Home /News /trending /

WATCH ELDERLY COUPLE STEALS KISSES WHILE WORKING OUT INTERNET SAYS GOALS GH VB

Elderly Couple Kisses: వర్కవుట్స్ చేస్తూ వృద్ద జంట రొమాన్స్.. నెట్టింట్లో వైరల్​ అవుతున్న వీడియో..

వర్కవుట్స్ చేస్తూ వృద్ద జంట రొమాన్స్.

వర్కవుట్స్ చేస్తూ వృద్ద జంట రొమాన్స్.

ఒక వృద్ద జంట పబ్లిక్‌ ప్లేస్​లో వర్కవుట్స్​ చేస్తూ ముద్దులు పెట్టుకున్నారు. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఈ వీడియో తీసి గుడ్​న్యూస్​ మూమెంట్​ అనే ఇన్​స్టాగ్రామ్​ పేజీలో అప్​లోడ్​ చేశాడు.

మానవ జీవితంలో ముద్దుకు ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇష్టమైన వారి మీద మాటల్లో చెప్పలేని ప్రేమ చూపించాలంటే అది ఒక్క ముద్దుతోనే సాధ్యమవుతుంది. అందుకే, సినిమాల్లో(films) వచ్చే ముద్దు సన్నివేశాలు తెగ పాపులర్​ అవుతుంటాయి. కేవలం ముద్దు సీన్ల కోసమే సినిమాను చూసే కుర్రకారు ఉంటారంటే అతిశయోక్తి లేదు. సినిమాల్లోనే కాదు బయట కూడా కొందరు పబ్లిక్​గానే(Public) ముద్దులు పెట్టేసుకుంటారు. ఈ క్లిప్స్​ సోషల్​ మీడియాలో(Social Media) తెగ వైరల్​(Viral) అవుతుంటాయి. క్షణాల్లో మిలియన్ల కొద్ది వ్యూస్(views)​ వచ్చి పడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఒక వృద్ద జంట పబ్లిక్‌ ప్లేస్​లో వర్కవుట్స్​ చేస్తూ ముద్దులు పెట్టుకున్నారు. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఈ వీడియో తీసి గుడ్​న్యూస్​ మూమెంట్​ అనే ఇన్​స్టాగ్రామ్​ పేజీలో అప్​లోడ్​ చేశాడు. "కలిసి పనిచేసే జంట, ఎల్లప్పుడూ కలిసే ఉంటారు" అని వీడియోతో పాటు క్యాప్షన్​ను జోడించారు. ఇప్పుడు ఈ చిన్న క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోను క్షుణ్నంగా పరిశీలిస్తే.. వృద్ద జంట పుల్-అప్ బార్‌పై వర్కవుట్స్​ చేస్తుండటాన్ని మనం గమనించవచ్చు. పురుషుడు పుల్​ అప్​ బార్​పై పుష్-అప్స్​ చేస్తుండగా.. స్త్రీ అతనికి ఎదురుగా పుల్​అప్స్​ చేస్తుంది. ఇద్దరూ ఒకేసారి వర్కవుట్స్​ చేస్తూ పదేపదే ముద్దులు పెట్టుకోవడాన్ని మనం గమనించవచ్చు. అయితే, ఆ వయస్సులో కూడా వారిద్దరూ పుల్-అప్‌లు, పుష్-అప్‌లను ఎటువంటి మిస్టేక్​ లేకుండా చేయడం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఈ అందమైన జంట వర్కవుట్​ వీడియోను ఇప్పటివరకు16 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో దాదాపు 62,000 లైక్స్​ను పొందింది.




నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోన్న వీడియో..
కాగా, ఈ వీడియోపై నెటిజన్లు పాజిటివ్​గా రియాక్ట్ అవుతున్నారు. కొందరు ఈ జంటను ఆరాధిస్తే, మరికొందరు వృద్ధాప్యంలో మేము కూడా అలాంటిదే కోరుకుంటున్నట్లు ఫన్నీగా కామెంట్స్​ చేస్తున్నారు. ఆ వయస్సులో పుల్-అప్‌లు, పుష్-అప్‌లను చేయడమే కాకుండా వినూత్న రీతిలో ఒకరినొకరు ముద్దులు ఇచ్చుకోవడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.




ఈ వీడియోపై ఒక నెటిజన్ స్పందిస్తూ.. "వావ్​.. ఈ వయస్సులో కూడా వారు తమ రొమాంటిక్​ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.”అని రాసుకొచ్చారు. మరొకరు “పుల్​అప్స్​ చేస్తూ తన భర్తకు ముద్దులు ఇస్తున్న మహిళకు ఉన్న శక్తి అమోఘం.” అంటూ కామెంట్​ చేశాడు. మరో నెటిజన్​ వ్యాఖ్యానిస్తూ "ముద్దుల పోటీలో మిమ్మల్ని ఓడించాలంటే తాతలు దిగి రావాల్సిందే." అని కొనియాడారు.
Published by:Veera Babu
First published:

Tags: Trending news, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు