అమ్మో... విమానాలు ఇలా దిగితే కష్టమే... సియారా తుఫానుకో దండం...

Europe : తుఫాను వస్తుంది కదా అని పనులు వాయిదా వేసుకోలేం కదా... అనుకుంటూ... ఫ్లైట్ అధికారులు ప్రాణాలకు తెగించి విమానాలు నడుపుతున్నారు. ప్రయాణికులు దేవుడా నువ్వే కాపాడాలి అంటూ ప్రయాణిస్తున్నారు.

news18-telugu
Updated: February 17, 2020, 11:10 AM IST
అమ్మో... విమానాలు ఇలా దిగితే కష్టమే... సియారా తుఫానుకో దండం...
అమ్మో... విమానాలు ఇలా దిగితే కష్టమే... సియారా తుఫానుకో దండం...
  • Share this:
Europe : విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు... పెలెట్లు ఎంతో నేర్పుతో... పైకి తీసుకెళ్తారు. అదే విమానం రన్‌వే పై ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రం పైలెట్లకు పెద్ద సవాలే. ఆ సమయంలో ఏ ఈదురు గాలో వస్తే... విమానం ఓ పట్టాన రన్‌వై పై దిగదు. ఇప్పుడు యూరప్‌ని సియారా తుఫాను పట్టుకుంది. ఫలితంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. అందువల్ల రన్‌వేపై విమానాలు దిగడం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఆల్రెడీ చాలా విమానాశ్రయాల్లో వందల కొద్దీ విమాన సర్వీసులను రద్దు చేసేశారు. కన్ని విమానాలు మాత్రమే ఎగురుతున్నాయి. వాటిని ల్యాండ్ చెయ్యడం కూడా సమస్యవుతోంది. ఇలాంటి సమయంలో పైలెట్లు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. విమానంలో ప్రయాణికుల ప్రాణాలు పైలెట్ల చేతిలో ఉంటాయి కదా. వాళ్లు తమ ప్రాణాలు కూడా పణంగా పెట్టి విమానం నడుపుతారు. టేకాఫ్ సమయంలో విమానం పక్కకు ఒరిగినా, విమాన టైర్లు పేలినా, ఏ పక్షో ఇంజిన్‌లోకి వెళ్లినా, మంటలు చెలరేగినా, ఎయిర్‌పోర్టో గోడల్ని ఢీ కొట్టినా... ఇలా ఏ తేడా జరిగినా... విమానం పేలిపోయే లేదా మంటల్లో తగలబడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా పైలెట్లు విమానాలు నడుపుతున్నారు.ప్రస్తుతం ఐర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, జర్మనీలో సియారా తుఫాన్ ఉంది. ఆయా దేశాల్లో విమానాల్ని ల్యాండ్ చెయ్యడం ఎంత కష్టమవుతోందో తెలుపుతూ అప్ లోడ్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన చాలా మంది వర్రీ అవుతుంటే... కొంత మంది పైలెట్ల సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. ఓ వీడియోలో ఎమిరేట్స్ ఎయిర్‌బస్ A380 యూకేలోని బర్మింగ్‌హామ్ ఎయిర్‌పోర్టులో దిగుతూ... ఈదురుగాలి సమస్య ఎదుర్కొంది.
మరో వీడియోలో విమానం ల్యాండ్ అవుతూ వర్షం, ఈదురు గాలుల్లో చిక్కుకుంది. ఆ సమయంలో భారీ వర్షం కురుస్తుండటం సమస్యైంది. లండన్ హీత్రో విమానాశ్రయంలోనూ అంతే. బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానం ల్యాండ్ అయినట్లే అయ్యి... తిరిగి గాలి వల్ల టేకాఫ్ అయిపోయింది.ఇలా విమానం అటూ ఇటూ కదులుతూ... దాదాపు భూకంపం వస్తున్న ఫీల్ ప్రయాణికులకు కలిగిస్తూ ఉంటే... విమానాల్లో ప్రయాణికులు హ్యాపీ, కూల్ అంటూ ప్రశాంతంగా ఉండలేరు కదా. వాళ్ల అరుపులూ, ఆర్తనాదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎయిర్ యూరోపా ఫ్లైట్‌లో ప్రయాణికుల ఆర్తనాదాల్ని ఒకరు యూట్యూబ్‌లో పెట్టారు. ఈ విమానం వరుసగా ఐదుసార్లు ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించి... చివరకు ల్యాండ్ అయ్యింది. ఆ అర గంట పాటూ ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం కనిపించింది. విమానంలో వస్తువులు, లగేజీ అటూ ఇటూ కదిలిపోయాయి. ప్రయాణికులు కూడా ముందుకూ వెనక్కూ కదిలిపోయారు.

విమాన ప్రమాదాలతో వచ్చిన సమస్యేంటంటే... ఇవి జరిగితే తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఏ బస్సో, కారో అయితే... సైడ్ విండో తీసి బయటకు దూకేయవచ్చు. విమానంలో అసలు విండో ఓపెన్ చెయ్యడమే ప్రమాదం. విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు తేడా వస్తే... మొత్తం వెంటనే పేలి... మంటల్లో కాలి బూడిదవుతుంది. కనీసం ప్రయాణికులు తప్పించుకునేంత ఛాన్స్ కూడా ఉండదు. అందుకే విమానాలు ల్యాండ్ అయ్యేటప్పుడు ప్రయాణికుల్లో చాలా మంది దేవుణ్ని ప్రార్థిస్తారు తమను కాపాడమంటూ.
First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు