ఏ పండు సైజు ఎంత?... తెలివైన పద్ధతి కనిపెట్టిన వ్యాపారి... వైరల్ వీడియో...

అతని తెలివితేటల్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అత్యంత సరైన పద్ధతిలో పండ్ల సైజును అతను డిసైడ్ చేయగలుగుతున్నాడు.

news18-telugu
Updated: June 28, 2020, 1:25 PM IST
ఏ పండు సైజు ఎంత?... తెలివైన పద్ధతి కనిపెట్టిన వ్యాపారి... వైరల్ వీడియో...
ఏ పండు సైజు ఎంత?... తెలివైన పద్ధతి కనిపెట్టిన వ్యాపారి... (credit - twitter)
  • Share this:
మనం పండ్ల షాపుకి వెళ్లినప్పడు అక్కడ ఒకే రకం పండ్లు... రెండు మూడు గ్రూపులుగా ఉంటాయి. ఇవెంత... అవెంత... అని అడిగితే... వీటికి ఓ ధర, వాటికి మరో ధర చెబుతారు. చాలా సందర్భాల్లో ఆ పండ్ల సైజు దాదాపు ఒకేలా ఉంటుంది. దాంతో ప్రజలు... తమకు ఏ పండ్లు తక్కువ రేటు అనిపిస్తే... అవి కొనుక్కుంటారు. ఆ గ్రూపు నుంచి పెద్ద పండ్లను సెలెక్ట్ చేసుకుంటారు. ఐతే... పండ్లను కరెక్టుగా విభజించడం ఎలా? ఏమాత్రం సైజులో తేడా రాకుండా... చేయడం ఎలా అనే ప్రశ్నకు... ఆ ప్యాపారి దగ్గర సరైన సమాధానం ఉంది. ఓ సింపుల్ టెక్నిక్ ఉపయోగిస్తూ... పండ్లను సైజువారీగా విభజిస్తున్నాడు.

ఈ టెక్నిక్ చూసిన బిజినెస్ పర్సన్ వాలా అప్షర్... వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనికి ప్రపంచంలో అత్యంత తేలికైన పండ్ల విభజన విధానం అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోలో... వ్యాపారి... దానిమ్మ పండ్లను విభజిస్తున్నాడు. ఇందుకోసం అతను రెండు ఇనుప రాడ్లను V ఆకారంలో సెట్ చేశాడు. వాటి పైనుంచి పండలను జార విడుస్తున్నాడు. రాడ్ల కింద మూడు బాక్సులు పెట్టాడు. పండు సైజును బట్టీ... ఆయా బాక్సుల్లోకి జారి పడుతున్నాయి.



ఈ వీడియో నెటిజన్లకు బాగా నచ్చింది. అతని తెలివి తేటలు చూసి... వాటేన్ ఐడియా అంటున్నారు. జూన్ 26న అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే... 29 లక్షల మంది చూశారు. 89వేల లైక్స్ వచ్చాయి. అలాగే... 31వేల మంది రీట్వీట్ చేశారు. 566 మంది కామెంట్లు రాశారు. "అతన్ని ఆపండి... ఇలాంటి వాళ్లు ఉంటే... ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం కావాలి" అని ఓ నెటిజన్ మెచ్చుకున్నారు. ఇలాంటి సొల్యూషన్స్ ఇండియా నుంచే ఎక్కువగా వస్తాయి అని మరొకరు రాశారు. ఇది పురాతన కాలం నుంచి పాటిస్తున్న విధానమే అని మరో నెటిజన్ అన్నారు.
First published: June 28, 2020, 1:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading