వెళ్లి, వరదల నుంచి ప్రాణాలు కాపాడుకోగలవు. ఈ వారాంతంలోపు ఇవి నిర్వీర్యమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ బెలూనింగ్ సిల్క్ గాలి కంటే తేలికగా ఉంటుంది. ఈ టెక్నిక్‌లో ఒక్కో సాలీడు ఒకసారి మాత్రమే సిల్క్ థ్రెడ్‌ను విసరగలదు. అంటే ఈ ప్రాంతంలో దుప్పట్ల మాదిరిగా పరుచుకొని ఉన్న ఈ నిర్మాణాలను.. ఎన్ని లక్షల సాలెపురుగులు నిర్మించి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.


బెలూనింగ్ సాలెపురుగులు పెద్దగా ప్రమాదకరం కావు. కానీ వీటిలో కొన్ని జాతులు మాత్రం విషాన్ని కలిగి ఉంటాయి. 2000 నుంచి 2013 మధ్య సాలెపురుగుల కాటుతో సుమారు 12,600 మంది ఆసుపత్రిలో చేరారు. ఆస్ట్రేలియాలో ఎలుకలు, ఒంటెల బెడదతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ఆ దేశంలో వేల కొద్దీ ఒంటెలను చంపేశారు. ఇటీవల ఎలుకలను వధించడానికి నిషేధిత రసాయనాలను దిగుమతి చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు సాలెగూళ్ల నిర్మాణాల ద్వారా ఆ దేశంలో సాలెపురుగులు ఎంత మొత్తంలో ఉన్నాయో ప్రపంచానికి తెలిసింది. అయితే వీటితో ప్రజలకు ముప్పు లేనందున, సాలెపురుగులను సామూహికంగా వధించే అవకాశాలు లేవని తెలుస్తోంది.

First published:

Tags: Australia, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు