హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG Woman Catches snake: నీ ధైర్యానికి జోహారు.. వట్టి చేతులతోనే పాముని ఎలా పట్టుకుందో చూడండి

OMG Woman Catches snake: నీ ధైర్యానికి జోహారు.. వట్టి చేతులతోనే పాముని ఎలా పట్టుకుందో చూడండి

వట్టి చేతులతో పెద్ద పామును పట్టిన యువతి

వట్టి చేతులతో పెద్ద పామును పట్టిన యువతి

ఈ యవతి సాహసానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. అనుకున్న ప్లాన్ ఏ మాత్రం తప్పినా.. రెప్ప పాటులో ఏం జరిగేదో ఊహించ వచ్చు.. కానీ ఆ అమ్మాయి ఏ మాత్రం బెదరకుండా ప్రాణాలకు తెగించి చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

పాముని చూస్తే భయపడని వారు ఎవరుంటారు.. అంతెందుకు కిచెన్ లో బొద్దింకను చూసినా భయపడి పరుగులు తీసే ఆడవాళ్లు ఎంతో మంది ఉన్నారు. మరి చిన్ని సైజు పాము కనిపిస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయి. గుండె వేగం పెరుగుతుంది. ఆమడ దూరంలో ఉండే పామును చూస్తేనే భయంతో పరుగుతీస్తారు. అలాంటింది. ఓ భారీ సైజులో ఉన్న పాము అడుగుల దూరంలో కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పోవా.. మన సంగతి ఎలా ఉన్నా.. ఓ యువతి చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె కేవలం ఒట్టి చేతులతో పొడవైన పాముని పట్టుకుంది. అంత పెద్ద పాముని చూసినా అదరలేదు, బెదరలేదు. ఎంతో ధైర్యంగా దాన్ని పట్టుకుంది. అదీ ఒట్టి చేతులతోనే. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ యువతి సాహసానికి అంతా ఆశ్చర్యపోతున్నారు. అమేజింగ్, వావ్, ఓ మై గాడ్, ఓ మగువా నీ తెగువ అంటూ వరుస కామెంట్లు చేస్తున్నారు..

ఇది ఎక్కడ.. ఆ యువతి ఎవరు అన్నది పూర్తి వివరాలు తెలియడం లేదు కానీ.. ఆ అమ్మాయి సాహసం మాత్రం అమ్మ బాబోయ్ అనేలా చేస్తోంది. వీడియోలో చూస్తే.. అదో పాడుబడిన ఇల్లు. అందులో ఓ గదిలో పెద్ద పాము ఒకటి కనిపించింది. అక్కడికి చేరుకున్న యువతి ముందు కర్రతో పాముని హ్యాండిల్ చేసింది. ఆ పాము చూడటానికి చాలా భయంకరంగా ఉంది. ఎంతో పొడవుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా దాని చేతిలో ప్రాణాలు పోతాయేమో అనే భయం వెంటాడుతుంది. చాలా గట్టిగా బుసలు కొడుతోంది కూడా..

అయినా ఆమె భయపడలేదు. దాని దగ్గరిగా వెళ్లింది. ఒట్టి చేతులతోనే దాన్ని పట్టుకుంది. ఆ తర్వాత దాన్ని బయటకు తీసుకొచ్చింది. అయితే ఆ పాముని పట్టుకునే క్రమంలో అది ఆమెను కాటేసే ప్రయత్నం చేసింది. కోపంగా బుసలు కొట్టింది. అయినా ఆ యువతి అస్సలు భయపడలేదు. ఒట్టి చేతులతోనే పాముని ఒడిసిపట్టింది. ఆ తర్వాత ఓ సంచిలో దాన్ని బంధించింది. యువతి పాముని పట్టుకుంటుండగా ఎవరో వీడియో తీశారు. ఈ వీడియో నాలుగు నిమిషాల నిడివితో ఉంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తక్కువ సమయంలోనే 1.4లక్షల లైకులు, 19వేల షేర్లు వచ్చాయి. పాముని పట్టడంలో ఆ యువతి చూసిన తెగువ, నైపుణ్యం అందరిని ఆకట్టుకుంటోంది. http://


పాముని పట్టుకునే క్రమంలో ఆమె చూపించిన టెక్నిక్స్ చాలా ప్రమాదకరమైనవనే కామెంట్స్ వస్తున్నాయి. ఆమె చావుతో ఇలా ఆడినందుకు కచ్చితంగా ఒలింపిక్ మెడల్ ఇవ్వాల్సిందే అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. పాము పట్టుకోవడానికి ఉపయోగించే టెక్నిక్స్ లో ఇది చాలా ప్రమాదకరమైనదని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి పాముని పట్టుకుంది. ఆమెకు చాలా లక్ ఉందని మరొకరు కామెంట్ చేశారు. ఇలా ఎవరికి తోచిన కామెంట్లు వారు చేస్తున్నారు.

First published:

Tags: International news, Snake, Trending videos, Viral Videos

ఉత్తమ కథలు