Stars Declining: విశ్వంలో క్షీణిస్తున్న నక్షత్రాలు.. కారణమేంటంటే..

Stars Declining: విశ్వంలో క్షీణిస్తున్న నక్షత్రాలు.. కారణమేంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

Stars Declining: విశ్వంలో క్రమేనా నక్షత్రాల సంఖ్య పడిపోతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నక్షత్రాలలో వచ్చిన ఈ మార్పుకు గల కారణాలను పూణే, బెంగళూరు పరిశోధకులు తాజాగా కనుగొన్నారు.

  • Share this:
విశ్వంలో క్రమేనా నక్షత్రాల సంఖ్య పడిపోతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతమున్న విశ్వంతో పోలిస్తే బిగ్ బ్యాంగ్ కు ముందు ఉన్న విశ్వంలో దట్టమైన నక్షత్ర నిర్మాణం ఉందని, దీనికి తగ్గ ఆధారాలు కూడా లభించాయని వారు పేర్కొన్నారు. నక్షత్రాలలో వచ్చిన ఈ మార్పుకు గల కారణాలను పూణే, బెంగళూరు పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. భారతదేశం యొక్క అతిపెద్ద రేడియో టెలిస్కోప్ గా పిలువబడే జెయింట్ మెట్రోవేవ్ రేడియో టెలిస్కోప్ (జీఎంఆర్టీ)ని ఉపయోగించి ఖగోళ శాస్త్రవేత్తలు 8 బిలియన్ సంవత్సరాల క్రితం హైడ్రోజన్ వాయువు యొక్క ఉనికిని కనుగొన్నారు.  కాగా, పరిశోధనలో భాగంగా 7,653 గెలాక్సీలను అధ్యయనం చేసిన ఖగోళ శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ కు ముందు ఉన్న హైడ్రోజన్, దాని తర్వాత ప్రస్తుతం ఉన్న హైడ్రోజన్ కంటే 2.5 రెట్లు ఎక్కువ అని తేల్చారు.

విశ్వంలో ఇప్పుడున్న పదార్థమంతా ఒకేచోట కేంద్రీకృతమై ఒక ముద్దగా ఉన్న సమయంలో దానిలో ఏర్పడిన అసాధారణ ఒత్తిడితో ఒక్కసారిగా అది బద్ధలై కోటానుకోట్ల నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని వివరించేదే బిగ్ బ్యాంగ్  సిద్ధాంతం. కాగా, కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితమే ఈ విశ్వంలో బిగ్ బ్యాంగ్ జరిగిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిశోధనలో తేలిన విషయాలను నేచర్ సైన్స్ జర్నల్లో రచయిత- ఆదిత్య చౌదరి వెల్లడించారు. ప్రారంభ గెలాక్సీలలో నక్షత్రాల నిర్మాణం హై ఇన్టెన్సిటీతో జరిగిందని, అటామిక్ హైడ్రోజన్ యొక్క పరిమాణం తగ్గిపోవడమే నక్షత్రాలు క్షీణించడానికి ప్రధాన కారణమని ఆయన అన్నారు.

దీనిపై ఎన్‌సిఆర్‌ఎ గ్రూప్ మెంబర్ నిస్సిమ్ కనెకర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మనకు రాత్రి సమయంలో ఆకాశంలో కనిపించే నక్షత్రాల్లో దాదాపు సగం నక్షత్రాలు సుమారు ఎనిమిది నుంచి పది బిలియన్ సంవత్సరాల పూర్వానికి చెందినవని ఆయన పేర్కొన్నారు. పూణేకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ (ఎన్‌సిఆర్‌ఎ) శాస్త్రవేత్త జయరామ్ మాట్లాడుతూ.. “అటామిక్ హైడ్రోజన్ల మెజర్మెంట్ ప్రస్తుతం గెలాక్సీలో ఉన్న నక్షత్రాల సంఖ్యపై పూర్తి సమాచారాన్ని అందిస్తుందన్నారు.  కాగా 1990వ సంవత్సరం  తర్వాత అప్ గ్రేడ్ అయిన జిఎంఆర్ టెలిస్కోప్తో ఈ ఆవిష్కరణ సాధ్యమైంది.
Published by:Nikhil Kumar S
First published: