హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Bulli Bai app : వేలానికి ముస్లిం మహిళలు.. సుల్లీ డీల్స్ తరహా.. అసలేంటీ యాప్? ఎవరు చేశారు?

Bulli Bai app : వేలానికి ముస్లిం మహిళలు.. సుల్లీ డీల్స్ తరహా.. అసలేంటీ యాప్? ఎవరు చేశారు?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పలు రంగాల్లో పాపులరైన ముస్లిం మహిళల ఫొటోలను యాప్ లో ఉంచి, వాళ్లను సొంతం చేసుకోండంటూ వేలం పాట నిర్వహించారు. దేశ ప్రతిష్టకు మచ్చలా పరిణమించిన ఈ బుల్లి బాయి ఉదంతంపై కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. గతంలోనూ ఇలాంటిదే సుల్లీ డీల్స్ అనే యాప్ ఇదే మైక్రోసాఫ్ట్ వారి గిట్ హబ్ వేదికగా తయారైంది..

ఇంకా చదవండి ...

బుల్లి బాయి.. Bulli Bai.. కొత్త ఏడాది తొలి రోజు నుంచీ విపరీతంగా ట్రెండ్ అవుతోందీ పదం. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ వారి గిట్‌హబ్ ప్లాట్‌ఫామ్‌లో రూపొందించిన బుల్లి బాయి యాప్ ముస్లిం మహిళలే టార్గెట్‌గా వికృతాలకు వేదికైంది. గడిచిన మూడు రోజులుగా దేశవ్యాప్తంగా బుల్లి బాయి యాప్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పలు రంగాల్లో పాపులరైన ముస్లిం మహిళల ఫొటోలను యాప్ లో ఉంచి, వాళ్లను సొంతం చేసుకోండంటూ వేలం పాట నిర్వహించారు. దేశ ప్రతిష్టకు మచ్చలా పరిణమించిన ఈ బుల్లి బాయి ఉదంతంపై కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. అయితే, గతంలోనూ బుల్లీ లాంటిదే సుల్లీ డీల్స్ అనే యాప్ ద్వారానూ ఇదే తరహా కీచక చర్యలకు పాల్పడ్డారు. అసలీ బుల్లి బాయి యాప్ ఏమిటి? దాని వెనుక ఉన్నదెవరు? వాళ్లు టార్గెట్ చేసిన మహిళలెవరు? కేంద్రం ఏం చేస్తోంది? అనే ప్రశ్నలకు సమగ్ర వివరాలివి..

బుల్లీ బాయి అంటే?

బుల్లి బాయి పేరుతో పుట్టుకొచ్చిన వివాదాస్పద మొబైల్, పీసీ యాప్ గడిచిన మూడు రోజులుగా దేశాన్ని వణికించింది. ఈ యాప్‌లో అనుమతి లేకుండా ముస్లిం మహిళల ఫోటోలు అప్‌లోడ్ చేశారు. వాళ్ల ఫోటోలకు ధరల ట్యాగ్ ఉంచి, ‘డీల్ ఆఫ్ ది డే’ అంటూ వేలం పాటలు నిర్వహించారు. సదరు ముస్లిం మహిళలపై రాయడానికి వీల్లేనంత అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు, కామెట్లు కూడా ఉన్నాయీ యాప్‌లో. బుల్లీ బాయి.. దూకుడు ప్రదర్శించే మహిళ లేదా ఈరోజు తిట్టుకోడానికి అందుబాటులో ఉన్న మహిళ అనే అర్థంలో చూడొచ్చు. బూతు పదాలుగానూ దీని అర్థం ధ్వనిస్తుంది.

బుల్లీ బాయ యాప్‌లో ఏముంది?

బుల్లి బాయి యాప్‌ని ఓపెన్ చేయగానే ముస్లిం మహిళల ఫోటోలు కనిపిస్తాయి. వేర్వేరు ఫొటోలను ఆనాటి బుల్లీ బాయ్ బుల్లి బాయిగా ప్రదర్శించేవారు. యాప్‌లోని మహిళల చిత్రాలపై అసభ్యకరమైన వ్యాఖ్యలతో వేలం వేశారు. ఆ వేలం పాట రోజున సోషల్ మీడియాలో #BulliBai హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయింది. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ యాప్ బాగోతం బహిర్గతమైంది. బాధిత మహిళలు కూడా బుల్లి బాయి యాప్ పై ఫిర్యాదులు చేశారు.

టార్గెట్ ఆ ముస్లిం మహిళలే..

బుల్లీ బాయి యాప్ ఏదో యాదృచ్ఛికంగా ముస్లిం యువతుల ఫొటోలు నింపిన యాప్ కానేకాదు. కచ్చితమైన లక్ష్యంతోనే, ఎంపిక చేసుకున్న సుమారు 100 మంది మహిళల్ని వేలానికి ఉంచారు. ఆ మహిళలు అందరూ ఫేస్ బుక్, ట్విటర్ లాంటి సోషల్ మీడియా వేదికలపై ముస్లిం వాణిని, మహిళల వాదనను బలంగా వినిపిస్తున్నవారే కావడం గమనార్హం. సమాజంలో తమదైన ముద్ర వేసిన ముస్లిం మహిళలనే బుల్లీ బాయ్ యాప్ టార్గెట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఎవరు ధైర్యంగా మాట్లాడతారో వాళ్ల ఫొటోలనే దారుణంగా కించపరిచారు.

బాధితులు భయపడకుండా..

బుల్లీ బాయి యాప్ బాధితురాళ్ల జాబితాలో ముస్లిం మహిళా జర్నలిస్టులూ ఉన్నారు. ఈ యాప్ వల్ల తాము ఏ స్థాయి నరకాన్ని చూశామో చాలా మంది ధైర్యంగా వెల్లడించారు. యాప్ దురాగతాన్ని బయటపెడుతూ తమకు ఎదురైన కష్టాలను పంచుకున్నారు. సాధారణ ప్రజానీకం తనను మానసికంగా ఎలా హింసించారో వివరిస్తూ ఓ మహిళా జర్నలిస్ట్ పెట్టిన పోస్టు ఈ ఉదంతంలో కీలకంగా మారింది.

బుల్లీ బాయి ఎవరి పని?

బాధితురాళ్లు, ఎంపీ ప్రియాంక ఫిర్యాదు ప్రకారం బుల్లీ బాయ్ యూనీఫామ్ రీసెర్చ్ లొకేటర్ (యూఆర్ఎల్) URL bullibai.github.io అని ఉంది. ఈ గిట్ హబ్ అనేది మైక్రోసాఫ్ట్ వారి వేదిక కావడం గమనార్హం. గూగుల్ ప్లే స్టోర్ తరహాని గిట్ హబ్ లో ఎవరైనా ఒక యాప్ ను రూపొందించి, దాన్ని యూజర్లకు అందుబాటులోకి తీసుకురావచ్చు. సాధారణ భాషలో, GitHub అనేది ఇంటర్నెట్ హోస్టింగ్ ప్లాట్‌ఫారమ్. యాప్‌లు మరియు సాఫ్ట్‌వేర్‌లు అభివృద్ధి చేసుకునే, ప్రారంభించుకునే స్పేస్ అనమాట. ఇది వినియోగదారు అనేక రకాల యాప్‌లను పొందే ఓపెన్ ప్లాట్‌ఫారమ్. ఈ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులను యాప్‌లను సృష్టించడానికి లేదా భాగస్వామ్యం చేయడానికి అనుమతిస్తుంది. గిట్ హబ్ 2008లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైంది. దీని ప్రస్తుత CEO థామస్ డోమ్కే. కాగా, బుల్లీ బాయి యాప్ రూపొందించింది ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు.

రంగంలోకి దిగిన కేంద్రం..

బుల్లీ బాయి యాప్ వికృతాలపై సోషల్ మీడియాలో పెనుదుమారం రేగడంతో కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. గిట్ హబ్ ప్లాట్‌ఫారాన్ని వాడుకునే యూజరే ఈ యాప్ ను రూపొందించాడని మంత్రి తెలిపారు. మైక్రో సాఫ్ట్ సంస్థకు ఫిర్యాదు చేసిన వెంటనే గిట్ హబ్ నుంచి బుల్లీ బాయి యాప్ ను తొలగించారని, యాప్ రూపొందించిన వినియోగదారుణ్ని కూడా గిట్ హబ్ నిషేధించిందని మంత్రి తెలిపారు. అదే సమయంలో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, పోలీసులు సైతం తమ దర్యాప్తును కొనసాగిస్తారి కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే..


సుల్లీ డీల్స్ సంచలనం..

బుల్లీ బాయ్ యాప్ వెలుగులోకి రావడానికి ఆరు నెలల ముందే, అంటే, గతేడాది జులై మాసంలో ‘సుల్లీ డీల్స్’అనే యాప్ ఒకటి సరిగ్గా ఇదే తీరులో దుమారం రేపింది. సుల్లీ యాప్ లోనూ ముస్లిం మహిళల ఫొటోలను ఉంచి, వాళ్లను వేలం వేయడం, పర్సనల్ డేటాను, ఫొటోలను బహిర్గతం చేయడం, నీచ కామెంట్లు పెట్టడం లాంటి ఉదంతాలు జరిగాయి. విచిత్రం కాకుంటే అప్పుడు సుల్లీ డీల్స్ యాప్ కూడా సరిగ్గా ఇదే మైక్రోసాఫ్ట్ వారి GitHub ఇంటర్నెట్ హోస్టింగ్ ప్లాట్‌ఫారమ్ లోనే తయారైంది. ఆ సందర్భంలోనూ పెద్ద దుమారం చెలరేగడం, సంస్థకు ఫిర్యాదులు వెళ్లడంతో సుల్లీ డీల్స్ నిషేధానికి గురైంది. అప్పటి కేసును పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు.

First published:

Tags: CYBER CRIME, Mobile App, Muslim Minorities, Women

ఉత్తమ కథలు