Groom started crying during vidai and bride funny reaction: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లిని కొంత మంది యువత.. గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొవాటానికి ప్రయారిటీ ఇస్తుంటే... మరికొందరు సింపుల్ గా చేసుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నేటి యువత ప్రధానంగా పెళ్లి కోసం ఎంత డబ్బు ఖర్చు చేయడాకికైన వెనుకాడటం లేదు. కొందరు తమ పెళ్లిని (Wedding) కలకాలం గుర్తుండి పోయేలా జరుపుకోవాలని కోరుకుంటున్నారు. దీని కోసం ఈవెంట్ ఆర్గనైజర్స్ లను సైతం సంప్రదిస్తున్నారు.
ప్రీవెడ్డింగ్ షూట్, మెహందీ, హల్దీ ఇలా ప్రతి ఒక వేడుక తమ స్నేహితులు, బంధువుల మధ్య గ్రాండ్ గా జరుపుకోవడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఇక పెళ్లిలో కొన్ని వెరైటీ సంఘటనలు, ఫన్నీ చేష్టల వలన ఆ పెళ్లిళ్లు (Wedding) వైరల్ గా మారాయి. కొందరు కావాలనే చేస్తారో.. లేదా.. పబ్లిసిటీ కోసం చేస్తారో.. ఏదో ఒక ఫన్నీ సంఘటనతో పెళ్లిలో ఎదో ఒక ఫన్నీ సంఘటన జరిగేలా చూస్తారు. దీంతో ఆ పెళ్లి కాస్త వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో వైరల్ (Viral video)గా మారింది.
View this post on Instagram
పూర్తి వివరాలు.. సాధారణంగా పెళ్లి వేడుకలో ప్రతి ఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొంటారు. తమ పెళ్లిలో స్నేహితులను, బంధువులను చూసి తెగసంబరపడిపోతుంటారు. అన్ని కార్యక్రమాలు ఎంతో వేడుకగా చేస్తారు. అయితే, ప్రధానంగా వధువు, వారి అమ్మనాన్నలు... అప్పగింతల కార్యక్రమం వద్ద మాత్రం, చాలా ఎమోషనల్ అవుతారు. తమ వాళ్లను వదిలిపెట్టి వేళ్లలేక కన్నీరు పెట్టుకుంటారు. ఇన్నాళ్లు ఎంతో ఆప్యాయంగా, ప్రేమను రాగాలతో ఉన్న.. తాము తమ వాళ్లను విడిచి పెట్టి వెళ్తున్నందుకు చాలా బాధపడతారు.
ఇది ప్రతి ఒక వధువు జీవితంలో జరిగేదే. కానీ ఇక్కడ దానికి రివర్స్ లో జరిగింది. ఒక వరుడు వీడ్కొలు సమయంలో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. తన భార్య ను చూసుకుంటూ, ఒక్కసారిగా వరుడు ఏడ్వటం స్టార్ట్ చేస్తాడు. దీంతో అక్కడున్న వారు.. వరుడి వంక వింతగా చూస్తారు. వధువు కూడా.. తన భర్తను చూసి సరదాగా నవ్వుకుంటుంది. అక్కడున్న వారు కూడా కాసేపు నవ్వుకున్నారు. ఇంతలోనే మెల్లగా వరుడు.. నవ్వడం ప్రారంభించాడు. కేవలం వధువుని సరదాగా ఆటపట్టించడానికి ఇలా చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: After marriage, Viral Video, Wedding