• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • WHEN COVID 19 PLAYS HAVOC WITH LIVES THESE CHITTOOR SISTERS PLAY OXEN TO PULL FAMILY BA

Video: నాన్న కోసం నాగలిపట్టిన కూతుళ్లు... ఎద్దులుగా మారి..

Video: నాన్న కోసం నాగలిపట్టిన కూతుళ్లు... ఎద్దులుగా మారి..

నాగలి పట్టి దున్నుతున్న అక్కాచెల్లెళ్లు,

ఆ తండ్రి పేరు వీరతాళ్ల నాగేశ్వరరావు. మహల్ రాజువారి పల్లె వాసి. మదనపల్లెలో టీ కొట్టు నడుపుతూ ఉంటాడు. కరోనా వైరస్ కారణంగా అతడి ఉపాధి పోయింది.

  • Share this:
    పొలం సాగు కోసం కష్టపడుతున్న తండ్రి కోసం ఆ కూతుళ్లు కాడి పట్టారు. చెరోవైపు కాడి పట్టి పొలం దున్నారు. వెనుక తండ్రి సాలు పడుతుంటే.. తల్లి విత్తనాలు జల్లుతూ వస్తుంటే కూతుళ్లు ఇద్దరూ కలసి పొలం దున్నారు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. చిత్తూరు జిల్లా కలికిరి ఏరియాలో నాగేశ్వరరావు టమాట సాగు చేద్దామనుకున్నాడు. జిల్లాలో వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. నేలను దున్నేందుకు కూలికి ఎద్దులు అద్దెకు దొరకడం లేదు. ఎన్నో‌ కష్టాల్లో ఉన్న రైతులు ట్రాక్టర్ అద్దెలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోయారు.. ఈ పరిస్థితుల్లో టమోటా నాట్లు కోసం తన ఇద్దరు ఆడపిల్లలను నాగలికి ఎద్దుల్లా మార్చి భార్యతో కలిసి పొలం దున్నాడు. విధి లేని పరిస్థితులలోనే వయసు కొచ్చిన ఆడపిల్లల తో ఎద్దు చాకిరి చేయించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దారుణ ఘటన చూసిన ఎవ్వరైనా కన్నీళ్లు మింగాగ్చిందే.... రైతుల దయనీయ పరిస్థితి కి ఇది అద్దం బట్టే సాక్ష్యం.

    ఆ తండ్రి పేరు వీరతాళ్ల నాగేశ్వరరావు. మహల్ రాజువారి పల్లె వాసి. మదనపల్లెలో టీ కొట్టు నడుపుతూ ఉంటాడు. కరోనా వైరస్ కారణంగా అతడి ఉపాధి పోయింది. దీంతో 20 సంవత్సరాల తర్వాత మళ్లీ సొంతూళ్లో పొలం పని చేస్తున్నాడు. తన కుమార్తెలు వెన్నెల (12వ తరగతి), చందన (10 తరగతి) చదువుతున్నారు. వెన్నెల బయాలజీ స్టూడెంట్. డాక్టర్ అవ్వాలనేది ఆమె కల. ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీతో నాగేశ్వరరావుకు అనుబంధం ఉంది. కొందరు అడ్వొకేట్లు అతడికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఓ నెల ఇంటి అద్దె కట్టారు. కొంత నిత్యావసరాలు కొనిచ్చారు. కానీ, ఆత్మాభిమానం ఉన్న నాగేశ్వరరావు సొంతంగా పనిచేసుకోవడానికే మొగ్గు చూపాడు. తన రెండెకరాల పొలంలో పంట వేయడానికి నిర్ణయించాడు. కానీ, ఎద్దులు దొరక్క, ట్రాక్టర్ అద్దె చెల్లించలేక ఇలా కుమార్తెల భుజాన భారం వేసి నడిపించాడు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు