Dr S Jaishankar hit back on USA’s criticism of India: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ +2 అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల నాయకుల మధ్య 2+2 సమావేశం జరిగింది. అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి బ్లింకెన్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బ్లింకెన్ మాట్లాడుతూ.. భారత్ ఇటీవల మానవ హక్కుల ఉల్లంఘనపై సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు.
కొన్ని ప్రభుత్వాలు పోలీసు అధికారులను అడ్డంపెట్టుకుని మావ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆందోళన కరమైన పరిణామాలను తాము... భారత్ లో గమస్తున్నామని బ్లింకెన్ అన్నారు. అదే విధంగా.. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలని అమెరికా భారత్ ను కోరింది. దీనికి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తాము కూడా అమెరికాలో కొన్ని మానవ ఉల్లంఘనలను గమనిస్తున్నామని అన్నారు.
“Our purchases (of Russian oil) for the month would be less than what Europe does in an afternoon.”
In case you missed @DrSJaishankar burying an American journalist in that gentle way only he can. pic.twitter.com/UpCKXdNgKa
— Shiv Aroor (@ShivAroor) April 12, 2022
తాజాగా, అమెరికా కాన్సులెట్ వద్ద ఇద్దరు దుండగులు సిక్కులపై దాడి చేశారు. వారి తలపాగ తీసి పారేశారు. తాము.. కూడా మానవ హక్కుల ఉల్లంఘనను గమనిస్తున్నామని అన్నారు. అదే విధంగా విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా.. తమ మధ్య మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రత్యేకంగా చర్చ జరగలేదని అన్నారు. ఒక వేళ ప్రత్యేకంగా ప్రస్తావన జరిగితే తాము కూడా ..చర్చించడానికి వెనుకాడబోయని జైశంకర్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం తమ సమావేశంలో పాకిస్ఠాన్ లో అధికారం మార్పు, రష్య ,ఉక్రెయిన్ యుద్దం, శ్రీలంక సంకోభం, ఆహర భద్రతకు తీసుకొవాల్సిన చర్యల గురించి చర్చ జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరికి తమ దేశంపై అభిప్రాయాలు ఉండవచ్చని జైశంకర్ అన్నారు. అదే విధంగా.. తమకు ప్రపంచ దేశాలలో జరుగుతున్నన మానవ హక్కుల ఉల్లంఘనలపై ఒక క్లారిటి ఉందని... సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతామని విదేశాంగ శాఖ మంత్రి గట్టిగా బదులిచ్చారు.
రష్యా నుంచి భారత్ , చమురు దిగుమతి ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి అమెరికా తన ఆక్రోషం ను వెల్లగక్కుతుంది. ఇప్పటికే పలు మార్లు భారత్ కు చమురు ఒప్పందాలు మానుకోవాలని సూచించింది. దీనికి భారత్ కూడా అమెరికాకు గట్టిగానే బదులిచ్చింది. ప్రస్తుతం విదేశాంగ శాఖ మంత్రి అమెరికాలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తాము రష్యాన్ లో కొనుగోలు చేసిన చమురు ధరలు.. యూరప్ దేశాలలో కొనుగోలు చేసిన ధరల కంటె తక్కువగా ఉన్నాయని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Rajnath Singh, USA