గలగలపారుతున్న గోదారిలా ఉంది కదా.. కానీ అవి నీళ్లు కాదు.. మేఘాలు.. Watch Video

మేఘాలు జలపాతంలా పారుతున్న దృశ్యం (Screen Grab)

హర్ష్​ గోయాంక ట్వీట్​ వెంటనే వైరల్​గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను 19 వేల మంది వీక్షించారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని సైమన్ జేగర్ అనే వ్యక్తి తన కెమెరాలో బంధించారు. దాన్ని మొదటగా ‘ది బెటర్​ ఇండియా’ తన ట్విట్టర్ హ్యాండిల్​ ద్వారా పోస్ట్ చేశారు.

  • Share this:
సామాన్యులే కాదు ప్రముఖ వ్యాపారవేత్తలు సైతం సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటున్నారు. ప్రపంచంలో జరిగే సంఘటనలు, వాటిపై తమ అభిప్రాయాలు, సామాజిక అంశాలు, స్పూర్తి నింపే అంశాలను సోషల్​ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకుంటున్నారు. వీరిలో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయాంక ముందు వరుసలో ఉంటారు. తాజాగా, ఆయన తన ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసిన ఒక అద్భుతమైన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. దట్టమైన తెల్లని మేఘాలు కొండల మీద నుంచి ఒక దానిపై నుంచి ఒకటి నీరు ప్రవహిస్తున్నట్లుగా కదులుతున్న వీడియోను ఆయన షేర్​ చేశారు. అచ్చం జలపాతం లాగా మేఘాలు కిందకు కదిలే ఈ సుందరమైన దృశ్యం మనల్ని మంత్రముగ్థుల్ని చేస్తుంది. మిజోరం రాష్ట్రంలోని ఐజ్వాల్​లో కనిపించిన ఈ సుందరమైన దృశ్యాన్ని మొదటగా ‘ది బెటర్ ఇండియా’ తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది.

ఆ వీడియోను చూసి ఆకర్షితుడైన గోయెంకా వెంటనే రీట్వీట్ చేశారు. ‘‘కొండ మీద నుంచి కిందకు దూకుతున్న మేఘాలు.. మిజోరాం రాజధాని ఐజ్వాల్​లో కనువిందు చేస్తున్నాయి. మేఘాలు తెలుపు వర్ణాన్ని సంతరించుకొని జలపాతాన్ని తలపిస్తున్నాయి. ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే మేఘాలు ఇలా మారుతాయి. కొండల నుంచి నీరు ప్రవహిస్తున్నట్లుగా మేఘాలు కదులుతున్నాయి. ఇది చూడటానికి మన రెండు కళ్లు చాలవు. ఇది చాలా అరుదైన సుందరమైన దృశ్యం.”అంటూ కామెంట్​ చేశాడు.

వైరల్​గా మారిన వీడియో..



కాగా, హర్ష్​ గోయాంక ట్వీట్​ వెంటనే వైరల్​గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను 19 వేల మంది వీక్షించారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని సైమన్ జేగర్ అనే వ్యక్తి తన కెమెరాలో బంధించారు. దాన్ని మొదటగా ‘ది బెటర్​ ఇండియా’ తన ట్విట్టర్ హ్యాండిల్​ ద్వారా పోస్ట్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియోకు వేల కొద్ది వ్యూస్​, లైక్స్​, కామెంట్స్​ వచ్చి పడ్డాయి. సోషల్​ మీడియాలో ఈ వీడియోని చూసిన ఒక నెటిజన్​ వావ్​! అద్భుతం అంటూ కామెంట్​ చేశాడు. మరొక నెటిజన్​ స్పందిస్తూ ‘‘ఈ వీడియో షేర్​ చేసినందుకు ధన్యవాదాలు, ఇది నిజంగా చాలా అద్భుతమైన వీడియో. ఇంతటి అద్భుతమైన దృశ్యాన్ని కళ్ల ముందుకు తెచ్చిన హర్ష్​ గోయెంకాకు ధన్యవాదాలు.” అని కామెంట్​ చేశాడు.
Published by:Ashok Kumar Bonepalli
First published: