నేటి సోషల్ మీడియా యుగంలో అబద్ధాల సంచారం అధికమైంది. టెక్నాలజీ సహాయంతో దొంగ వీడియోలు, ఫొటోలను తయారు చేసి అనేక మంది ఇంటర్ నెట్లోకి వదులుతున్నారు. వ్యూస్ కోసం కొందరు ఇలా చేస్తుంటే.. జనాలను ఫూల్స్ చేసేందుకు మరి కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. చాలా మంది అలాంటి ఫొటోలు, వీడియోలు నిజమని నమ్మి షేర్ చేస్తున్నారు. ఇలా చేసిన తర్వాత అది అవాస్తవమని తేలడంతో ఫూల్ అవుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో ఇంటర్ నెట్లో వైరల్ గా మారింది. కోళ్లను పట్టుకోవడానికి వచ్చిన ఓ భారీ అనకొండను డ్రమ్ములో బంధించినట్లుగా ఆ వీడియోలో ఉంది.
Trying to catch who’s been stealing the chickens... pic.twitter.com/TpBhixH5CK
— Science is Amazing (@AMAZlNGSCIENCE) November 20, 2020
ఆ వీడియోలో నీటి గుంత పక్కన ఓ పెద్ద డ్రమ్ ఉంటుంది. ఆ డ్రమ్ వద్దకు ఓ భారీ కొండ చిలువ వచ్చి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అయితే డ్రమ్ములోకి వెళ్లిన ఆ కొండ చిలువ బయటకు రాలేక కొట్టుకుంటుంది. అత్యంత సస్పెన్స్ దృశ్యాలు ఉన్న ఈ వీడియో ఇంటర్ నెట్లో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను పోస్టు చేసిన 24 గంటల వ్యవధిలోనే 1.2 మిలియన్ల మంది చూశారు. అయితే ఈ వీడియోలో ఉన్నది నిజమా కాదా అని తేల్చేందుకు ప్రముఖ ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది.
Sometimes I hate the internet pic.twitter.com/azfi99WxNZ
— Tony Digs (@ToneDigz) July 20, 2019
అది మానిప్యులేటెడ్ వీడియో అని ఆ వెబ్ సైట్ తేల్చింది. ఈ ఫేక్ వీడియో కూడా రెండేళ్ల నాటిదని నిర్ధారించింది. ఆ విడియోలో డ్రమ్ములాగా కనిపించేది చిన్న పైపు కాగా.. పాము కూడా వాస్తవానికి చాలా చిన్నది. ఒరిజినల్, ఫేక్ వీడియోలను పక్క పక్కన చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతుండగా.. మరి కొందరు ఫేక్ వీడియో తయారు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వీడియోలతో ఏది నిజమో, ఏది అబద్ధమో తెల్చుకోవడం కష్టంగా ఉందంటూ వాఖ్యానిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fact Check