హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Working naked day: ఇదేం దినోత్సవం.. ఒంటి మీద దుస్తులు లేకుండా జూమ్ కాల్స్‌?

Working naked day: ఇదేం దినోత్సవం.. ఒంటి మీద దుస్తులు లేకుండా జూమ్ కాల్స్‌?

నగ్నంగా పనిచేసే దినోత్సవం. అసలు ఇలాంటి రోజు ఒకటి ఉందని కూడా చాలా మందికి తెలీదు. కానీ, కొన్ని సంవత్సరాలుగా ఇలాంటిది ఒకటి ట్రెండ్ అవుతోంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చే మొదటి శుక్రవారం రోజు ఇలా Working naked dayను సెలబ్రేట్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

    నగ్నంగా పనిచేసే దినోత్సవం. అసలు ఇలాంటి రోజు ఒకటి ఉందని కూడా చాలా మందికి తెలీదు. కానీ, కొన్ని సంవత్సరాలుగా ఇలాంటిది ఒకటి ట్రెండ్ అవుతోంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చే మొదటి శుక్రవారం రోజు ఇలా Working naked dayను సెలబ్రేట్ చేస్తున్నారు. అమెరికాలో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఇతర దేశాలకు కూడా పాకుతోంది. వాస్తవానికి అమెరికాలోని లిసా కనరెక్ అనే మహిళ ఈ Working naked dayను ప్రారంభించింది. 20 ఏళ్ల పాటు సంస్థలో పనిచేసిన ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంపిక చేసుకుంది. ఆ తర్వాత ఇంటి వద్ద నుంచి పనిచేసే సమయంలో కూడా పూర్తిగా ఆఫీసులో వేసుకున్న తరహాలోనే డ్రెస్ వేసుకుని కూర్చుని పనిచేయడం మీద బోర్ కొట్టింది. దీంతో ఈ Working naked day అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే.. పైన చెప్పినట్టు ఒంటిమీద పూర్తిగా దుస్తులు లేకుండా నగ్నంగా వర్క్ చేయడం మాత్రం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు తమకు తోచిన, తమకు నచ్చిన, తమకు ఏ డ్రెస్ అయితే సౌకర్యంగా, సౌలభ్యంగా ఉంటుందో అలాంటి డ్రెస్ వేసుకుని వర్క్ చేయడం. 2010లో ఈ Working naked day మొదలైంది. అప్పటి నుంచి మొదట్లో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న దీన్ని సెలబ్రేట్ చేసేవారు. ఆ తర్వాత మారింది. 2014 నుంచి దీన్ని ప్రతి ఏటా ఫిబ్రవరిలో వచ్చే మొదటి శుక్రవారం నాడు నిర్వహిస్తున్నారు.

    ఈ Working naked day కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ పేరు వినగానే చాలా మంది ఇదేం దినోత్సవం అంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారు. పుర్రెకో బుద్ధి అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక దీని మీదసెటైర్లు వేసే వారు కూడా ఉన్నారు. కొంపదీసి డ్రెస్సులు తీసేసి జూమ్ కాల్స్ చేస్తారా? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

    First published:

    Tags: VIRAL NEWS, Work From Home

    ఉత్తమ కథలు