ఆ కుర్చీలో దెయ్యం...? దానంతట అదే వెళ్లిపోయిందిగా

ఆ సమయంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ కూడా ఇదెక్కడి వింత అంటూ చూస్తుండిపోయాడు.

news18-telugu
Updated: September 24, 2019, 4:50 PM IST
ఆ కుర్చీలో దెయ్యం...? దానంతట అదే వెళ్లిపోయిందిగా
కుర్చీలో దెయ్యం ఉందా?
  • Share this:
కొన్ని కొన్ని సంఘటనల గురించి మనం విన్నా చూసినా, చదివినా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక కుర్చీ దానంతట అదే కదిలింది. ఎవరి సహాయం లేకుండా బయటకు వెళ్లిపోయింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారు. ఇది నిజం. నమ్మాల్సిన నిజం. చండీఘర్‌లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. చంఢీఘర్‌లోని పీజీఐ ఆస్పత్రిలో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే ఈ ఘటన జరిగింది. ఎవరి ప్రమేయం లేకుండానే వీల్ చైర్ ఒకటి కదిలి నేరుగా ఆసుపత్రి నుంచి బయటకు వెళ్ళిపోయింది.

ఈ సంఘటన ఈనెల 19వ తేదీన చోటుచేసుకుంది. ఆ వీల్ చైర్ కదులుతూ ముందుకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ కూడా ఇదెక్కడి వింత అంటూ చూస్తుండిపోయాడు. ఆ కుర్చీని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. కొంచెం భయపడి షాక్‌కు గురై అలా నిల్చుండిపోయాడు. ఈ విజువల్స్ అన్ని అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. దీన్ని చూసినవారంతా షాక్‌కు గురవుతున్నారు. అదే సమయంలో ఆ వీల్ చైర్ పక్కనే ఉన్న ఇతర చైర్ లు గానీ, వస్తువులు కానీ ఏమాత్రం కదలక్కుండా ఉండడంతో జనం అనేకరకాలుగా చర్చించుకుంటున్నారు. కొందరు దెయ్యం ఉందంటే... మరికొందరు గాలికి కూర్చీ అలా వెళ్లిపోయిందటూ చెబుతున్నారు. మొత్తం మీద ఈ వీల్ చైర్ వీడియో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.అంతకుముందు ఇదే ఆస్పత్రిలో మార్చురీ దగ్గర స్ట్రెచర్ కూడా ఇలాగే కదలడం పలు అనుమానాలకు తావిస్తోంది.First published: September 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...