పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని అంటారు. కొందరు చిన్నతనం నుంచే అద్భుతమైన ట్యాలెంట్ ను (Special talent) కల్గి ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమాజంలో మంచి స్థాయిలో ఉండాలని ఆశపడతారు. తమ పిల్లలకు సమాజంలో మంచి గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు రావాలని కోరుకుంటుంటారు. దీనికోసం తమ పర్సనల్ లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేస్తుంటారు. అందరిలోను ఏదో ప్రతిభ తప్పకుండా ఉంటుంది. దాన్ని గుర్తించి, ఆ రంగంలో వారిని ప్రొత్సహిస్తే తప్పకుండా మంచి పేరు సాధిస్తారు. కొందరు మొక్కై వంగనిదీ మానై వంగునా అనే నానుడిని బాగా ఫాలో అవుతారు.
చిన్నప్పటి నుంచి తమ పిల్లాడిని సరైన విద్యాబుద్ధులు, క్రమ శిక్షణ అలవాటు చేస్తుంటారు. దీంతో అది క్రమంగా వారికి అలవాటు అవుతుంది. ఇలాంటి తల్లిదండ్రుల పిల్లలు చిన్న వయసులోనే గొప్ప స్థాయికి చేరుకుంటారు. ఈ కోవకు చెందిన ఒక స్పూర్తిదాయకమైన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. అనిరుద్ధ ఘోష్, సంపాతి ఘోష్ దంపతులు. వీరు వెస్ట్ బెంగాల్ (West bengal) లోని మిడ్నాపూర్ లో ఉంటారు. అనిరుద్ద ఘోష్ పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి ఆత్రేయ ఘోష్ అనే ఐదేండ్ల పాప ఉంది. ఈమెను అనిరుద్ద దంపతులు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. తమ పాపను చిన్నప్పటి నుంచి అనేక కథలు, పజిల్స్ చెపుతుండేవారు. సాధారణంగా ఐదేండ్ల వయసులో ఇంగ్లీష్ అకర మాలలోని లెటర్స్ చెప్పడానికి పిల్లలు తెగ ఇబ్బందిపడుతుంటారు.
చాలా మందికి అసలు గుర్తుకు ఉండదు. అలాంటిది.. ఆత్రేయ ఘోష్ మాత్రం.. ఇంగ్లీష్ అక్షరాల లోని లెటర్స్ లను ఎలాంటి తడబాటు, తప్పులు లేకుండా చెప్పేస్తుంది. ఇంకా హైలేట్ ఎంటంటే.. ఇంగ్లీష్ అకర మాలలోనిన లెటర్స్ లను రివర్స్ లో కూడా తప్పులు లేకుండా చెప్పేస్తుంది. ఈ ఘనతను కేవలం 23 సెకన్లలోనే పూర్తి చేస్తుంది. ఈ అరుదైన రికార్డుకు గాను. ఆత్రేయ ఐదేండ్లలోనే 2022 లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు సాధించింది. తమ చిన్నారి అరుదైన రికార్డు పట్ల తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తున్నారు. తమ పాపను చిన్నప్పటి నుంచి పాటలు పాడటం, నృత్యం, పఠనం తదితర వాటిలో మంచి ట్రైనింగ్ ఇస్తున్నామని బాలిక తల్లిదండ్రులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించేలా తమ పాపను ప్రొత్సహిస్తున్నామని అనిరుద్ధ తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.