Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    PM MODI: పాకిస్థాన్ పార్లమెంటులో మోడీ.. మోడీ నినాదాలు..! నిజమేనా..?

    Modi Modi Chants In pakistan Parliment: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు) లో మన ప్రధాని మోడీ నామస్మరణ మార్మోగిపోయింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు.. ‘మోడీ.. మోడీ..’ అంటూ స్మరించారని సోషల్ మీడియా కోడై కూస్తున్నది. ఇందులో నిజమెంత..?

    news18
    Updated: October 30, 2020, 9:33 AM IST
    PM MODI: పాకిస్థాన్ పార్లమెంటులో మోడీ.. మోడీ నినాదాలు..! నిజమేనా..?
    ఫ్రతీకాత్మకచిత్రం
    • News18
    • Last Updated: October 30, 2020, 9:33 AM IST
    • Share this:
    అది మన దాయాది దేశం పాకిస్థాన్ అత్యున్నత చట్టసభ. అక్కడ భారత్ కు వ్యతిరేకంగా ఏం చేయాలా..? అనే విషయంమీద ఆ పాలకులు తలలు పట్టుకుంటుంటారు. భారత్ పేరు చెబితేనే కస్సుబుస్సుమంటూ పైకెరుగుతారు. కొద్దిరోజుల నుంచి ఆ దేశానికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్న భారత్ ను చూసి సహజంగానే వారు ద్వేషభావాన్ని పెంచుకుంటారు. పూల్వామా దాడి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని బాలాకోట్ లో మెరుపుదాడులతో మనమంటేనే పాకిస్తాన్ అగ్గిమీద గుగ్గిల్లంలా లేస్తున్నది. ఇక ఆ దాడులను దగ్గరుండి పర్యవేక్షించిన మన ప్రధాని మోడీ పేరు చెబితే పాక్ చట్టసభ్యులకు మాట పెకలడం లేదు. అలాంటిది సాక్షాత్ పార్లమెంటులో ఆయన పేరు మార్మోగిపోయింది.

    పాకిస్థాన్ పార్లమెంటులో చర్చలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు మార్మోగింది. చట్టసభ్యులంతా ఆయన నామస్మరణ చేశారంటూ పలు వెబ్ సైట్లు కథనాలు రాశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అధికార పక్ష సభ్యులలో ఒక వ్యక్తి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుండగా.. మరోవైపు నుంచి అక్కడే కూర్చున్న మిగతా సభ్యులు.. ‘మోడీ.. మోడీ.. మోడీ..’ అని అరుస్తున్నారని ఆ కథనాల సారాంశం. స్వయంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన సభ్యులు కూడా వారికి వంత పాడారనేది మరో వార్తా సారంశం. ఇది ఇమ్రాన్ ఖాన్ కు ఇబ్బంది అని పలువురు నెటిజన్లు కూడా అన్నారు. మరి ఇందులో నిజమెంత..?





    పాక్ పార్లమెంటులో ఒక అంశం మీద చర్చాకార్యక్రమం నడుస్తుంది. ఆ అంశం మీద ఓటింగ్ జరపాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. అందులో భాగంగానే పలువురు ఎంపీలు లేచి.. ‘ఓటింగ్.. ఓటింగ్.. ఓటింగ్’అని అరిచారు.





    పలువురు సోషల్ మీడియా ఘనులు.. ఈ క్లిప్ ను కొంచెం మాయ చేసి మొదలు ‘మోడీ.. మోడీ.. ’అని వచ్చే విధంగా ఎడిట్ చేశారు. అదీ కథ.
    Published by: Srinivas Munigala
    First published: October 30, 2020, 9:29 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading