WHAT DOES SUPERNOVA SOUNDS LIKE HERE IS THE ANSWERS GIVEN BY NASA MS GH
Supernova Sonification: సూపర్నోవాల ధ్వని ఎలా ఉంటుందో తెలుసా..?
image credits NASA/Instagram
Supernova Sonification: సిస్టమ్స్ సౌండ్ ద్వారా సోనిఫికేషన్ చేసినప్పుడు, ఎక్కువ శబ్ధానికి ఎక్కువ ప్రకాశవంతమైన కాంతిని ఇచ్చారు. ఈ టైమ్ ల్యాప్స్ వీడియోలో 1999 నుంచి 2013 వరకు చేసిన పరిశీలనల ద్వారా సోనిఫికేషన్ చేసినట్లు ఉంది.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ NASA హబుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది. సూపర్నోవా 1987A సోనిఫికేషన్ సౌండ్ ఎలా ఉంటుందో నాసా ఈ వీడియోలో తెలిపింది. హబుల్ స్పేస్ టెలిస్కోప్, నాసా చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ చేసిన పరిశీలనల ద్వారా ఈ సోనిఫికేషన్ సౌండ్‌ను వీడియోలో పొందుపరిచారు. సూపర్నోవా షాక్ వేవ్ దట్టమైన రింగ్ గుండా వెళుతున్న కొద్దీ కాంతి పెరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇది సూపర్నోవాగా మారడానికి ముందు, నక్షత్రంగా ఉన్నప్పుడే దీని నుంచి ఈ రింగ్ వేరుపడిందని పరిశోధకులు చెబుతున్నారు.
సిస్టమ్స్ సౌండ్ ద్వారా సోనిఫికేషన్ చేసినప్పుడు, ఎక్కువ శబ్ధానికి ఎక్కువ ప్రకాశవంతమైన కాంతిని ఇచ్చారు. ఈ టైమ్ ల్యాప్స్ వీడియోలో 1999 నుంచి 2013 వరకు చేసిన పరిశీలనల ద్వారా సోనిఫికేషన్ చేసినట్లు ఉంది.
తాత్కాలిక నక్షత్రాలు...
నక్షత్రంలో ఉత్పత్తి అయ్యే అధిక శక్తి వల్ల అది పేలిపోయినట్లు, బయటి పొర కాలిపోయినట్లు కనిపిస్తుంది. దీన్నే సూపర్నోవా అంటారు. ఇవి తాత్కాలిక నక్షత్రాలు. సూపర్నోవా 1987A లేదా SN 1987A అనేది టైప్ II సూపర్నోవా. ఇది లార్జ్ మెగెల్లానిక్ క్లౌడ్ అనే పాలపుంతకు చెందిన ఉపగ్రహంలో ఉంది. ఇది భూమికి 1,68,000 కాంతి సంవత్సరాల దూరంలో ఏర్పడింది. కెప్లర్ సూపర్నోవా తరువాత భూమికి అత్యంత దగ్గరలో ఉన్న సూపర్నోవా ఇదే. దీని నుంచి 1987 ఫిబ్రవరి 23న భూమికి లైటింగ్ వచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వీడియోలోని ఈ ట్యూన్ ఎంతోమంది స్పేస్ సైంటిస్టుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన 24 గంటల్లోనే దీనికి మూడు లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ మ్యూజిక్ ఎంతగానో ఆకట్టుకుంటోందని యూజర్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంగ్లిష్ రాక్ బ్యాండ్ మ్యూజిక్ కంటే ఇదే బాగుందని ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు. అంతరిక్షం గురించి తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులు, విద్యార్థులు దీని గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ సూపర్నోవా ఎప్పుడు ఏర్పడిందని, మనుషులకు దీని గురించి ఎప్పుడు తెలిసిందని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కామెంట్లలో ప్రశ్నిస్తున్నారు. ఇది 1,87,000 సంవత్సరాల క్రితం ఏర్పడిందని ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు.
ధ్వనిని సృష్టిస్తారు..
సాధారణంగా అంతరిక్షంలో ఎలాంటి ధ్వని (సౌండ్) ఉండదు. కానీ నక్షత్రాలకు, గెలాక్సీలకు పిచ్‌లను కేటాయించి సోనిఫికేషన్ చేయడం ద్వారా సౌండ్‌ను ఆవిష్కరించినట్లు నాసా తెలిపింది. హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా నాసా ఇంతకు ముందు ఇతర ఖగోళ వస్తువుల సోనిఫికేషన్ను కూడా గుర్తించింది. ఈ టెలిస్కోప్ ద్వారా సేకరించిన ఒక ఇమేజ్ ధ్వని ఎలా ఉంటుందో సోసిఫికేషన్ చేసింది. ఈ వీడియోను గత ఏడాది అక్టోబర్‌లో విడుదల చేసింది. ఈ నెల ప్రారంభంలో కూడా నాసా హబుల్ టెలిస్కోప్ ద్వారా బుల్లెట్ క్లస్టర్‌కు సోనిఫికేషన్ చేసింది. క్లస్టర్‌లోని కృష్ణ పదార్థానికి తక్కువ ఫ్రీక్వెన్సీని, ఎక్స్-రే లకు ఎక్కువ ఫ్రీక్వెన్సీని కేటాయించి సౌండ్ ఎలా ఉంటుందో సోసిఫికేషన్ చేశారు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.