హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Remarries : వెరైటీగా ఉండాలని..100వ పుట్టినరోజున మళ్లీ పెళ్లి చేసుకున్నాడు

Remarries : వెరైటీగా ఉండాలని..100వ పుట్టినరోజున మళ్లీ పెళ్లి చేసుకున్నాడు

Man Remarries On His 100th Birthday : ఓ వ్యక్తి తన వందో పుట్టిన రోజున ఓ విచిత్రమైన పని చేశాడు. బర్త్‌ డే చాలా స్పెషల్‌గా ఉండాలని అదే రోజు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.మనవళ్లు,మునిమనవళ్లు మధ్య తన 100వ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు పెళ్లిలో దంపతులిద్దరు కరెన్సీ నోట్లతో తయారు చేసిన దండలు మార్చుకున్నారు.

ఇంకా చదవండి ...

Man Remarries On His 100th Birthday : ఓ వ్యక్తి తన వందో పుట్టిన రోజున ఓ విచిత్రమైన పని చేశాడు. బర్త్‌ డే చాలా స్పెషల్‌గా ఉండాలని అదే రోజు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.మనవళ్లు,మునిమనవళ్లు మధ్య తన 100వ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు పెళ్లిలో దంపతులిద్దరు కరెన్సీ నోట్లతో తయారు చేసిన దండలు మార్చుకున్నారు. తర్వాత విందు కూడా ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ పెళ్లి జరిగింది. అయితే ఈ వయస్సులో ఇదేం పని అనుకునేరు..అసలు విషయం తెలిస్తే ఆనందపడతారు.

ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన బిస్వనాథ్ సర్కార్ కు ఈ ఏడాది వందేళ్లు వచ్చాయి. అయితే ఈ పుట్టిన రోజు నాడు ఏదయినా వెరైటీగా చేయాలని ఆయన పిల్లలు, మనవలు అనుకున్నారు. ఈ సమయంలో బిస్వనాథ్ సర్కార్ కోడలకు వినూత్న ఆలోచన వచ్చింది. బిస్వనాథ్ సర్కార్ కు ఆయన 90 ఏళ్ల భార్య సురోధినితోనే మళ్లీ పెళ్లి చేయాలని ఆమెకు అనిపించింది. అది కుటుంబ సభ్యులతో చెప్పగా అందరూ దానిని అమలు చేశారు. దాంతో వారిద్దరికి సంప్రదాయబద్ధంగా మళ్లీపెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి బిస్వనాథ్ సర్కార్ దంపతులు కూడా ఒప్పుకోవడంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న బిస్వనాథ్- సురోధ్వని దంపతుల పిల్లలు, మనవలు, మనవరాళ్లు గ్రామానికి చేరుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం అన్ని సిద్ధం చేశారు.

ALSO READ Child Rape : 6 ఏళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం..వీడిని కోసి కారం పెట్టాలి

మనవరాలు వధువును రెడీ చేస్తే.. మనవళ్లు వరుడిని సిద్ధం చేశారు. వరుడు గుర్రపు బండిపై వధువు ఇంటికి వెళ్లగానే బాణాసంచా కాల్చారు. వరుడు ధోతీ-కుర్తా, వధువు చీర ధరించారు. అంతేకాదు పెళ్లిలో దంపతులిద్దరు కరెన్సీ నోట్లతో తయారు చేసిన దండలు మార్చుకున్నారు. తర్వాత విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు 700 మందికి పైగా ఆహ్వానించి వారికీ భోజన ఏర్పాట్లు చేశారు. భాగోబన్ గోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని బమునియా గ్రామంలో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దంపతుల కుమారులు, కోడళ్లు, కోడళ్లు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు తరలివచ్చారు.

ALSO READ Viral Video : కంటిచూపుతో వరుడిని కంట్రోల్ చేసిన వధువు.. రొమాంటిక్ లుక్ కు మాటల్లేవ్ అంతే..!

బిస్వనాథ్ సర్కార్ 1953వ సంవత్సరంలో ఫెజల్‌ పూర్‌ కు చెందిన సురోధిని సర్కార్‌ ను వివాహం చేసుకున్నాడు. వీరికి వివాహం జరిగి ఇ్పపటికి 70 సంవత్సరాలు అవుతుంది. ఈ దంపతులకు 6 మంది కుమారులు, 3 కుమార్తెలు, కోడలు, కోడలు మరియు 23 మందిమనవళ్లు మరియు మనవరాళ్లు,10 మంది మునిమళ్లు ఉన్నారు. వారి పిల్లలు చాలా మంది తమ వృత్తి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉంటున్నప్పటికీ, వారందరూ ఈ వేడుకను జరుపుకోవడానికి హాజరయ్యారు. తమ తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవలు పెట్టుకున్నట్లు కనిపించలేదని ఓ కొడుకు పేర్కొన్నాడు. పెళ్లి సమయంలో చిరునవ్వుతో పరస్పరం మాట్లాడుకున్నారని చెప్పాడు. తన తల్లిదండ్రుల వివాహం కొత్త తరానికి ఉదాహరణగా ఉండాలని తాను చాలా కాలంగా భావించానని.. కాబట్టి కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత, వారి 70వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి పునర్వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నాము అని వృద్ధ దంపతుల కుమారుడు చెప్పాడు.

First published:

Tags: Marriage, Old women, West Bengal

ఉత్తమ కథలు