• HOME
 • »
 • NEWS
 • »
 • TRENDING
 • »
 • WHAT IS CORONA VIRUS HOW TO IDENTIFY IT WHAT TO DO NOW NK

కొరొనా వైరస్‌ అంత డేంజరా? ఎలా గుర్తించాలి? తప్పనిసరిగా చదవండి...

కొరొనా వైరస్‌ అంత డేంజరా? ఎలా గుర్తించాలి? తప్పనిసరిగా చదవండి...

తెలంగాణలో కరోనా రోగుల రికవరీ రేటు 78.37 శాతంగా ఉంది. ఈ అంశంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.

Corona Virus : ప్రపంచమంతా ఇప్పుడు కొరొనా వైరస్ గురించి మాట్లాడుకుంటోంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని హాట్ టాపిక్స్ ఉన్నా... దీనికి కూడా కొంత టైమ్ కేటాయించి ప్రజలు... ఏంటీ వైరస్, ఎలా వస్తుంది? ఎలా గుర్తించాలి? అనే విషయాలు మాట్లాడుకుంటున్నారు.

 • Share this:
  Corona Virus : మీకు తెలిసే ఉంటుంది... బ్యాక్టీరియా అనేది కొన్ని సూక్ష్మక్రిముల గుంపు. చాలా రోగాల్లో బ్యాక్టీరియా అంతు చూడగలరు. బ్యాక్టీరియా కంటే అత్యంత చిన్నగా ఉంటాయి వైరస్‌లు. ఈ సూక్ష్మక్రిములు ఓ పట్టాన అర్థం కావు. వీటికి ఏ మందు వెయ్యాలో అంత ఈజీగా తెలియదు. ఇప్పుడు చైనాలో గతేడాది డిసెంబర్‌లో పుట్టిన కొరొనా వైరస్ ఇలాంటిదే. ఇది చావట్లేదు. ప్రజల్ని చంపేస్తోంది. ఇప్పటికే 26 మంది చనిపోయారు. 500 మందికి పైగా ఆస్పత్రుల పాలయ్యారు. చైనాతోపాటూ థాయ్‌ల్యాండ్, దక్షిణ కొరియా, వియత్నాం, ఫ్రాన్స్, సింగపూర్, తైవాన్, నేపాల్, అమెరికా, జపాన్, సౌదీ అరేబియా ఇలా చాలా దేశాల్లో ఈ వైరస్ విస్తరిస్తోంది. అందుకే మనం కూడా జాగ్రత్తపడాల్సి వస్తోంది. ఈ వైరస్‌కి మందు లేదు కాబట్టి... అసలు ఇది సోకకుండా మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ ఎవరికైనా సోకినట్లు అనిపిస్తే... వెంటనే వారు ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలి. మరి ఈ వ్యాధి లక్షణాలేంటి? ఎలా గుర్తించాలి? ఏం చెయ్యాలి? వంటివి ఫటాఫట్ తెలుసుకుందాం.

  కొరొనా వైరస్ మన బాడీలోకి చేరితే... మన ఊపిరితిత్తులు (లంగ్స్) దెబ్బతింటాయి. సరిగా ఊపిరి పీల్చుకోలేం, వదల్లేం. నిమోనియా లాగా తయారవుతుంది పరిస్థితి. నిజానికి కొరొనా టైపు వైరస్‌లు చాలా ఉన్నాయి. వాటిలో ఆరు వైరస్‌లు మాత్రం మనుషులకు కూడా సోకుతున్నాయి. ఇదివరకు సార్స్ వైరస్‌ వల్ల... 2002లో... 774 మంది చనిపోయారు. అది కూడా ఇలాంటిదే. 2012లో వచ్చిన మెర్స్ వల్ల 858 మంది చనిపోయారు. అది కూడా ఇలాంటిదే.

  కొరొనా వైరస్ ఎవరి బాడీలోనైనా ప్రవేశించాక కుదురుగా ఉండదు. అందువల్ల వారికి ముందుగా జ్వరం వస్తుంది. తర్వాత పొడి దగ్గు వస్తూ ఉంటుంది. ఒక వారం తర్వత ఊపిరి సరిగా ఆడదు. గాలి గట్టిగా పీల్చుదామనుకున్నా పీల్చలేరు. ఏదో అడ్డు పడుతున్నట్లు అనిపిస్తుంది. "బాబోయ్ ఇదేంటి ఊపిరి ఆడట్లేదు" అనిపిస్తుంది. వెంటనే ఆస్పత్రికి వెళ్తారు.

  కొరొనా వైరస్ వచ్చిన వారంతా చనిపోరు. ప్రస్తుతానికి ప్రతి నలుగురిలో ఒకరు చనిపోయే ప్రమాదం ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. దగ్గుతూ... దగ్గుతూనే చనిపోతారట. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ - WHO... ఇంటర్నేషనల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇదివరకు స్వైన్ ఫ్లూ, ఎబోలాకి కూడా ఇలాగే ప్రకటించింది.

  నిజానికి కొరొనా వైరస్ ఎప్పటి నుంచో ఉంది. ఇన్నాళ్లూ జంతువులు, ప్రాణుల్లో మాత్రమే కనిపించే ఈ వైరస్... వాటిపై బోర్ కొట్టి... మనుషుల్లో దూరింది. అందువల్ల ఇప్పుడు ఇది మనుషుల నుంచీ మనుషులకు వస్తోందన్నమాట. ప్రస్తుతం ఒక వ్యక్తికి ఈ వైరస్ సోకితే... ఆ వ్యక్తి... మరో వ్యక్తికీ లేదా... మరో ముగ్గురు వ్యక్తులకు ఈ వైరస్ సోకేలా చేస్తున్నారు. కావాలని చెయ్యకపోయినా... అలా సోకుతోంది అది. అందుకే వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

  మనం ఏం చెయ్యాలి : మనం జాగ్రత్త పడాలి. ఎవరైనా దగ్గుతూ ఉంటే, వారికి దూరంగా జరగాలి. అలాగే... జ్వరం లాంటివి వస్తే... వెంటనే డాక్టర్‌ని కలవాలి. అలాగే... స్వచ్ఛమైన గాలిని పీల్చాలి. గుంపుగా ఉండే జనంతో ఉండకుండా ఉంటే మంచిదే. వైరస్ సోకిన రెండు వారాల్లో ప్రజలు చనిపోతున్నారు. మందు ఇంకా తయారవ్వలేదు కాబట్టి... తయారైనా అది ఇండియా దాకా రావాలంటే దాదాపు రెండు నెలలు పడుతుంది కాబట్టి... వైరస్ సోకకుండా జాగ్రత్త పడాల్సిందే.


  Published by:Krishna Kumar N
  First published: