నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ (Enforcement directorate) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విచారిస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. సోనియా గాంధీకి కూడా ఈడీ తమ ఎదుట హజరు కావాలని సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై దేశంలో తీవ్ర దుమారం చెలరేగుతుంది. మాజీ కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ముఖ్యనేతలు ఢిల్లీలో నిరసలను చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ నేతలపై దురుసుగా ప్రవర్తించారు
పూర్తి వివరాలు.. ఢిల్లీలోని (Delhi) జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి (Rahul gandhi) ఈడీ విచారణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చేలరేగింది. కాగా, కాంగ్రెస్ నేత అల్కాలాంబా ను పోలీసులు అదుపులోనికి తీసుకొవడానికి ప్రయత్నించారు. ఆమె ఎంత సేపటికి కింద నుంచి లేవడానికి ఒప్పుకోలేదు. దీంతో ఆమెను బలవంతంగా ఎత్తడానికి మహిళ పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆమె.. నన్ను ఒంటరిగా వదిలేయమని చెప్పండి.
Meanwhile in Delhi. pic.twitter.com/DxwJScpI3I
— Shiv Aroor (@ShivAroor) June 21, 2022
నా మీద నాకు ఏమి హక్కు ఉందని ప్రశ్నించారు..? నా దగ్గర AK-47 ఉందా? నా దగ్గర బాంబు ఉందా? నేను ఆయుధాలు లేనిదానిని ” అని అల్కా లాంబా సంఘటనా స్థలంలో గుమిగూడిన విలేకరులతో అన్నారు. తన మెడను పోలీసులు విరిచేయడానికి ప్రయత్నిస్తురని (police trying to break my neck) ఆమె అల్కా లాంబా ( Alka Lamba) ఆరోపించారు. అదే విధంగా.. ఆమె రోడ్డుపై కూర్చున్నారు. కదలమని అడిగినప్పుడు, కాంగ్రెస్ నాయకుడు నేలపై పడుకుని, “భారత్ మాతా కీ జై, జై జవాన్, జై కిసాన్” అని నినాదాలు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వీడియో (Social media) నెట్టింట వైరల్ గా (Viral video) మారింది.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేతలు కూడా పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు.
ఢిల్లీలో (Delhi) కాంగ్రెస్ నాయకులు మరోసారి పోలీసుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. రాహుల్ గాంధీని ఈడీ విచారణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో.. కాంగ్రెస్ మహిళా మోర్చా అధ్యక్షురాలు నెట్టా డిసౌజా పాల్గొన్నారు. అయితే, ఈడీ కార్యలయం దగ్గర వీరిని అదుపు చేసు క్రమంలో.. మహిళ పోలీసులు వీరిని అదుపులోనికి తీసుకుని ప్రత్యేక వాహానంలో ఎక్కించారు. అప్పుడు తోపులాట జరిగింది.
ఈ క్రమంలో.. నెట్టా డిసౌజా.. పోలీసులను తిడుతూ.. మహిళ పోలీసులపై గాండ్రించి ఉమ్మారు. (Netta D Souza spits on police) వెంటనే మహిళా పోలీసులు షాక్ కు గురయ్యారు. అక్కడి నుంచి కాస్త వెనుక వైపు జరిగారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా (Viral) మారింది. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. కాసేపటికి దీనిపై నెట్టా డిసౌజా స్పందించారు. తన నోటిలో మట్టి పడిందని , అనుకోకుండా దాన్ని బయటకు ఉమ్మానని.. కానీ పోలీసులపై ఉమ్మాలని కాదని వివరణ ఇచ్చారు. తనకు పోలీసులంటే అపారమైన గౌరవ, మర్యాదలు ఉన్నాయని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Delhi, Rahul Gandhi, Viral Video