భారత్ మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లే.. ట్రంప్ నైరాశ్యం..

Namasthe Trump : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడుతూ అమెరికాకు ఇండియా సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: February 19, 2020, 12:05 PM IST
భారత్ మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లే.. ట్రంప్ నైరాశ్యం..
డోనాల్డ్ ట్రంప్ (File)
  • Share this:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడుతూ అమెరికాకు ఇండియా సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి మేము రెడీగా ఉన్నాం. నవంబరులో జరిగే ఎన్నికల్లోగా అది జరుగుతుందో లేదో. మరో విస్తృతమైన ఒప్పందం కోసం దీన్ని ప్రస్తుతానికి పక్కనబెడుతున్నాం. అయితే, భారత్ మాత్రం ఈ విషయంలో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు చేస్తూనే ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీతో స్నేహాన్ని ప్రస్తావిస్తూ.. మోతేరా స్టేడియంలో తనకు స్వాగతం పలికేందుకు 70 లక్షల మంది సిద్ధంగా ఉన్నారని మోదీ చెప్పినట్లు మరోసారి స్పష్టం చేశారు.

ట్రంప్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం లేదు. కాగా, ఈ నెల 24న ట్రంప్‌తో పాటు వచ్చే బృందంలో అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి రాబర్ట్ లైథిజర్ ఉండబోరని ఆ దేశ అధికారి ఒకరు వెల్లడించారు.


First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు