Weekly Horoscope: వారఫలాలు... ఈ రాశుల వారికి పదోన్నతులు, సొంతింటి కల సాకారం

Weekly Horoscope: 12 రాశుల వారికి ఈ వారం... నవంబర్ 29, 2020 నుంచి డిసెంబర్ 5, 2020 వరకు... వార ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

news18-telugu
Updated: November 29, 2020, 8:07 AM IST
Weekly Horoscope: వారఫలాలు... ఈ రాశుల వారికి పదోన్నతులు, సొంతింటి కల సాకారం
వారఫలాలు... ఈ రాశుల వారికి పదోన్నతులు, సొంతింటి కల సాకారం
  • Share this:
తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వార ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ వారం (నవంబర్ 29, 2020 నుంచి డిసెంబర్ 5, 2020) వార ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.

మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో అనుకూమైన మార్పు లేదా ఆశించిన మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. రియల్‌ ఎస్టేట్‌ వారికి, చిన్న వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు సంభవం. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. స్నేహితురాలితో చెట్టపట్టాల్‌ వేసుకుని తిరుగుతారు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఐ.టి, పరిశోధక విద్యార్థులకు బాగుంది.

వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
చాలా కాలానికి మంచి ఉద్యోగం ఆఫర్‌ వస్తుంది. ఆదాయం పెరుగుతుం కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ వారం ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. విహార యాత్రకు వెళ్తారు. వ్యాపారం ప్రారంభించగానే ఆటంకం పెరుగుతుంది. ఎవరికీ హామీ ఉండవద్దు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంతో సరదాగా గడుపుతారు. కొత్త వస్తువులు కొంటారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికార్ల కోసం కొద్దిగా ఎదురు చూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది.

మిధునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
మీరనుకున్న ఉద్యోగం రావడానికి మరి కొన్ని రోజులు పడుతుంది. దూర ప్రాంతం నుంచి మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పరవాలేదు. చేస్తున్న ఉద్యోగంలో మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ఎవరికీ హామీ సంతకాలు పెట్టవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. స్నేహితురాలు మీ ప్రేమకు ఒకపట్టాన స్పందించదు. కోర్టు కేసు పరిష్కారమవుతుంది కానీ, మీరు ఆశించినంత ఆశాజనకంగా ఉండదు. విద్యార్థులు చదువు విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త.

కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
మంచి ప్రమోషన్‌ వచ్చే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఇల్లు కొనే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతనతో ఆలయాలు సందర్శిస్తారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూల సమయం. టెక్నాలజీ నిపుణులకు, పరిశోధకులకు విదేశా నుంచి మంచి సమాచారం అందుతుంది. స్నేహితురాలితో విందు వినోదాల్లో పాల్గొంటారు. కోర్టు కేసులో శుభవార్త వింటారు.

సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
మీరు ఆశించిన ఉద్యోగం రాకపోవచ్చు కానీ, వేరే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. సంతానంలో ఒకరికి కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. రియల్‌ ఎస్టేట్‌ వారికి సమయం అనుకూలంగా ఉంది. భార్యాపిల్లలు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. స్నేహితురాలి మాట తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి.

కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
మీరు ఆశించిన ఉద్యోగం రావచ్చు కానీ, మీరు కోరుకున్న విధంగా ఉండకపోవచ్చు. బంధువర్గంలో ఒకరితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు జాగ్రత్త. సంతానం నుంచి శుభవార్త వింటారు. స్త్రీతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కామర్స్‌, టెక్నాలజీ, మేథ్స్‌ విద్యార్థులకు అనుకూంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో నిరుత్సాహానికి గురయ్యే సూచనలున్నాయి. కళా సాహిత్య రంగాలకు చెందినవారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు.

తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో బదిలీకి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారు మరి కొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. అయితే, వృథా వ్యయం ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేస్తారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. విద్యార్థులకు చాలావరకు పరవాలేదు. స్నేహితురాలితో సరదాగా గడుపుతారు.

వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
ఉద్యోగంలో చిన్నపాటి మార్పుకు అవకాశం ఉంది. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. సంపాదనకు అన్ని విధాలా అనుకూలమయిన సమయం. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. గణితం, కంప్యూటర్‌ విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. స్నేహితురాలితో విందు, వినోదాల్లో గడుపుతారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది.

ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో ప్రమోషన్‌ లభించడమే కాకుండా ఆదాయం పెరుగుతుంది. సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏలిన నాటి శని ప్రభావం కారణంగా మధ్య మధ్య పని ఒత్తిడి, శ్రమ, తిప్పుట తప్పవు. సంతానం నుంచి శుభవార్త వింటారు. దూర ప్రాంతంలో స్థిరపడ్డ బంధువుతో వివాహ సంబంధం కుదురుతుంది. పిల్లల విషయంలో విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సైన్స్‌, ఇంజినీరింగ్‌, ఐ.టి విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఉద్యోగంలో మార్పు కోసం చూస్తున్నవారు మరి కొద్ది కాలం ఆగాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఏలిన నాటి శని కారణంగా మధ్య మధ్య చికాకులు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు... ఉపాధ్యాయుల లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. స్నేహితురాలి నుంచి సానుకూల స్పందన వ్యక్తం కాకపోవచ్చు.

కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇల్లు మారతారు. స్థాన చలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పు తీరుస్తారు. తలచిన పనులు పూర్తవుతాయి. స్నేహితుల్లో ఒకరు నమ్మక ద్రోహానికి పాల్పడవచ్చు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐ.టి, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. స్నేహితురాలి మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి.

మీనం (Pices) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
ఆశించిన విధంగా మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. స్థాన చలనం ఉంది. స్థలంగానీ, ఇల్లు గానీ కొనే అవకాశం ఉంది. రుణ బాధలు తొగుతుతాయి. ఆదాయం పెరుగుతుంది. స్త్రీతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. కామర్స్‌ విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలి నుంచి సహకారం లభిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారమవుతుంది.
Published by: Krishna Kumar N
First published: November 29, 2020, 8:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading