ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. జనాలు కూడా ఇలాంటి వీడియోలను ఇష్టపడటమే ఇందుకు కారణం. సోషల్ మీడియా ప్రభావమో మరో కారణమో కానీ.. ఈ మధ్య కాలంలో వింత పనులకు పెళ్లి మండపాలు వేదికవుతున్నాయి. తాళి కట్టే సమయంలో వధూవరులు చేసే పనులు వైరల్ అవుతున్నాయి. సరదా కోసం చేస్తున్నారో లేక పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ, పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు చేసే పనులు అందరిని విస్మయానికి గురి చేస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ పెళ్లి మండపంలో వధూవరులు చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. సాధారణ జీవితంలో భార్యాభర్తల మధ్య కీచులాటలు మామూలే.. కొన్ని సందర్భాల్లో ఇవి మాంచి కామెడీకి కారణమవుతుంటాయి. అసలు పెళ్లైన ఎన్నాళ్లకు సంసారంలో కీచులాటలు మొదలవుతాయనేది భార్యాభర్తల కెమిస్ట్రీని బట్టి ఉంటుంది.
ఈ అలకలు, గిల్లికజ్జాలు సాధారణంగా నాలుగు గోడలకే పరిమితమవుతాయి. ఎప్పుడో తప్ప బయటివారి దాకా రావు. కానీ ఓ జంట మాత్రం పెళ్లి వేడుక పూర్తవకమునుపే సంసారపు సరిగమలను ఆలపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఆ వివాహ వేడుకలో ఓ ఫోటో షూట్ జరిగింది. ఆ సమయంలో పెళ్లికొడుకేమో కూర్చీపై కూర్చోగా దాని పక్కనే నేలపై పెళ్లి కూతురు కూర్చుంది. ఈ క్రమంలో ఆమె తన పక్కనే ఉన్న అరటి పండ్లను తినేందుకు సిద్ధమైంది. అయితే..పెళ్లికొడుకు మాత్రం ఆమె తినబోతున్న ఓ అరటి పండును చట్టుక్కున చేతిలోంచి లాక్కుని దర్జాగా తినేశాడు.పెళ్లి కూరుతు మొదట ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
మరో అరటి పండు తీసుకుని తినబోతుండగా దాన్నీ చేతులోంచి లాగేసుకున్నాడు. దీంతో..ఆమె భర్తవైపు తిరిగి కాస్తంత చిరాకు ప్రదర్శించింది. కానీ..పెళ్లికోడుకు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన మానాన తాను అరటిపండ్లు తినేస్తూ దర్జాగా ఫోజులిచ్చాడు. వీరిద్దరి గిల్లికజ్జాలు ఇప్పుడు తెగ వైరలవుతున్నాయ్. ఇది కేరళలో జరిగిన పెళ్లి వేడుక. ఈ వీడియోను కేరళ వెడ్డింగ్స్ అనే ఇన్ స్టా అకౌంట్ వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఏంటీ.. పెళ్లి వేదికపైనే మొదలెట్టేశారా..? అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Marriage, Trending videos, Viral Video, Viral Videos, Wedding