Mamata Banerjee fat shames party member: నిత్యం గంభీరంగా కనిపించే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ(Mamata Banerjee)తన పార్టీ నేతతో చాలా సరదాగా మాట్లాడారు. పురిలియాలో జరిగిన టీఎంసీ(TMC)కార్యర్తల సమావేశంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతున్న సమయంలో ఓ భారీకాయుడి వంతు వచ్చింది. 125 కిలోల బరువున్న వ్యక్తి పొట్టను చూసి మమత షాక్ అయ్యారు. రోటుండ్ పురపాలక సంఘం చైర్మన్ సురేశ్ అగర్వాల్.. మమతతో ఏదో విషయం చెబుతుండగా ఆమె మధ్యలో కలగజేసుకున్నారు. బస్తా లాంటి నీ పొట్ట చూస్తుంటే ఏదో ఒక రోజు నువ్వు కుప్పకూలిపోతావ్ అనిపిస్తుంది? నీ ఆరోగ్యం బాగానే ఉందా? అని అడిగారు. అందుకు సురేశ్ అగర్వాల్ బదులిస్తూ.. నాకు షుగర్, బీపీ లాంటివి ఏమీ లేవు. ఆరోగ్యంగా ఉన్నాను మేడం అని అన్నాడు. తాను రోజూ వర్కవుట్లు కూడా చేస్తానని దీదీని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆమె మాత్రం అసలు నమ్మలేదు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సమావేశాన్ని మమత బెనర్జీ సామాజిక మాధ్యమాల ఖాతాల్లో కూడా స్ట్రీమ్‌లైన్ చేశారు.
మమతా బెనర్జీ-సురేశ్ అగర్వాల్ మధ్య సంభాషణ
మమతా బెనర్జీ : మీ పొట్ట పెరిగిపోతోంది, ఏదో ఓ రోజు కుప్పకూలిపోతావు.
సురేశ్ అగర్వాల్ : అదేం లేదు మేడం, నేను కుప్పకూలిపోను.
మమతా బెనర్జీ : వాకింగ్ చేస్తావా? ఎక్సర్సైజులు చేస్తావా?
సురేశ్ అగర్వాల్ : నాకు మధుమేహం కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ లేవు.
మమతా బెనర్జీ : అయితే నీకు కాలేయ సమస్యలు ఉండొచ్చు.
సురేశ్ అగర్వాల్ : నాకు ఆరోగ్య సమస్యలు లేవు మేడం
మమతా బెనర్జీ : అయితే అంత పెద్ద మధ్య ప్రదేశ్ ఎలా వచ్చింది? (పొట్టను మధ్య ప్రదేశ్ అని సరదాగా)
సురేశ్ అగర్వాల్ : మందులు వాడవలసిన అవసరం నాకు రాలేదు. అది నా రికార్డు.
మమతా బెనర్జీ : రికార్డుని పక్కనబెట్టు. ఎక్సర్సైజ్ చేస్తావా? లేదంటే నడుస్తావా?
సురేశ్ అగర్వాల్ : నేను రోజూ 90 నిమిషాలపాటు నడుస్తాను. అయితే నేను రోజూ ఉదయం పకోడీలు తింటాను.
మమతా బెనర్జీ : ఉదయాన్నే పకోడీలు ఎందుకు తింటున్నావు?
సురేశ్ అగర్వాల్ : చిన్నప్పటి నుంచి అలవాటు. పకోడీలు అంటే నాకు చాలా ఇష్టం.
మమతా బెనర్జీ : రోజూ పకోడీలు తింటే నీ పొట్ట తగ్గదు.
సురేశ్ అగర్వాల్ : అయితే నేను రోజుకు 90 నిమిషాలపాటు కసరత్తులు చేస్తాను.
మమతా బెనర్జీ : ఏం కసరత్తులు చేస్తావు?
సురేశ్ అగర్వాల్ : అనులోమ, విలోమ ప్రాణాయామం చేశారు.
మమతా బెనర్జీ : నువ్వు చేస్తున్నది ప్రాణాయామం. దాన్ని చేయడం వల్ల నీ పొట్ట తగ్గదు. నీ పొట్ట కోసం ఎలాంటి ఎక్సర్సైజులు చేస్తావు?
సురేశ్ అగర్వాల్ : కపాలభాతి చేస్తాను.
మమతా బెనర్జీ : ఎన్నిసార్లు కపాలభాతి చేస్తావు?
సురేశ్ అగర్వాల్ : వెయ్యిసార్లు.
మమతా బెనర్జీ : అసాధ్యం.
సురేశ్ అగర్వాల్ : నేను దీనిని సాయంత్రం చేస్తాను మేడమ్. నేను ఇంకా ఏమీ తినలేదు.
మమతా బెనర్జీ : నా ముందు వెయ్యి కపాలభాతిలు చేస్తే, ఇక్కడికిక్కడే రూ.10,000 ఇస్తాను.
సురేశ్ అగర్వాల్ : దానిని నేను సాయంత్రం 5 గంటల తర్వాత చేస్తాను. దాన్ని ఉదయం కానీ, సాయంత్రం 5 తర్వాత కానీ చేయాలనే నిబంధన ఉంది. నేను చేయగలనని 5 గంటల తర్వాత రుజువు చేస్తాను.
మమతా బెనర్జీ : నువ్వు చెయ్యలేవని నేను గ్యారంటీ ఇస్తాను.
సురేశ్ అగర్వాల్ : నేను చేయగలను. ఒట్టు.
మమతా బెనర్జీ : నువ్వు వెయ్యి కపాలభాతిలు చెయ్యడానికి ఆస్కారం లేదు. లేకపోతే నీకు అంత పెద్ద పొట్ట ఉండేది కాదు. సరిగ్గా శ్వాస తీసుకోవడం ఎలాగో నీకు తెలియదు. కేవలం నువ్వు నీ పొట్ట చేత డ్యాన్స్ చేయిస్తున్నావు. నేను కూడా కపాలభాతి చేస్తాను.
సురేశ్ అగర్వాల్ : ఔను మేడమ్, మీరు రోజూ 24 కిలోమీటర్లు నడుస్తారని నాకు తెలుసు.
మమతా బెనర్జీ : నేను ఎంత దూరం నడుస్తానో నువ్వు చూడనక్కర్లేదు.
“how has your MadhyaPradesh (tummy) grown so big?” CM #MamataBanerjee was caught worried about the health of her municipality leader who weighs 125 kgs yet admittedly eats pakoras every morning. The conversation is hilarious. The chairman tried hard to prove his workout abilities pic.twitter.com/hDZw3OFamQ
— Tamal Saha (@Tamal0401) May 30, 2022
నువ్వు వెంటనే పకోడీలు తినడం మానెయ్. వ్యాయామం మొదలుపెట్టు. అప్పుడే పొట్ట కరుగుతుంది. నెల రోజులు అన్నమే తిను. రాత్రిపూట తిన్న తర్వాత ఒక కిలోమీటర్ నడువు. 12 గంటలపాటు ఏమీ తినకుండా ఉండు. నువ్వు ఇలా చేస్తున్నావో లేదో నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటా అని సురేశ్ కి చెప్పారు దీదీ. అయితే అందరిముందు తన పొట్ట, బరువు గురించి మమత మాట్లాడినా సురేశ్ మాత్రం అవమానంగా భావించలేదు. దీదీ సలహాను కచ్చితంగా ఆచరిస్తానని చెప్పాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mamata Banerjee, Viral Video