Home /News /trending /

WEDDING GUESTS WERE ASKED TO CLEAN DISHES AS COUPLE HAD TO DO BUDGETING AFTER SPENDING TOO MUCH GH SK

Viral News: పెళ్లికొచ్చిన అతిథులతో గిన్నెలు తోమించిన జంట.. ఏం చేస్తాం.. తప్పలేదు మరి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెల్ఫ్ క్యాటరింగ్‌లో భాగంగా వంట పాత్రలను అద్దెకు తీసుకున్నవారే శుభ్రం చేసి తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. లేదంటే నూతన వధూవరులు తమ సెక్యూరిటీ డిపాజిట్ పొందలేరని స్పష్టం చేసింది

పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్కరూ ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలని, ఉన్నంతలో చాలా ఘనంగా చేయాలని భావిస్తారు. అయితే కొన్నిసార్లు తమ స్తోమతకు మించి వేదిక, ఆహారం, డ్రింక్స్ పై ఖర్చు చేస్తారు. పరిమితి మించిన ఖర్చు ఎక్కువైనప్పుడు పరిస్థితి సమస్యాత్మకంగా ఉంటుంది. ఇలా ఇబ్బందులు పడకుండా.. బడ్జెట్‌ను అదుపు చేసుకునేందుకు అతిథులతో పనులు చేయించారు నవ దంపతులు. పాత్రలు కడగడం, శుభ్రం చేయడం, సెల్ఫ్ సర్వింగ్ లాంటి పనులను.. పెళ్లికి వచ్చిన అతిథులతో చేయించారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు.. ఆ పెళ్లిలో తాను పడిన బాధల గురించి రెడ్డిట్ ప్లాట్‌ఫాంలో పోస్ట్ చేసింది ఒక మహిళ. దీంతో ఈ కథనం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

వివారాల్లోకి వెళ్తే.. ఓ అమెరికన్ మహిళ తన భర్తతో కలిసి బంధువు మ్యారేజ్ పార్టీకి హాజరైంది. వెడ్డింగ్ పార్టీ ఎంతో ఘనంగా ఉందని, ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉందని భావించింది. ఆహారం నుంచి అలంకరణ వరకు అన్నీ సూపర్ అని ప్రారంభంలో అనుకుంది. అయితే తర్వాతే ఈ పెళ్లి ఆమెకు ఓ పీడకలలా మారింది. భోజనానికి అందరూ కూర్చున్నారు. అదే సమయంలో తన భర్త వాష్ రూంకు వెళ్లాడు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆహారం అయిపోయింది. స్పష్టంగా చెప్పాలంటే అతిథుల్లో మూడో వంతు మందికే భోజన సదుపాయం కల్పించారు. ఎందుకంటే పెళ్లి ఖర్చు ఎక్కువయ్యే సరికి వధువరులు తమ ఖర్చును తగ్గించుకోవాల్సి వచ్చింది.

దీనికి తోడు క్యాటరింగ్ ఖర్చు తగ్గించడానికి సెల్ఫ్ సర్వ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారని సదరు మహిళ రెడ్డిట్‌లో వాపోయింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. విందు పూర్తయిన తర్వాత రిసెప్షన్ కార్యక్రమంలో కూర్చున్నామని.. కానీ వధూ వరులు వంటగదికి తీసుకుని వెళ్లారని చెప్పింది. అనంతరం అక్కడున్న వంట పాత్రలను శుభ్రం చేయాలని కోరినట్లు తెలిపింది. సెల్ఫ్ క్యాటరింగ్‌లో భాగంగా వంట పాత్రలను అద్దెకు తీసుకున్నవారే శుభ్రం చేసి తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. లేదంటే నూతన వధూవరులు తమ సెక్యూరిటీ డిపాజిట్ పొందలేరని స్పష్టం చేసింది.

ఫలితంగా తనతో పాటు 9 మంది అతిథులు వంట పాత్రలను శుభ్రం చేయాల్సి వచ్చిందని పేర్కొంది. దీని వల్ల రిసెప్షన్‌లో తాను డ్యాన్స్ చేయలేకపోయానని, కేక్ తినలేదని వాపోయింది. మన దేశంలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వివాహ మహోత్సవం ప్రారంభమైన దగ్గర నుంచి ముగిసే వరకు బంధువులు, స్నేహితులు కూడా ప్రతి కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. అన్ని పనులు దగ్గరుండి చేస్తారు, చూసుకుంటారు. మనం అతిథులుగా వచ్చాం.. మనమెందుకు చేయాలి అనే భావన మనస్సులోకి కూడా రానీయరు. కానీ అమెరికా లాంటి దేశాల్లో మాత్రం.. ఇలాంటి పనులను అవమానంగా భావిస్తారని ఈ స్టోరీ చూస్తే అర్థమవుతుంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: America, International news, Us news, VIRAL NEWS, Wedding

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు