హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: ఈ వంటలక్క ఏం చేసిందో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌ అవ్వడం పక్కా! జడ్జీలకు మండిపోయింది! నవ్వు ఆపుకోలేరు!

Viral Video: ఈ వంటలక్క ఏం చేసిందో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌ అవ్వడం పక్కా! జడ్జీలకు మండిపోయింది! నవ్వు ఆపుకోలేరు!

కుకింగ్ షోలో మహిళ, జడ్జీలు

కుకింగ్ షోలో మహిళ, జడ్జీలు

ఈ బిర్యానీని మీకోసం కష్టపడి తీసుకొచ్చానని.. మీరు టేస్ట్ చెయ్యాల్సిందేనని పట్టుబట్టింది. ఆమె తీరుకు ఆగ్రహించిన జడ్జెస్‌లో ఒకరు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పాకిస్థాన్‌(Pakistan)కుకింగ్‌ షో(Cooking show)లో ఓ మహిళ(woman) చేసిన పనికి అక్కడున్న జడ్జీల(judges)కు మైండ్‌పోయింది.. మండిపోయింది.. చిర్రెత్తుకొచ్చింది.. మన డ్యాన్స్‌ షోల్లో కొన్నిసార్లు ఎలాగైతే జడ్జీలు లేచి వెళ్లిపోతారో.. అక్కడ కూడా అలానే జరిగింది. ఆమె చేసిన పనికి.. తర్వాత ఆమె వాదనకు జడ్జీలకు ఏం మాట్లాడాలో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఆ మహిళ లాజిక్‌కు లెఫ్ట్ బ్రెయిన్‌ రైట్ లెగ్‌లోకి వచ్చినంతా పనైంది. పాకిస్థాన్‌ కుకింగ్ షోలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో ఫుల్‌గా వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మహిళ మాటలకు పగలబడి నవ్వుతున్నారు. ఇంతకీ ఆ మహిళ ఏం చేసింది? ఎందుకీ వీడియో వైరల్ అవుతుంది..?

జడ్జీలకు దిమ్మ దిరిగే షాక్:

పాకిస్థానీ కుకింగ్ షో ది కిచెన్ మాస్టర్ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అన్ని కుకింగ్ షోలలో లాగే ఈ షోలో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్లు టెస్టీ ఫుడ్‌ తయారు చేసి జడ్జెస్‌ను ఇంప్రెస్‌ చేయాలి. ఈ కుకింగ్ షోలలో కేవలం వండటమే కాకుండా వండిన పదార్థాన్ని అందంగా ప్లేట్లలో సర్థడం, ఆర్ట్‌ఫుల్‌గా చూపించడం కూడా చేయాలి. అందులో భాగంగా ఓ మహిళ బిర్యానీ(Biryani) బాక్స్‌ తీసుకువచ్చి జడ్జెస్ ముందు పెట్టింది. బిర్యానీని ఎందుకు ఇలా బాక్స్ లో తీసుకొచ్చావని.. ప్రెజెంట్‌ ఎందుకు చేయ్యలేదని ఆమెను ప్రశ్నించగా.. ఆ మహిళ చెప్పిన సమాధానంతో జడ్జీలకు మైండ్‌ పోయినంతా పని అయింది. రెస్టారెంట్(Restaurant)లో ఇలాగే ఇచ్చారని ఆమె సమాధానమివ్వడంతో జడ్జెస్‌ షాక్‌కు గురయ్యారు. రెస్టారెంట్‌ను ఫుడ్‌ను తీసుకురావడమేంటో వాళ్లకి అర్థం కాలేదు.. నువ్వు వండిన ఫుడ్‌ ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు..వెంటనే ఆ బిర్యానీ బాక్స్ తీసుకుని వెళ్ళిపోమని ఆమెకు చెప్పారు. అయితే అప్పుడా మహిళా మాట్లాడిన లాజిక్‌కు జడ్జీకి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

వింత వాదన:

తమ ప్రాంతంలో ఇదే బెస్ట్ బిర్యానీ అని మహిళ సమాధానం చెప్పింది. జడ్జెస్‌తో వాదనకు దిగింది. తాను వండిందే తీసుకురమ్మని మీరు ఎక్కడా చెప్పలేదు అని కౌంటర్ అటాక్ చేసింది. సదరు మహిళ చెప్పిన మాట విన్న జడ్జీలు కంగుతిన్నారు. ఈ బిర్యానీని మీకోసం కష్టపడి తీసుకొచ్చానని.. మీరు టేస్ట్ చెయ్యాల్సిందేనని పట్టుబట్టింది. ఆమె తీరుకు ఆగ్రహించిన జడ్జెస్‌లో ఒకరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. షోలో టెలికాస్ట్ అయిన ఈ వీడియోను సోషల్‌మీడియాలో ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. నిమిషాల్లో వీడియో వైరల్‌(video Viral)గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతుండగా.. మరికొందరు మాత్రం ఇది టీఆర్‌పీ స్టంట్ అంటున్నారు.

First published:

Tags: Cooking show, Pakistan

ఉత్తమ కథలు