దేశంలో కొన్ని విచిత్రమైన దృశ్యాలను, వింతలను చూస్తే ఇదెలా సాధ్యమవుతుంది అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో కలుగుతాయి. చత్తీస్గడ్( Chhattisgarh)రాష్ట్రంలో కూడా అలాంటి వింత దృశ్యమే ఇప్పుడు విస్తృతంగా వైరల్ (Viral) అవుతోంది. భారతదేశంలో ఇప్పటికి ఎన్నో ప్రాంతాల్లో తాగేందుకు నీటి కోసం అక్కడి స్థానికులు పడే కష్టాలు పడటం మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం. కాని ఛత్తీస్‌గడ్‌లో పాతాళగంగ ఏమైనా అక్కడ ఉందా అనే విధంగా ఒక బోర్(Hand pump) నుంచి ఎవరూ కొట్టకుండా ధారాపాతంగా మంచినీరు వస్తోంది. అది చేతి పంపే కాని ..ఎవరూ కొట్టకుండానే మంచినీళ్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ పంపుకు సంబంధించిన వీడియో(Video)నే సోషల్ మీడియా(Social media)లో తెగ చక్కర్లు కొడుతోంది.
కొట్టకుండనే బోరు నుంచి వస్తున్న నీరు..
చత్తీస్గడ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా సుక్మా బ్లాక్‌లోని మరోకి గ్రామంలో ఓ విచిత్రమైన తాగునీటి పంపు ఉంది. సుమారు 19ఏళ్ల క్రితం ఈప్రాంతంలో బోర్ వేయడానికి వచ్చిన వాళ్లు నీటి కోసం తవ్వకాలు మొదలుపెట్టారు. ఆ సమయంలో 10అడుగుల లోతులోనే నీరు పడటంతో బోర్ వేసి వెళ్లిపోయారు. గ్రామంలో సుమారు రెండు వందల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ పంపును నుంచి ఎవరూ కొట్టకుండానే నీరు రావడం విశేషంగా గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గ్రామంలో వేసిన ఈ పంపు స్థానంలో పాతాళగంగ ఉందా అన్నట్లుగా ఏడాది పొడవున నిత్యం మంచినీరు వస్తూనే ఉంటుంది.
పాతాళగంగ..
అప్పటి నుంచి ఇప్పటి వరకు సీజన్‌తో పని లేకుండా ..మండు వేసవిలో కూడా మరొకి గ్రామంలో కాపురం ఉంటున్న రెండు వందల కుటుంబాల ప్రజలు మంచి నీరు కోసం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదంటున్నారు. కనీసం బోర్ కొట్టాల్సిన అవసరం కూడా రాలేదని గొప్పగా చెబుతున్నారు. ఒకప్పుడు ఈ గ్రామంలో 9మంది చనిపోయారనే వార్త కలకలం రేపింది. ఆ తర్వాత పూర్తిగా మరుగున పడిపోయిన తర్వాత ఇప్పుడు ఈవిధంగా మళ్లీ వార్తల్లోకి రావడం కొత్తగా ఉందంటున్నారు గ్రామస్తులు.
వాటర్ వండర్..
నీరు పుష్కలంగా ఉండే ప్రాంతాల్లోనే వేసవి కాలం వచ్చిందంటే తాగునీరు కోసం తంటాలు పడుతూ ఉంటారు. చాలా చోట్ల వేరే ప్రాంతం నుంచి ట్యాంకులతో నీటిని తెప్పించుకుంటారు. కాని మరొకి గ్రామంలో మాత్రం గత 19ఏళ్లుగా అలాంటి అవసరం ఏ వేసవి సీజన్లో తమకు తలెత్తలేదంటున్నారు. అంతే కాదు దారాపాతంగా వస్తూ ఉండే ఈ నీటిని పవిత్రజలంగా స్థానికులు భావిస్తున్నారు. ఈవిషయం తెలియడంతో ఎవరూ కొట్టకుండా నీరు ఎలా వస్తోందని అధికారులు కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chatisghad, Trending news, Viral Video