• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • WHAT DO ASTRONAUTS EAT IN SPACE NASA SCIENTIST EXPLAINS THE ENHANCED DIET MK GH

Astronauts food: అంత‌రిక్షంలో పంటలు పండిస్తున్న నాసా...ఏం మొక్కలు పండాయంటే..

Astronauts food: అంత‌రిక్షంలో పంటలు పండిస్తున్న నాసా...ఏం మొక్కలు పండాయంటే..

Astronauts food: అంత‌రిక్షంలో వ్యోమోగాములకు అందించే ఆహరంపై నాసా పరిశోధనలు.. ఎలా చేస్తున్నారంటే...

Astronauts food: అంత‌రిక్షంలో వ్యోమోగాములకు అందించే ఆహరంపై నాసా పరిశోధనలు.. ఎలా చేస్తున్నారంటే...

  • Last Updated:
  • Share this:
అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు అందించే మెరుగైన ఆహారంపై పరిశోధనలు చేస్తోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. రోదసిలో ఎక్కువ రోజులు గడిపే ఆస్ట్రోనాట్ల శరీరంలో మార్పులను గుర్తించడం ద్వారా వారికి అందించాల్సిన పోషకాహారాన్ని మెరుగుపరచాలని నాసా భావిస్తోంది. ఇందులో భాగంగా గత వారం అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన విక్టర్ గ్లోవర్‌పై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. నాసా హ్యూమన్ రిసెర్చ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆయన అంత‌రిక్షంలోకి వెళ్లి తిరిగొచ్చారు. ఈ స్పేస్ మిష‌న్‌లో ఆయన పైల‌ట్‌గా, సెకండ్ ఇన్ క‌మాండ్‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. గ్లోవర్ అంతరిక్షంలోకి వెళ్లి రావడం ఇదే మొదటిసారి.



ప్ర‌స్తుతం అంతరిక్షంలో ఉంటున్న వ్యోమగాములు తీసుకునే ఆహారం.. వారిలో శారీరకంగా ఎలాంటి మార్పులకు కారణమవుతుంతో అర్థంచేసుకోడానికి నాసా శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ గ్రేస్ డ‌గ్ల‌స్ ఒక అధ్య‌య‌నం నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా వారికి ప్రస్తుతం స్పేస్‌ఫ్లైట్‌లో అందిస్తోన్న ఆహార‌ పద్ధతులను మెరుగుప‌రిచే విధానంపై దృష్టి పెట్టారు. హ్యూమ‌న్ రిసెర్చ్ ప్రోగ్రామ్‌కి చెందిన అడ్వాన్స్డ్ ఫుడ్ టెక్నాల‌జీ ప్రాజెక్ట్‌లో లీడ్ సైంటిస్ట్‌గా ఉన్నారామె. నాసాకు చెందిన‌ హోస్ట‌న్‌లోని జాన్స‌న్ స్పేస్ సెంట‌ర్‌లో ఆమె ప‌నిచేస్తున్నారు.



ఇప్ప‌టి వ‌ర‌కు ఇత‌ర వ్యోమగాములు రెగ్యుల‌ర్‌గా తీసుకునే స్పేస్‌ఫుడ్‌తో పోలిస్తే విక్ట‌ర్ గ్లోవర్‌కి మెరుగైన‌ డైట్‌ని అందించారు. ఈ మిష‌న్ ప్రారంభించ‌క‌ముందే ఈ ప్రత్యేకమైన ఆహారాన్ని రూపొందించారు. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు, లైకోపిన్‌, ఫ్లేవ‌నాయిడ్లు.. వంటివన్నీ ఈ పదార్థాల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మెరుగైన ఆహారం వ్యోమోగాముల రోగ‌నిరోధ‌క శ‌క్తిపై ఎలాంటి ప్ర‌భావం చూపుతుందో తెలుసుకోవ‌డానికి ఒక ప్రణాళికను రూపొందించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వ్యొమగాముల ర‌క్తం, లాలాజ‌లం, మూత్రం, మ‌లం శాంపిళ్ల‌ను ప‌రిశోధ‌కులు సేకరించారు. స్పేస్‌ఫ్లైట్లోకి వెళ్ల‌క‌ముందు, ఆ తరువాత కూడా ఈ శాంపిళ్ల‌ను సేకరించారు.



అంతరిక్షంలోకి వెళ్లిన తరువాత తాము నిర్దేశించిన డైట్‌ను అనుసరించాలని గ్లోవ‌ర్‌ను పరిశోధకులు ఆదేశించారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి వారం ఆయ‌న డాక్ట‌ర్ గ్రేస్ డ‌గ్ల‌స్ బృందాన్ని సంప్ర‌దించారు. ఎప్ప‌టిక‌ప్ప‌డు ప‌రిస్థితిని తెలియ‌జేస్తూ త‌గిన స‌ల‌హాల‌ను పొందారు. ప్రస్తుతం గ్లోవర్‌ భూమికి తిరిగి వచ్చిన క్రమంలో.. ఆయన శరీరంలో చోటు చేసుకున్న మార్పులను ఈ బృందం విశ్లేషించనుంది. దీని ద్వారా రానున్న రోజుల్లో మెరుగైన ఆహారాన్ని వ్యోమగాముల కోసం తయారు చేయవచ్చని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిశోధ‌న‌తో త‌క్కువ బ‌రువున్న స్పేస్‌షిప్‌ల‌ను త‌యారుచేయ‌డం ద్వారా ఆస్ట్రోనాట్‌ల‌కు మ‌రింత బ‌ల‌వ‌ర్థ‌క‌మైన ఆహారం అభివృద్ధి చేయ‌డానికి ఆస్కారం ఉందని అంటున్నారు నాసా ప‌రిశోధ‌కులు.
Published by:Krishna Adithya
First published: