• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • WHAT ARE SIDE EFFECTS OF COVID VACCINE COVISHIELD COVAXIN CHILDREN GET SHOT FAQS ANSWERED BY EXPERT MK GH

Covid-19 Vaccines: వ్యాక్సిన్​తో సైడ్​ ఎఫెక్ట్స్ ఉన్నాయా..? చిన్న పిల్లలకు వ్యాక్సిన్​ సురక్షితమేనా...

Covid-19 Vaccines: వ్యాక్సిన్​తో సైడ్​ ఎఫెక్ట్స్ ఉన్నాయా..? చిన్న పిల్లలకు వ్యాక్సిన్​ సురక్షితమేనా...

Corona Vaccine: పాపం..ఈ దేశాలు కరోనా వ్యాక్సిన్‌ ముఖమే చూడలేదు..అవేంటంటే?

Covid-19 Vaccines: వ్యాక్సిన్​తో సైడ్​ ఎఫెక్ట్స్ ఉన్నాయా? చిన్న పిల్లలకు వ్యాక్సిన్​ సురక్షితమేనా?.. మీ సందేహాలకు నిపుణుల సమాధానాలు

  • Share this:
దేశాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారికి చెక్​ పెట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే దారని కేంద్రం యోచిస్తోంది. దీంతో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగవంతం చేసింది. తొలి రెండు​ దశ వ్యాక్సిన్​ ప్రక్రియల్లో ఫ్రంట్​ లైన్​ వారియర్స్​, 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేయగా.. మే 1న మూడో దశ వ్యాక్సిన్​ ప్రక్రియను ప్రారంభించింది. దీనిలో18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్​ వేయాలని సంకల్పించింది. భారత్​లో వేగంగా సెకండ్​ వేవ్​ విజృంభిస్తున్నందున.. ప్రజలు వీలైనంత త్వరగా వ్యాక్సిన్​ వేయించుకోవాలని నిపుణులు కోరుతున్నారు. అయితే, కొంతమంది అవగాహన లేక వ్యాక్సిన్​కు దూరంగా ఉంటున్నారు. మరికొందరు వ్యాక్సిన్​ సామర్థ్యంపై, సైడ్​ ఎఫెక్ట్స్​పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో వ్యాక్సిన్​పై ఉన్న ఇలాంటి అపోహలను నివృత్తి చేశారు సీనియర్ పిడియాట్రిషన్​ డాక్టర్ శ్రీనివాస్ జి. కాసి. కరోనా వ్యాక్సిన్​పై ప్రజల్లో ఉన్న సందేహాలకు సమాధానాలిచ్చారు. అవేంటో చూద్దాం.

కోవాగ్జిన్​ లేదా కోవిషీల్డ్​ ఏది తీసుకోవాలి?
ప్రారంభంలో, కేవలం ఒకే కంపెనీకి చెందిన టీకా అందుబాటులో ఉండేది. అందువల్ల, ఒకే బ్రాండ్​ టీకాను మాత్రమే ఇచ్చేవారు, అయితే, ఇప్పుడు దేశంలో కోవాగ్జిన్​, కోవిషీల్డ్​ రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నందున ఆయా రాష్ట్రాలు తమకు ఇష్టమైన వ్యాక్సిన్​ ఎంచుకునే అవకాశం లభించింది. అయితే. కోవిన్ ప్లాట్‌ఫాంలో మాత్రం మనకు ఇష్టమైన వ్యాక్సిన్​ ఎంచుకునే ఆప్షన్​ ఇవ్వలేదు. సంబంధిత కేంద్రంలో ఏ వ్యాక్సిన్​ ఇస్తే.. దాన్నే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు వాక్సిన్లు సురక్షితమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఫస్ట్​ డోస్​ కోవిషీల్డ్ తీసుకున్నప్పటికీ సెకండ్​ డోస్​ కోవాక్సిన్ తీసుకోవచ్చా?
కోవాక్సిన్, కోవిషెల్డ్ రెండూ వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడి తయారయ్యాయి. కోవాక్సిన్ ఒక క్రియాశీలక టీకా కాగా, కోవిషీల్డ్​ వైరల్ వెక్టర్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి తయారైన టీకా. అందువల్ల మొదటిసారి డోసులో ఏ టీకా అయితే తీసుకున్నారో రెండో డోసులో కూడా అదే టీకా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఫస్ట్​ డోస్​ తీసుకున్నాక కరోనా పాజిటివ్​ వచ్చింది. రెండో డోస్​ కోసం ఎన్ని రోజులు వేచి చూడాలి?
టీకా ఫస్ట్​ డోస్​ తీసుకున్నాక కోవిడ్​ పాజిటివ్​గా నిర్థారణ అయితే.. కోవిడ్​ నుంచి కోలుకున్న తర్వాత కనీసం నాలుగు వారాల పాటు రెండో డోస్​కు వేచి ఉండాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

ఫస్ట్​ డోస్​, సెకండ్​ డోస్​ మధ్య ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి?
దీని కోసం ప్రత్యేక డైట్​ పాటించాల్సిన పని లేదు. మంచి పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం.

