Home /News /trending /

WEDDING FIGHT VIDEO BRIDE GROOM FUNNY BRIDE AND GROOM INTENSE FIGHT VIDEO GONE VIRAL PVN

Viral Video : పెళ్లి పీటలపైనే పడి పడి కొట్టుకున్న వధూవరులు!

పీటలపై కొట్టుకున్న వధూవరులు

పీటలపై కొట్టుకున్న వధూవరులు

Wedding Fight Video: సోషల్ మీడియా(Social Media)లో ప్రతిరోజూ వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో ఎక్కువ మంది ఇష్టపడే వీడియోలు వివాహ సమయంలో సరదాగా ఉండే వీడియోలు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Wedding Fight Video: సోషల్ మీడియా(Social Media)లో ప్రతిరోజూ వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో ఎక్కువ మంది ఇష్టపడే వీడియోలు వివాహ సమయంలో సరదాగా ఉండే వీడియోలు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వివాహ ఆచారాలకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్(Viral) అవుతుంది. వివాహంలో వివిధ ఆచారాలు నిర్వహిస్తారు. చాలా సార్లు వీటిలో కొన్ని భిన్నమైన ఆచారాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు వధువు, వరుడు వారిని కారు వెనుక పరుగెత్తేలా చేస్తారు. కొన్నిసార్లు వరుడు తన వధువును తన ఒడిలోకి తీసుకుంటాడు. ప్రస్తుతం చర్చనీయాంశమైన వీడియోలో వధూవరులు చిన్నపిల్లల్లా పోట్లాడుకోవడం కనిపిస్తోంది. ఈ వీడియోలో వీరిద్దరూ కళ్యాణ మండపంలో కాకుండా రణరంగంలో కూర్చున్నట్లు కనిపిస్తోంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లో తేగుష్టి అనే ఖాతాతో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న వీడియోలో... వధూవరులు పెళ్లి మండపంలో కూర్చొని ఏడు జన్మలు కలిసి ఉండాలని ప్రమాణం చేస్తున్నారు. ఇంతలో, వధూవరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి వస్తుంది. వీడియోలో.. వరుడు వధువును ఆమెకు నచ్చని విషయంపై ఆటపట్టిస్తున్నట్లు కనిపించింది. వెంటనే ఇద్దరి మధ్య గొడవ మొదలయింది. చిన్న పిల్లల మాదిరిగా పెళ్లి వేడుకలో కొట్టుకుంటున్న వధూవరులని ఈ వీడియోలో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వేలల్లో లైక్ లు, ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ పెళ్లి నేపాల్ లో జరిగినట్లుగా అర్థమవుతోంది.



70 ఏళ్ల వయస్సు లో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ..పెళ్లయిన 54 ఏళ్ల తర్వాత ఫలించిన కల!

మరోవైపు,కొన్నిసార్లు రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు అనుకొని ఘటనలు జరుగుతుంటాయి. మనం అనుకోకుండా ప్రమాదాల్లో ఇరుక్కుంటాం. వెహికిల్స్ లు అదుపు తప్పి ప్రమాదాలకు గురౌతుంటాయి. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతునే ఉంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.ఇది కాస్త వైరల్ గా మారింది. ఒక వ్యక్తి తన ఇంటి నుంచి బైక్ ను బయటకు తీస్తున్నాడు.

రోడ్డు పక్కన రెండు కార్లు పార్కింగ్ చేసి ఉన్నాయి. అదే విధంగా.. అక్కడ కాస్తంతా మట్టికూడా ఉంది. అతగాడు వెనక్కు చూసుకోలేదు. అంతలో బైక్ కాస్త.. అక్కడ ఉన్న పెద్ద గుంతలో పడింది. ఈ క్రమంలో.. అతను వెనుకవైపు చూసుకొలేదు. అప్పుడు ఒక్కసారిగా బైక్ గుంతలోపడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా (viral video) మారింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Viral Video, Wedding

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు