కులభూషణ్ జాదవ్‌ను కలిసేందుకు పాక్ అనుమతి.. స్పందించిన భారత్..

kulbhushan jadav: 10 రోజుల క్రితం అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో పాక్ ప్రభుత్వం దిగొచ్చింది. కులభూషణ్ జాదవ్‌(49)ను కలిసేందుకు ఆ దేశం అనుమతి ఇచ్చింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 1, 2019, 4:54 PM IST
కులభూషణ్ జాదవ్‌ను కలిసేందుకు పాక్ అనుమతి.. స్పందించిన భారత్..
kulbhushan jadav (Twitter Photo)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 1, 2019, 4:54 PM IST
పాకిస్తాన్‌కు పట్టుబడ్డ నేవీ విశ్రాంత అధికారి కులభూషణ్ జాదవ్‌(49)ను కలిసేందుకు ఆ దేశం అనుమతి ఇచ్చింది. 10 రోజుల క్రితం అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో పాక్ ప్రభుత్వం దిగొచ్చింది. దీనిపై భారత ప్రభుత్వం స్పందించింది. కులభూషణ్‌ను కలిసేందుకు గురువారం పాక్ అనుమతి ఇచ్చిందని తెలిపింది. విదేశాంగ శాఖ మీడియా ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ.. కులభూషణ్‌ను కలిసే అవకాశంపై ప్రభుత్వానికి ప్రతిపాదన వచ్చిందని, దీనిపై తాము విశ్లేషిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో పాకిస్తాన్‌తో దౌత్య సంబంధం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, కుల్‌భూషణ్‌ జాదవ్‌(49) తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారంటూ పాకిస్తాన్‌ సైనికులు 2016లో ఆయనను అదుపులోకి తీసుకోగా, మిలటరీ కోర్టు 2017 ఏప్రిల్‌లో ఆయనకు మరణశిక్ష విధించింది. జాదవ్‌ గూఢచౌర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ పేర్కొన్న విషయం తెలిసిందే.

అయితే ఈ వాదనలను భారత్‌ ఖండించింది. భూషణ్‌ అసలు పాకిస్తాన్‌ వెళ్లనే లేదని, ఉద్యోగ విరమణ తర్వాత ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటుండగా అపహరణకు గురయ్యారని పేర్కొంది. దీనిపై భారత్ ఐసీజేను ఆశ్రయించింది. కొద్ది రోజుల క్రితం జరిగిన విచారణలో అంతర్జాతీయ న్యాయస్థానం పాక్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వియాన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తెలిపింది. అతడికి న్యాయ సహాయం అందేలా చూడాలని ఆ దేశాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కులభూషణ్‌ను కలిసేందుకు పాక్ అనుమతి ఇవ్వడం గమనార్హం.

First published: August 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...