గర్భిణీ స్త్రీలు టీకా వేసుకోవచ్చా?
గర్భిణీ స్త్రీలకు కరోనా సోకితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వ్యాక్సిన్ల ద్వారా గర్భిణీ స్త్రీ పిండానికి ప్రమాదం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ, వీటిని గర్భిణీ స్త్రీలకు ఇవ్వకపోవడమే మంచిదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫారసు పేర్కొంది. అయితే, గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్​ వేయాలని FIGO సిఫార్సు చేయడం గమనార్హం. ఏదేమైనప్పటికీ, దీనిపై ఇంకా లోతుగా అధ్యయనం జరుగుతోంది. ఆ తర్వాతే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

నేను కరోనా నుంచి కోలుకున్నాను. అయినప్పటికీ టీకా వేసుకోవాలా?
అవును, కరోనా నుండి కోలుకున్నప్పటికీ.. మరలా సోకే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల, టీకా వేసుకోవడమే ఉత్తమం. దీని ద్వారా మీ రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది.

వ్యాక్సిన్ల వల్ల ఏవైనా సైడ్​ ఎఫెక్ట్స్​ ఉన్నాయా?
వ్యాక్సిన్​ వేసుకున్న తర్వాత చేయి నొప్పి, తేలికపాటి జ్వరం, అలసట, తలనొప్పి, కండరాలు లేదా కీళ్ల నొప్పులు వంటి సైడ్​ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే, అందరిలోనూ ఈ సైడ్​ ఎఫెక్ట్స్​ కన్పించవు. ఒకవేళ వీటిని అనుభవించినా బయపడాల్సిన పని లేదు. త్వరగా వీటి నుంచి కోలుకుంటారు.

నేను సెకండ్​ డోస్​ కూడా తీసుకున్నాను. మళ్లీ నాకు బూస్టర్ షాట్ అవసరమా?
ప్రస్తుతానికైతే, నిపుణులు బూస్టర్ షాట్​ గురించి ఎటువంటి సిఫార్సులు చేయలేదు. వ్యాక్సిన్​ ద్వారా వచ్చే యాంటీ బాడీలు 6- నుంచి 12 నెలల వరకు బాడీలో నిలిచి ఉంటాయి. బూస్టర్ షాట్​ల ప్రతిస్పందన, భద్రతను అంచనా వేయడానికి అధ్యయనాలు జరుగుతున్నాయి.

పిల్లలకు టీకాలు వేయడం సురక్షితమేనా?
ప్రస్తుతానికి కరోనా టీకాలను పిల్లలకు సిఫార్సు చేయలేదు. ఎందుకంటే, మొదటగా, పిల్లల్లో వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందనే దానిపై స్పష్టత లేదు. రెండవది, పిల్లలకు కరోనా సంక్రమణ ప్రమాదం చాలా తక్కువ. ఒకవేళ సోకినా మరణించే అవకాశాలు చాలా తక్కువ. ఈ కారణాల చేత ప్రభుత్వం కేవలం 18 ఏళ్ల పైబడిన వారికే వ్యాక్సిన్​ ప్రక్రియను ప్రారంభించింది.

టీకా తీసుకున్న ఒకరోజు ముందు మద్యం సేవించవచ్చా?
పరిమిత మోతాదులో తీసుకోవచ్చు. అయితే, ఎక్కువ మొత్తంలో తీసుకుంటే రియాక్షన్​ వచ్చే ప్రమాదం ఉంటుంది.

నేను ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. టీకా వేసుకునే ముందు లేదా తరువాత ఆయా మందులను వేసుకోవడం మానేయాలా?
మానేయాల్సిన అవసరం లేదు. వాటిని కొనసాగించవచ్చు.

నేను రెండో డోస్​ తీసుకున్నాను. అయినా, బయటికి వచ్చినప్పుడు మాస్క్​ ధరించాల్సిందేనా?
అవును. వ్యాక్సిన్​ వేసుకున్నంత మాత్రాన కరోనా సోకదన్న గ్యారెంటీ లేదు. వ్యాక్సిన్​ కేవలం మీ శరీరంలో యాంటీ బాడీస్​ను అభివృద్ధి చేస్తుంది. అంతేకాని, కరోనా రాకుండా ఆపలేదు. కాబట్టి, టీకా తర్వాత కూడా సామాజిక దూరం, మాస్​ ధరించడం, శానిటైజ్​ చేసుకోవడం వంటివి కొనసాగించాలి.
Published by:Krishna Adithya
First published:

అగ్ర కథనాలు