ఆరు బయట హార్ప్ వాయిస్తుంటే... డిస్నీ మూవీ సీన్... వైరల్ వీడియో

ఇలాంటి దృశ్యాలు అరుదుగా కనిపిస్తాయి. ఇలా జరిగే సందర్భాలు చాలా తక్కువ. అందుకే ఈ వీడియో అందరికీ నచ్చేస్తోంది.

news18-telugu
Updated: July 29, 2020, 2:53 PM IST
ఆరు బయట హార్ప్ వాయిస్తుంటే... డిస్నీ మూవీ సీన్... వైరల్ వీడియో
ఆరు బయట హార్ప్ వాయిస్తుంటే... డిస్నీ మూవీ సీన్... వైరల్ వీడియో (credit - Youtube)
  • Share this:
అదో ఆరుబయట ప్రశాంతమైన ప్రదేశం. చుట్టూ ఎవరూ లేరు. అందువల్ల ముఖానికి మాస్క్ పెట్టుకోవాల్సిన పని లేదు. అక్కడ హార్ప్ వాయిస్తే... బాగుంటుందని ఆ మహిళ అనుకుంది. తన మొబైల్ కెమెరా ఆన్ చేసి... హార్ప్ వాయించడం ప్రారంభించింది. ఫేమస్ లిరిక్స్‌ను వాయిస్తూ... అందులో లీనమైపోయింది. ఇంతలో... ఆ తుప్పల్లో నుంచి హార్ప్ సంగీతానికి పరవసించి... ఓ జింక బయటకు వచ్చింది. ఆమె హార్ప్ వాయిస్తుంటే... ఎంతో ఆనందపడింది. ఆమె దగ్గరకు వెళ్లాలని జింక ప్రయత్నించింది. తన తోకను అదే పనిగా ఊపుతూ... తన ఆనందాన్ని అది వ్యక్తం చేసింది. అలా ఆమె దగ్గరకు వెళ్లబోతూ... ఎవరైనా వస్తారేమో అనే భయంతో... చెంగున గెంతి... తుప్పల్లోకి పారిపోయింది. హార్ప్ వాయింపులో మునిగిపోయిన ఆమె జింకను చూడలేదు. కానీ... జింక పారిపోయినప్పుడు వచ్చిన సౌండ్‌కి ఆమె ఉలిక్కి పడింది.

ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇదో డిస్నీ మూవీ సీన్‌లా ఉందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. జులై 22 నుంచి అంటే... వారంలో ఈ వీడియోని రెండున్నర లక్షల మందికిపైగా చూశారు. ఏదైనా వీడియోకి వారంలో లక్ష వ్యూస్ వస్తే అది వైరల్ వీడియో కింద లెక్క.
Published by: Krishna Kumar N
First published: July 29, 2020, 2:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading