news18-telugu
Updated: November 24, 2020, 11:45 AM IST
ప్రతీకాత్మక చిత్రం
కఠోర సాధన చేస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదని ఇప్పటికే ఎంతో మంది నిరూపించారు. ఎంతోమంది తమకు ఉన్న స్పెషల్ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసి అందరి మన్నలను పొందుతుంటారు. అటువంటి కోవలకే వస్తాడు ఇంగ్లాండ్‌కు చెందిన ప్రముఖ మెజీషియన్ మార్టిన్. సాధారణంగా స్టేజ్ షోలపై మ్యూజిక్ ప్రదర్శననే ఇప్పటి వరకు చూశాం. కానీ, ఇంగ్లాండ్‌కు చెందిన ఈయన మాత్రం నీటి అడుగున మ్యూజిక్ ప్రదర్శన చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించుకున్నాడు. ఇంగ్లాండ్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన మార్టిన్ అనే మెజీషియన్, ఐవర్ హీత్‌లోని పైన్‌వుడ్ స్టూడియోలో ఉండే నీటి కొలను అడుగున కళ్లజోడు, ఆక్సిజన్ మాస్కుతో దిగి దాదాపు మూడు నిమిషాల పాటు మ్యూజిక్ ట్రిక్స్‌ను ప్రదర్శించి ఔరా అనిపించాడు. వృత్తిపరంగా మెజీషియన్ అయిన మార్టిన్ రీస్ కేవలం మూడు నిమిషాల్లో 20 మ్యాజిక్ ట్రిక్స్ నీటి అడుగున ప్రదర్శించడం ద్వారా గిన్నిస్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నాడు.
అతను నీటి అడుగున చేసిన మ్యాజిక్ ట్రిక్స్‌కు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో #GWRday హ్యాష్‌ట్యాగ్ పేరుతో షేర్ చేసింది. దీనికి నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభించింది.
నెటిజన్ల నుంచి ప్రశంసలు
ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ఇప్పటివరకు నెటిజన్ల నుంచి 1300 లైక్‌లు, అనేక మంది నుంచి ప్రశంసలు దక్కాయి. కాగా, మార్టిన్ ఈ ఘనత సాధించడం వెనక ఎంతో కఠోర శ్రమ దాగి ఉంది. నీటి అడుగున మేజిక్ ప్రదర్శినను ఒక సవాలుగా స్వీకరించాడు. ఇది వరకు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలను చేశాడు. హాస్పిటల్లో ఉన్న పిల్లలకు వినోదాన్ని అందించడానికి మార్టిన్ స్ప్రెడ్ ఎ స్మైల్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఎన్నో మెజీషియన్ ప్రదర్శనలు చేశాడు. దానిలో భాగంగానే తాను తాజాగా సాధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ఘనతను ‘స్ప్రెడ్ ఎ స్మైల్’ పిల్లలు, వారి కుటుంబ సభ్యులకు అంకితం చేశాడు.
మార్టిన్ ఈ క్రొత్త రికార్డ్ సృష్టించడం ఇదే మొదటిసారేం కాదు. నీటి అడుగున ఒక నిమిషం పాటు ఉండి 18 మ్యూజిక్ ట్రిక్స్‌ను ఇదివరకే ప్రదర్శించి రికార్డు నెలకొల్పాడు. అంతేకాక స్కైడైవ్‌తో 11 మ్యాజిక్ ట్రిక్స్ ప్రదర్శనలు ఇవ్వడం, కళ్ళకు గంతలు కట్టుకొని 24 మ్యాజిక్ ట్రిక్స్ ప్లే చేయడం. విండ్ టన్నెల్లో కేవలం మూడు నిమిషాల్లో 8 మ్యూజిక్ ట్రిక్స్‌ను ప్రదర్శించడం వంటి రికార్డులను నెలకొల్పాడు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 24, 2020, 11:43 AM IST