హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఒకే స్కూల్ నుంచి ఐదుగురు ఉపాధ్యాయుల బదిలీ.. స్టూడెంట్స్ ఏంచేశారంటే..

ఒకే స్కూల్ నుంచి ఐదుగురు ఉపాధ్యాయుల బదిలీ.. స్టూడెంట్స్ ఏంచేశారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Viral news:  వందలాదిగా విద్యార్థులంతా రైల్వే స్టేషన్ చేరుకున్నారు. అక్కడ నడుస్తున్న రైలుకు ముందుకూర్చున్నారు. విద్యాశాఖకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • West Bengal, India

వెస్ట్ బెంగాల్ లోని సీల్దా పరిధిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒకే పాఠశాలకు చెందిన వందలాది విద్యార్థులు స్కూల్ యూనిఫామ్ వేసుకుని రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ నడుస్తున్న రైలుకు అడ్డంగా కూర్చుని భారీ ఎత్తున నిరసన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్ తలెత్తింది. రైల్వే అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.

అసలేం జరిగిందంటే.. పశ్చిమ బెంగాల్ లోని (West bengal)  కానింగ్ అనే ప్రాంతంలో గౌర్దాహ నారాయణపూర్ అక్షయ విద్యామందిర్‌ అనే స్కూల్ ఉంది. అయితే.. అక్కడ విద్యాశాఖ అధికారులు పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులను బదిలీ చేస్తు ఉత్వర్వులు జారీ చేశారు.  ఇది తెలిసిన వెంటనే విద్యార్థులంతా భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్నాళ్లు మాకు చదువు చెప్పిన టీచర్లంతా ఒక్కసారిగా వెళ్లిపోతున్నారనే విషయం తెలిసి ఉండబట్టలేకపోయారు. దీంతో విద్యార్థుంతా పాఠశాలలో అధికారులతో వాగ్వాదానికి దిగారు.

ఈ క్రమంలో..   విద్యార్థులంతా ఒక్కసారిగా ఆందోళన చెందారు. తమ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఒకేసారి బదిలీ చేయడం ఏంటని ఆగ్రహంతో ఊగిపోయారు. తమ చుట్టుపక్కల అనేక పాఠశాలలు ఉన్నాయని, ఒక్కొక్క పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడిని ట్రాన్స్ ఫర్ చేయోచ్చుకదా.. అంటూ విద్యాశాఖపై అధికారులపై విరుచుకుపడ్డారు.

తమ పాఠశాల నుంచి ఐదుగురు ఉపాధ్యాయులను బదిలీ చేస్తే తాము.. చదువుకు నష్టపోతామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు 11,12 తరగతిలో ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని, వెంటనే బదిలీ నిర్ణయాన్ని విద్యాశాఖ ఉపసంహరించుకోవాలని విద్యార్థులు నిరసన తెలిపారు. దీనిలో భాగంగానే స్కూల్ యూనిఫామ్ ధరించి వందలాదిగా విద్యార్థులంతా కలిసి సీల్దా సౌత్ డివిజన్ లో ఉన్న గౌర్దాహా రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ రైళ్లు వెళ్లకుండా పట్టాలపైన కూర్చుని తమ నిరసనను తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: VIRAL NEWS, West Bengal

ఉత్తమ కథలు