తల్లులకు పరీక్ష.. ఆ పసివాళ్లకు పోలీసుల రక్ష... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటో...

ఈ ఫొటోను చూసిన నెటిజన్లు వారిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. వేలాదిగా ట్విట్టరాటీలు లైక్స్ చేస్తున్నారు. ఆ ఫొటోలను షేర్ చేస్తున్నారు.

news18-telugu
Updated: November 12, 2019, 3:44 PM IST
తల్లులకు పరీక్ష.. ఆ పసివాళ్లకు పోలీసుల రక్ష... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటో...
పిల్లలను ఎత్తుకున్న మహిళా పోలీసులు(Image:Kula Saikia, IPS/Twitter)
  • Share this:
ఓ వైపు తల్లులు పరీక్ష రాస్తుంటే.. మరోవైపు వారి పసిబిడ్డలను పోలీసులు సురక్షితంగా కాపాడారు. పసిబిడ్డలను పొత్తిళ్లలో పెట్టుకుని లాలించారు. పోలీసులు చేసిన ఈ పనిని నెటిజన్లు పొగడ్తల్లో ముంచెత్తుతన్నారు. అసోంలో ఈ ఘటన జరిగింది. అసోంలోని దారంగ్ జిల్లాలో టీచర్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న సమయంలో కొందరు అభ్యర్థులు తమ పసిపిల్లలతో వచ్చారు. అలా వచ్చిన పసిపిల్లలను అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు కాసేపు ఎత్తుకుని ఆడించారు. అభ్యర్థుల వెంట వారి కుటుంబసభ్యులు వచ్చినా.. పోలీసులు ‘ఏం ఫర్వాలేదు. మేం చూసుకుంటాం’ అంటూ పసిబిడ్డలను ఎంచక్కా లాలించారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు తమ చేతుల్లో బిడ్డలను ఎత్తుకుని ఉన్న ఫొటోను ఓ ఐపీఎస్ అధికారిణి కుల సైకియా ట్వీట్ చేశారు.
ఈ ఫొటోను చూసిన నెటిజన్లు వారిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. వేలాదిగా ట్విట్టరాటీలు లైక్స్ చేస్తున్నారు. ఆ ఫొటోలను షేర్ చేస్తున్నారు. మరికొందరు ఆ ఫొటోలు డౌన్‌లోడ్ చేసి.. తమ ట్విట్టర్ ఖాతాల్లో పర్సనల్‌గా కూడా పోస్ట్ చేస్తున్నారు.కాచిగూడ ట్రైన్ యాక్సిడెంట్ సీసీటీవీ దృశ్యాలు..

First published: November 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>