Viral Video : పార్లమెంట్‌ను కుదిపేసిన ఎలుక.. భయభ్రాంతులకు గురైన ఎంపీలు..

ప్రతీకాత్మక చిత్రం

Viral Video : సాధారణంగా పార్లమెంట్ సెషన్స్ అంటే ఎలా ఉంటాయి? అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతూ వేడి వేడిగా సాగుతుంటాయి. కొన్ని సార్లు బిల్లుల ఆమోదం సమయంలో ప్రతిపక్షాలు లేచి అందరూ ఒక్కచోట చేరడం, సభ గందరగోళం మారడం కూడా మనం చూస్తుంటాం.

  • Share this:
సాధారణంగా పార్లమెంట్ సెషన్స్ అంటే ఎలా ఉంటాయి? అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతూ వేడి వేడిగా సాగుతుంటాయి. కొన్ని సార్లు బిల్లుల ఆమోదం సమయంలో ప్రతిపక్షాలు లేచి అందరూ ఒక్కచోట చేరడం, సభ గందరగోళం మారడం కూడా మనం చూస్తుంటాం. కానీ ఓ చోట మాత్రం అధికార ప్రతిపక్షాలు కలిసి కొన్ని నిమిషాలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదంతా కేవలం ఒక ఎలుక వల్ల జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? స్పెయిన్‌లోని అండలుసియా ప్రాంత పార్లమెంట్‌లో జరిగింది. రాయిటర్స్ షేర్ చేసిన ఈ వీడియోలో ఎలుకను చూసి పార్లమెంట్‌లోని ఎంపీలంతా కాళ్లు పైకి పెట్టుకోవడం.. కుర్చీలపై కాళ్లు పెట్టుకొని బెంచీలపై కూర్చోవడం వంటివి చేశారు.సుజానా డియాజ్ అనే రీజినల్ ప్రెసిడెంట్ సెనేటర్‌గా ఎంపికవ్వాలా? వద్దా? అని నిర్ణయించడానికి ఓటింగ్ జరుగుతున్న సందర్భంలోనే ఈ ఎలుక కనిపించింది. స్పీకర్ మార్తా బాస్క్వెట్ మాట్లాడుతుండగా.. ఆమెకు ఎలుక కనిపించింది. దీంతో భయంతో నోటికి అడ్డంగా చేతులు పెట్టుకొని అరిచింది. తరువాత ఎంపీలంతా తమ సీట్ల నుంచి లేచి దూరంగా పారిపోయారు. మరికొందరు అక్కడే టేబుల్ పై కూర్చొని కుర్చీలపై కాళ్లు పెట్టుకున్నారు.

ఈ విషయంపై ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడుతూ ఆ ఎలుక పెద్ద సైజులోనే ఉందని వెల్లడించారు. ఎలుక బయటకు వెళ్లేవరకు అందరూ దూరంగా నిలుచొని.. కాసేపాగి తిరిగి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆ తర్వాత డియాజ్ కోసం ఓట్లు వేశారు. అనంతరం ఒక ఎలుకలు పట్టే సంస్థ సహాయంతో సభలోకి వచ్చిన ఎలుకను పట్టుకున్నారు. పార్లమెంట్ కార్యక్రమం ఎలాంటి వాయిదాలు లేకుండా సజావుగా సాగింది.

స్పెయిన్‌లో భాగంగా ఉన్న అండలుసియా పార్లమెంట్‌కు మొట్టమొదటిసారి 1982లో ఎలక్షన్లు జరిగాయి. 109 మంది సభ్యులు ఎన్నికవుతూ వస్తున్నారు. ప్రస్తుతం పీపుల్స్ పార్టీ ఆఫ్ అండలుసియా, క్యుడడానోస్ కలిసి అధికారంలో ఉన్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా ఎలుక హల్‌చల్ చేసింది.

ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై చాలామంది ట్విట్టర్ యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. ఇది చాలా వింతగా ఉంది. నేను అక్కడ ఉంటే నా ప్రాణం కోసం భయపడుతూ పారిపోతాను అంటూ ఒకరు వ్యంగ్యంగా రాశారు. ఒక ఎలుకను చూడగానే అక్కడ అందరూ తమ హుందాతనాన్ని మర్చిపోయారు అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. ఇది వీడియో ఆఫ్ ద ఇయర్ అని ఒకరు రాస్తే.. ఆ ఎలుక కూడా మీటింగ్ లో ముఖ్యమైన భాగస్వామిగా ఉండాలనుకున్నట్లుందని మరో వ్యక్తి ట్వీట్ చేశారు.
Published by:Sridhar Reddy
First published: