Home /News /trending /

Viral Video: ఏందమ్మా నువ్వు.. పెద్ద కోపిస్టిలా ఉన్నావుగా.. ఉల్లిపాయ ముక్కల కోసం ఇంత పని చేస్తావా..

Viral Video: ఏందమ్మా నువ్వు.. పెద్ద కోపిస్టిలా ఉన్నావుగా.. ఉల్లిపాయ ముక్కల కోసం ఇంత పని చేస్తావా..

వ్యాపారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళ

వ్యాపారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళ

Viral Video: ఉల్లిపాయ ముక్కల కోసం ఇంత పెద్ద గొడవ జరుగుతుందని మీరు అస్సలు ఊహించి ఉండరు. చివరకు పెద్ద నష్టమే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

    పానీపూరి.. ఈ పదం మన భారతదేశంలో తెలియని వారు ఉండరేమో. పట్టణంలో నివసించే చాలా మంది దీని టేస్ట్ కూడా చేసే ఉంటారు. టేస్టు మంచిగా ఉంటే.. మన భారతీయులు అది ఎంత కాస్ట్ అయినా పాకులాడుతారు. ఎంత ఖర్చయినా దానిని కొనుగోలు చేసి తింటుంటారు. ఇలా పానీ పూరి టేస్ట్ కూడా చాలామందిని కట్టిపడేసింది. అలా బయటకు వెళ్తే చాలు.. రోడ్డు పక్కన ఇలా దర్శనమిస్తుంటాయి పానీపూరీ బండ్లు. అయితే పానీ పూరి తినే సమయంలో అతడు మొదట మనకు ఒక ప్లేట్ ఇచ్చి.. అందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తాడు. వాటిని మనం కొద్ది కొద్దిగా పానీపూరిలో వేసుకొని తింటాం.

    Viral: ఆవుపేడ తిన్న డాక్టర్.. ఇలా చేస్తే ఆ ఉపయోగాలు ఉంటాయట.. అదేంటో చూడండి..


    అయితే ఇక్కడ ఓ మహిళ పానీ పూరి అమ్మె వ్యక్తి దగ్గర నుంచి పానీ కచోరీ కొనుగోలు చేసి తింటోంది. దానికి సరిపడా ఉల్లిపాయ ముక్కలు వేయలేదు. ఆ విషయంలో ఆమెకు తీవ్ర కోపం వచ్చింది. దాంతో పానీ పూరీ అమ్మే వ్యక్తికి సంబంధించిన సైకిల్ ను కిందపడేస్తుంది. ఉల్లిపాయలు సరిపడా వేయలేదని.. మరో సారి ఉల్లి ముక్కలు కావాలని అడిగింది. ఆ వ్యాపారి... అయిపోయాయనీ... లేవని చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. అలా ఎలా అంటారని వాదనకు దిగింది. ఉల్లి ముక్కలు లేకపోతే.. కచోనీ ఇచ్చే ముందు చెప్పాలి కదా అంటూ చిర్రెత్తిపోయింది.



    తన దగ్గర లేవు.. తనను ఏం చేయమంటావ్ అంటూ అతడు కూడా విసుక్కుంటాడు. ఇలా రెండువైపుల వాదన పెద్దగా అయింది. ఇక సహనాన్ని భరించలేక ఆమె తన కాలితో వ్యాపారి బండిని తన్నింది. బండి మొత్తం కిందపడిపోయింది. అందులో ఆహారపదర్థాలు మొత్తం కింద పడిపోయాయి. ఉల్లిపాయల ముక్కలు కోసం ఇంత పని చేస్తావా అంటూ చుట్టుపక్కల వారు కూడా ఆమెపై మండిపడ్డారు.

    New Business : నిరుద్యోగులకు నయా వ్యాపార మార్గం.. నెలకు ఎంత సంపాదనో తెలిస్తే.. మీరు వదిలిపెట్టరు..


    TRS-CM KCR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పదవుల పంట.. ఎవరెవరికి ఇస్తారో..?


    నాకు తీవ్ర నష్టం జరిగింది.. పరిహారం కట్టండి అంటూ అతడు డిమాండ్ చేశాడు. అది వినకపోగా.. వ్యాపారి చెంపపై మెల్లగా కొట్టింది కూడా. ఈ వీడియోను షూట్ చేస్తున్న వ్యక్తిపై ఆమె సీరియస్ అయింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని ట్విట్టర్‌లోని Saffron_Smoke అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీన్ని ఇప్పటికే 414.8k మంది చూశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఇంత చిన్న విషయానికి అంత పని చేయాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime news, VIRAL NEWS, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు