Home /News /trending /

Dinosaurs: డైనోసార్ల అంతానికి కారణం అదేనా.. అది ఎక్కడ నుంచి వచ్చిందో కనుగొన్న శాస్త్రవేత్తలు..

Dinosaurs: డైనోసార్ల అంతానికి కారణం అదేనా.. అది ఎక్కడ నుంచి వచ్చిందో కనుగొన్న శాస్త్రవేత్తలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒకప్పుడు భూమిపై డైనోసార్లు ఎన్నో ప్రదేశాల్లో ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే ఉత్తర అమెరికా ఒకప్పుడు వాటి నివాసానికి స్వర్గధామంగా ఉండేది. దాదాపు 66 మిలియన్ల సంవత్సరాల క్రితం ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్ల డైనోసార్ల జాతి అంతరించింది. 10 కిలోమీటర్ల వ్యాసంతో ఉన్న ఓ ఆస్టరాయిడ్ ఉత్తర అమెరికా దక్షిణ భాగాన్ని ఢీకొట్టింది. అది ఎక్కడ నుంచి వచ్చిందో శాస్త్రవేత్తలు కనుక్కొన్నారు.

ఇంకా చదవండి ...
ఒకప్పుడు భూమిపై డైనోసార్లు ఎన్నో ప్రదేశాల్లో ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే ఉత్తర అమెరికా ఒకప్పుడు వాటి నివాసానికి స్వర్గధామంగా ఉండేది. దాదాపు 66 మిలియన్ల సంవత్సరాల క్రితం ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్ల డైనోసార్ల జాతి అంతరించింది. 10 కిలోమీటర్ల వ్యాసంతో ఉన్న ఓ ఆస్టరాయిడ్ ఉత్తర అమెరికా దక్షిణ భాగాన్ని ఢీకొట్టింది. ప్రస్తుతం ఈ ప్రదేశం మెక్సికోలో ఉంది. ఈ గ్రహశకలం భూమిని తాకినప్పుడు 10 లక్షల అణుబాంబులతో సమానమైన శక్తిని ఉత్పత్తి చేసి విధ్వంసాన్ని సృష్టించింది. ఫలితంగా రాళ్లు కరిగి ఆకాశంలో వెదజల్లి, అవి తిరిగి అగ్ని వర్షం రూపంలో కిందకు పడ్డాయి. ఈ విధ్వంసకర ఘటనలో భూమిపై ఉండే డైనోసార్లతో పాటు మొక్కలు, జంతువులు మూడింట నాలుగోవంతు వరకు తుడిచిపెట్టుకుపోయాయి. తాజాగా అమెరికాలోని టెక్సాస్‌లో సౌత్ వెస్ట్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు ఈ గ్రహశకలం ఎక్కడ నుంచి వచ్చిందో కనుగొన్నారు.

ఇది ప్రధాన గ్రహశకలం బాహ్య బెల్ట్ (Main Asteroid Belt) నుంచి వచ్చిందని స్పష్టం చేశారు. బెల్ట్ అంటే సౌరవ్యవస్థలో గొలుసు లాంటి భాగం. ఇందులో గ్రహశకలాలు, అంతరిక్ష శిలలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. ఈ బెల్ట్ బృహస్పతి, అంగారక కక్ష్యల మధ్య ఉంది. భూమిని తాకిన గ్రహశకలం మూలాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఇంపాక్టర్‌తో సమానమైన ఆస్టరాయిడ్లు ఎక్కడ దొరుతాయో అన్వేషించారు. గ్రహశకలం గురించి తెలిసిన పరిశీలనలు, ఆస్టరాయిడ్ కంప్యూటర్ నమూనాలను కలిపి దాని ఆవిర్భావాన్ని పరిశోధించారు. అయితే ఈ నమూనాలు సంతృప్తికరమైన ఫలితాలను అందజేయలేదని వారు గ్రహించారు.

అనంతరం వారు గ్రహశకలం ప్రధాన బెల్ట్ నుంచి ఎలా తప్పించుకుందో తెలియజేసే మోడల్‌ను కూడా పరిశీలించారు. బెల్ట్ కు బాహ్య ప్రాంతంలో ఉన్న గ్రహశకలాల కంప్యూటర్ మోడల్స్‌ను లక్షల సంవత్సరాల పాటు రన్ చేయగా.. వారు ఊహించిన ఫలితం వచ్చింది. 9.6 కిలోమీటర్ల వ్యాసమున్న ఓ గ్రహశకలం భూమిని కనీసం 10 సార్లు తాకినట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఆ ఫలితాల్లో రెండు కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మొదటిది బాహ్య బెల్టులో ఇంపాక్టర్‌తో సమానమైన గ్రహశకలాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. రెండోది భూమిని తొలిసారిగా సమీపించే గ్రహశకలాలు కక్ష్యలను పునరుత్పత్తి చేయగలవని అధ్యయన రచయితల్లో ఒకరైన సిమోన్ మార్చి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలను జులై 15న ఐకార్స్ జర్నల్‌లో ప్రచురించారు.
Published by:Veera Babu
First published:

Tags: America, Asteroid, International news, USA

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు