ఆ నక్కలు ఏమంటున్నాయి?... విపరీతంగా వైరల్ అవుతున్న వీడియో

ఆ నక్కల వీడియో చూసిన వాళ్లంతా... మళ్లీ మళ్లీ చూస్తున్నారు. భలే ఉందే అంటున్నారు. ఎందుకో తెలుసుకుందాం.

news18-telugu
Updated: July 1, 2020, 1:54 PM IST
ఆ నక్కలు ఏమంటున్నాయి?... విపరీతంగా వైరల్ అవుతున్న వీడియో
ఆ నక్కలు ఏమంటున్నాయి?... (credit - twitter)
  • Share this:
2013లో ఓ వైరస్ సాంగ్... ప్రపంచమంతా కోట్ల మంది చూసేలా చేసింది. ఐతే... అందులోని నక్కలు ఎలా సౌండ్ చేస్తాయో ఎవరికీ తెలియలేదు. ఐతే... నార్వేకి చెందిన మూడు నక్కలు మాత్రం... నక్కలు ఎలా మాట్లాడతాయో ప్రపంచానికి చూపించాయి. ఇప్పటివరకూ కుక్కలు మొరగడం, తోడేళ్లు కూత పెట్టడం, పిల్లులు మ్యావ్ అనడం విన్న ప్రపంచం... ఇప్పుడు నక్కల సౌండ్ కూడా విని ఆశ్చర్యపోతోంది. ఆ నక్కలు దాదాపు మనుషుల్లాగా ఏదేదో మాట్లాడుతున్నాయి. మనుషుల్లాగే నవ్వుతున్నారు. అందుకే అవి ఎమన్నాయో చెప్పమని వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో సూపర్ డూపర్ వైరల్ అయ్యింది. ఇప్పటికో 1.8 కోట్ల మంది చూశారు. కానీ ఎవ్వరూ అవి ఏమన్నాయో చెప్పలేకపోతున్నారు.

నిజానికి ఈ వీడియోలో నక్కలు... మాట్లాడటం కంటే... నవ్వడమే ఎక్కువగా ఉంది. వాటికి చక్కిలిగింతలు పెడుతుంటే... నవ్వకుండా ఉండలేక... తెగ నవ్వాయి. అది చూసి నెటిజన్లు కూడా చాలా ఆనందపడుతున్నారు. సేవ్ ఏ ఫాక్స్ అనే సంస్థ మొదట ఈ వీడియోని షేర్ చేసింది. ఈ స్వచ్ఛంద సంస్థ... నక్కల్ని కాపాడుతోంది. నక్కల్ని వాటి జూలు కోసం చంపేస్తున్నారు. ఈ వీడియోలో మీకు మూడు నక్కలు కనిపిస్తాయి. అవి ఫిన్నెగన్, డిక్సీ, విక్సీ... వీటిలో... విక్సీ కంటే... ముందు కనిపించిన రెండూ... తెగ నవ్వాయి. అటూ ఇటూ వంకర్లు తిరిగాయి.


ఈ వీడియోని మార్చిలో యూట్యూబ్‌లో షేర్ చేశారు. మొన్ననే ట్విట్టర్‌లోనూ పెట్టారు. ట్విట్టర్‌లో దీన్ని 85 లక్షల మంది చూశారు. వందల కొద్దీ కామెంట్లు పెట్టారు. నక్కలు ఎలా మాట్లాడతాయో, నవ్వుతాయో తమకు ఇప్పటికి తెలిసిందంటున్నారు చాలా మంది.


లైవ్ సైన్స్ ప్రకారం... రెడ ఫాక్సెస్... రకరకాలుగా శబ్దాలు చెయ్యగలవు. అవి ఫ్యామిలీ గ్రూపులతో మాట్లాడేందుకు వేర్వేరు శబ్దాలు చేస్తాయి. కానీ... నక్కలు నవ్వే వీడియోలు ఎక్కడా లేవు. పైగా మనుషుల్లాగా... హహ అని నవ్వడం ఇందులో కనిపిస్తోంది.

First published: July 1, 2020, 1:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading