హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: జూమ్ మీటింగ్‌లో లాయర్ లంచ్... తనకూ పంపమన్న సొలిసిటర్ జనరల్

Viral Video: జూమ్ మీటింగ్‌లో లాయర్ లంచ్... తనకూ పంపమన్న సొలిసిటర్ జనరల్

Viral Video: వర్చువల్ మీటింగ్స్, జూమ్ సెషన్స్... ఇవన్నీ కామన్ ఈ రోజుల్లో. అందుకే చాలా మంది వాటిలో పాల్గొంటూనే... స్వకార్యాలూ పూర్తి చేసుకుంటున్నారు.

  కరోనా మన దేశానికి వచ్చి సంవత్సరం దాటేసింది... తాడిచెట్టులా పాతుకుపోయిందే తప్ప పోవట్లేదు. అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి... వైరస్‌తో జీవిస్తూనే... వర్చువల్ టెక్నాలజీని మన జీవితాల్లోకి అన్వయించేసుకోవాలి. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. మీటింగ్స్, పనులు అన్నీ వీలైనంతవరకూ ఆన్‌లైన్‌లో చేసేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ రివల్యూషన్ వచ్చేసింది. వీడియో కాల్స్ కామనయ్యాయి. ఈ క్రమంలో ఓ జూమ్ వీడియో సెషన్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో నెటిజన్లను నవ్విస్తోంది. అందులో పాట్నా హైకోర్టుకు చెందిన ఓ లాయర్... ఓవైపు మీటింగ్‌లో పాల్గొంటూనే... మరోవైపు మధ్యాహ్న భోజనం కానిస్తున్నారు. అలా ఎందుకు జరిగిందో తెలుసుకుందాం.

  ఆ లాయర్ పేరు క్షత్రశాల్ రాజ్. జూమ్ మీటింగ్ అయిపోయింది అనుకున్న ఆయన... కెమెరాను ఆపేయడం మర్చిపోయారు. భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా... అటువైపు మీటింగ్‌లో ఉన్నారు. ఈ భోజనం చేస్తుండటాన్ని చూసిన మెహతా... రాజ్‌కి... నువ్వు ఇంకా మీటింగ్ లోనే ఉన్నావా... మరి భోజనం చేస్తున్నావు... అన్నారు. దాంతో ఉలిక్కిపడిన రాజ్... వెంటనే తన ప్లేటును పక్కన పెట్టేసి... తను చేసిన పనికి ఏముకుంటున్నారో అని ఆందోళన చెందారు.

  రాజ్‌ని కాస్త కూల్ చేద్దామనుకున్న తుషార్ మెహతా... "ఇటు పంపు" (“Yahan bhejo”) అన్నారు. అలా సరదా జోక్ చేశారు. అంతే... నవ్వులు విరబూశాయి. అందుకే ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

  ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది దీన్ని లైట్ తీసుకొని సరదాగా నవ్వుతుంటే... మరికొంత మంది... సెటైర్లు వేస్తున్నారు.

  ఇది కూడా చదవండి: Viral video: అర్థరాత్రి... చిమ్మ చీకటి... నల్ల చిరుతపులి వచ్చి ఏం చేసిందంటే...

  ఈ వీడియోపై ఫెర్గూసన్ ప్రత్యేక టిప్‌ను ట్వీట్ చేశారు. మీ పిల్లలు మీ కంప్యూటర్ వాడుతున్నట్లైతే... మీరు వర్చువల్ మీటింగ్‌లో పాల్గొనేముందు జూమ్ ఆప్షన్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి అని ట్వీట్ చేశారు.

  First published:

  Tags: Coronavirus, VIRAL NEWS, Viral Videos

  ఉత్తమ కథలు