Video : ఎయిర్‌పోర్ట్ లోపల ఉన్నట్టుండి కుండపోత వాన... షాకైన ప్రయాణికులు

ఎక్కడైనా ఎయిర్‌పోర్టులోకి వాన నీరు రావడం సహజం. కానీ ఎయిర్‌పోర్టు భవనం లోపల వాన పడటం అన్నది జరగదు. అది కూడా కుండపోతగా పడటం ఆశ్చర్యకరమే. అలా ఎందుకు జరిగింది?

Krishna Kumar N | news18-telugu
Updated: August 12, 2019, 12:40 PM IST
Video : ఎయిర్‌పోర్ట్ లోపల ఉన్నట్టుండి కుండపోత వాన... షాకైన ప్రయాణికులు
ఎయిర్‌పోర్టులో వాన (Image : Twitter - dhiran)
Krishna Kumar N | news18-telugu
Updated: August 12, 2019, 12:40 PM IST
లండన్‌లోని ల్యూటన్ ఎయిర్‌పోర్ట్ అధికారులు... ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. కారణం... ఎయిర్‌పోర్ట్ భవనం లోపల ఉన్నట్టుండి కుండపోత వర్షం పడటమే. ఈ వర్షం వల్ల చాలా మంది ప్రయాణికులు తడిసిపోయారు. అసలే విమానాల రాక ఆలస్యమవుతోందని... చిరాకు పడుతున్న ప్రయాణికులకు... వర్షం పడటం మరో షాకింగ్ అంశం అయ్యింది. సీలింగ్ నుంచీ భారీ వర్షం పడటాన్ని కొందరు ప్రయాణికులు వీడియో తీశారు. వాటిలో ఓ వీడియో... సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. నిజానికి ల్యూటన్ ఎయిర్‌పోర్ట్ చాలా బిజీగా ఉంటుంది. ప్రయాణికుల కోసం అక్కడ అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. ఐతే... కొన్ని రోజులుగా బ్రిటన్‌లో సడెన్ వానలు వస్తున్నాయి. వాటికి తోడు బలమైన ఈదురుగాలులు వాతావరణాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో ఎయిర్‌పోర్ట్ ఫ్లోర్‌కి లీకేజ్ అవ్వడంతో... వాన నీరు భారీగా లోపల పడింది. దాదాపు 15 నిమిషాలపాటూ వాన పడటంతో... చాలా మంది తడిడిముద్దయ్యారు.


ఎయిర్‌పోర్ట్ లోపల వాన పడటమేంటని చాలా మంది ఈ వీడియోపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజమేమరి... ఇలాంటి దృశ్యం ఎక్కడా కనిపించదు. ఇక్కడ కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తే... వింతేముంది.

First published: August 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...