అబ్బా ఏం పాడాడు.. చింపేశాడు.. గాల్లో తేలిపోయినట్లుగా.. కాళ్లు భూమ్మీద నిలవనట్లు.. చేతులు తెలియకుండానే ఊగిపోతున్నట్లు ఇరగదీశాడు.. గుజరాత్ జానపద గాయకుడు కీర్తిదన్ గద్విపై అక్కడి ప్రజల అభిమానానికి అవధులు ఉండవని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఆయనకు ఏం ఇచ్చినా తక్కువే అని అనిపించేలా కీర్తిదన్(Kirtidan Gadhv)పై అభిమానులు నోట్ల కట్టల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కీర్తిదన్‌పై కరెన్సీ రెయిన్:
వల్సాద్‌లో అగ్నివీర్ గో సేవా దళ్ ప్రత్యేక భజన కార్యక్రమాన్ని నిర్వహించింది. అక్కడికి జానపద గాయకుడు కీర్తిదాన్ గాధ్విని సేవాదళ్ ఆహ్వానించింది. ఆ కార్యక్రమంలో ఆయన ఓ మంచి ఫోక్ సాంగ్ పాడారు. ఆ పాటకు అక్కడున్న సంగీత ప్రియులు మైమరిచిపోయారు. ఆ పాటకు కొందరు చిన్న పాటి స్టెప్పులేశారు. మరి కొందరైతే అభిమానం హద్దులు దాటిపోయింది. దీంతో కీర్తిదన్‌పై నోట్ల వర్షం(currency rain) కురిపించారు. రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను వేదికపైకి వెదజల్లారు. ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి నోట్లు చల్లడం ప్రారంభించారు. దీంతో వేదిక మొత్తం కరెన్సీ నోట్లతో నిండిపోయింది. అయితే జానపద గాయకులు ఎక్కడ ప్రోగ్రామ్స్ నిర్వహించినా గుజరాత్‌లో వాళ్లపై ప్రజలు, కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు నోట్ల వర్షం కురిపిస్తారు. గతంలో నవసరి గ్రామంలో కీర్తిదన్ కచేరీ ఏర్పాటు చేస్తే..ఆ సమయంలో ఏకంగా రూ.50 లక్షల నోట్ల వర్షం ఆయనపై కురిపించారు. అయితే ఇలా వచ్చిన డబ్బుని సామాజిక సేవకు మాత్రమే వినియోగిస్తారని సమాచారం. అయితే ఇలాంటివి కాకుండా ఈ మధ్య కాలంలో అర్థంపర్థం లేకుండా, మంచి కోసం కాకుండా, షో ఆఫ్ కోసం డబ్బులు విసిరేవాళ్లు ఎక్కువయ్యారన్న వాదన వినిపిస్తోంది.
#WATCH | People showered money on singer Kirtidan Gadhvi at an event organised in Valsad, Gujarat on 11th March pic.twitter.com/kH4G1KUcHo
— ANI (@ANI) March 12, 2023
ఈ మధ్య ఇదేదో ట్రెండ్‌లాగా మారిపోయింది:
ఈ మధ్య కాలంలో కరెన్సీ నోట్ల కట్టలు విసరడం ట్రేండ్ లాగా ఐపోయింది. ఎక్కడ చూసినా.. సమయం, సందర్భం లేకున్నా నోట్ల కట్టలు వెదజల్లడం ఫ్యాషన్‌గా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లో, ఇతర శుభకార్యాల్లో బిల్డప్ కోసం డబ్బులు ప్రజలపైకి విసురుతున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. అయితే తీసుకునే వాళ్లకు లేనిది ఇచ్చేవాళ్లకి ఎందుకంటూ మరికొందరూ వీటిని సమర్థిస్తున్నారు. ముఖ్యంగా గుజరాత్(gujarat)లో ఈ ట్రేండ్ బాగా కనిపిస్తోంది. గత నెలలో మెషనా జిల్లాలో ఓ మాజీ సర్పంచ్ తన ఇంటి డాబాపై నుంచి కరెన్సీ నోట్ల వర్షం కురిపించాడు. మేనల్లుడి పెళ్లి కావడంతో సంతోషంగా ఫీలై... లక్షలు కుమ్మరించాడు. కెర్రీ తహసీల్లోని అగోల్ గ్రామంలో మేనల్లుడు రజాక్ పెళ్లి సందర్భంగా మాజీ సర్పంచ్ కరీమ్ యాదవ్ బరాత్ నిర్వహించాడు. ఈ క్రమంలోనే ఓ బిల్డింగ్‌పై నిలబడి రూ.500 నోట్లను ప్రజలపై వెదజల్లాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat