Wedding Dress With Masks: వాడి పడేసిన మాస్కులతో వెడ్డింగ్ డ్రస్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

వాడి పడేసిన మాస్కులతో వెడ్డింగ్ డ్రస్ (Image credit : twitter)

రోనా తరువాత వాడి పడేసే మాస్కుల వల్ల పర్యావరణంపై ప్రభావం పడుతుంది. దీన్ని అందరికీ కళ్లకు కట్టేలా చూపేందుకు వాడిపడేసిన తెలుపు రంగు మాస్కులతో ఈ వినూత్న వెడ్డింగ్ డ్రస్‌ను తయారుచేశారు ఆ డిజైనర్. 

  • Share this:
గతేడాది నుంచి కరోనా కారణంగా ఎన్నో పెళ్లిళ్లు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే కొన్ని వివాహాలు తక్కువ మంది అతిథులతో జరుగుతున్నాయి. ఇంగ్లండ్ లోనూ ఇటీవలే పెళ్లి వేడుకలపై ఆంక్షలు సడలించారు. దీన్ని పురస్కరించుకొని ఓ యూకే డిజైనర్ వినూత్నమైన వెడ్డింగ్ గౌన్ రూపొందించారు. మామూలుగా అయితే అది పెద్ద వార్తే కాదు.. కానీ ఈ వెడ్డింగ్ గౌన్ తయారుచేసేందుకు వాడి పడేసిన డిస్పోజబుల్ మాస్కులను ఉపయోగించడం విశేషం. కరోనా తరువాత వాడి పడేసే మాస్కుల వల్ల పర్యావరణంపై ప్రభావం పడుతుంది. దీన్ని అందరికీ కళ్లకు కట్టేలా చూపేందుకు వాడిపడేసిన తెలుపు రంగు మాస్కులతో ఈ వినూత్న వెడ్డింగ్ డ్రస్‌ను తయారుచేశారు ఆ డిజైనర్. ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల మాస్కులు, శానిటైజర్లు కామన్ గా మారిపోయాయి. కానీ వాడి పడేసే మాస్కుల వల్ల పర్యావరణానికి ఎంతో ముప్పు దాగి ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీన్ని అందరికీ వివరించేందుకు వాడి పడేసిన మాస్కులతో వెడ్డింగ్ డ్రస్‌ను రూపొందించినట్లు డిజైనర్ టామ్ సిల్వర్ వుడ్ వెల్లడించారు. దీన్ని తయారుచేయడానికి ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ సంస్థ హిచ్డ్ ఆర్థిక సహకారాన్ని అందించింది. దాదాపు 1500కి పైగా వాడి పడేసిన తెలుపు రంగు ఫేస్ మాస్కులతో ఈ డ్రస్‌ను తయారుచేశారు. జెమిమా హాంబ్రో అనే మోడల్ దీన్ని ధరించి.. లండన్‌లోని సెయింట్ పాల్స్ క్యాథెడ్రల్ ముందు ఫొటోలకు పోజులిచ్చింది. ప్లాస్టిక్ పీపీఈ వాడి పడేయడం వల్ల పర్యావరణానికి వచ్చే ముప్పు గురించి వివరించేందుకే దీన్ని తయారుచేసినట్లు డిజైనర్ వివరించారు.

(Image credit : twitter)


కేవలం యూకేలోనే వారానికి 100 మిలియన్లకు పైగా మాస్కులను ఉపయోగించి పడేస్తున్నారు. ఇంగ్లండ్‌లో ఫ్రీడమ్ డే సెలబ్రేషన్లో భాగంగా ఈ గౌన్‌ను లాంఛ్ చేశారు. ఇంగ్లండ్‌లో కరోనా ఆంక్షలను క్రమంగా తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా ‘ఫ్రీడం డే’ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హిచ్డ్ ఎడిటర్ సారా అల్లార్డ్ మాట్లాడుతూ.. ‘ఇంగ్లండ్ లో పెళ్లిళ్లు తిరిగి ప్రారంభమవుతాయని, వాటిపై ఎలాంటి చట్టపరమైన ఆంక్షలు లేవని తెలిసి మేం చాలా ఆనందంగా ఫీలవుతున్నాం. ఈ వేసవిలో ఇక చాలా పెళ్లిళ్లు జరుగుతాయి. మేం డ్యాన్స్ ఫ్లోర్స్, డ్రింకింగ్ రిసెప్షన్లు, నవ్వుతూ ఉండే ఫొటోలు అన్నీ చూసేందుకు సిద్ధంగా ఉన్నాం.

(Image credit : twitter)


అయితే కరోనా వల్ల వచ్చిన చెత్త సమస్యను మనం ఏమాత్రం మర్చిపోకూడదు. ప్రస్తుతం పెళ్లిళ్లలో మాస్కులు అవసరం లేదని చెప్పినందుకు ఎంతో ఆనందంగా ఉంది. డ్యాన్సులు చేయడం, కౌగిలించుకోవడం, అందరూ కలవడం వంటివి చేయాలని నేను అందరినీ కోరుతున్నాను’ అని వెల్లడించింది.
Published by:Veera Babu
First published: